Anjani Gayathri

Inspirational Others

4  

Anjani Gayathri

Inspirational Others

ఎగసిపడే కెరటం

ఎగసిపడే కెరటం

2 mins
342



     ఎగసిపడే కెరటం

          

    అంజనీ గాయత్రి 


 ఆమని సాయంత్రం వేళ బీచ్ కి వెళ్లి స్నేహితురాలు అయిన పల్లవి కోసం ఎదురు చూస్తూ బీచ్ ఒడ్డున కూర్చుంది. 


 పల్లవి రావటం ఆలస్యమయింది.ఇంతలో ఆమనికి సముద్రపు అలలు ఎగిసిపడుతూఒడ్డుకు రావటం.. అలాగే వెనుకకు వెళుతుండటం చూస్తూ, తన గత జ్ఞాపకాలు లోకి జారుకుంది. 


 గతంలో ఆమని వసంత్ ను అమితంగా ఇష్టపడి ప్రేమించింది.. కానీ వసంత్ వాళ్ల ఫ్యామిలీ బాగా ధనవంతులు.ఆమని మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. వసంత్ కి ఒక చెల్లెలు ఉంది.ఆమె పేరు సుమ.


 సుమకి మేనత్త కొడుకు తో సంబంధం కుదుర్చుకున్నారు... కానీ మేనత్త కి కూతురు కూడా ఉంది.ఆమె పేరు లత.


 లతను వసంత్ కు ఇచ్చి వివాహం చేయాలని పెద్దలు అనుకుంటారు.ఈ విషయం బీచ్ దగ్గర కలిసినపుడు వసంత్ ఆమనికి చెప్పాడు.



 ఆ విషయం తెలుసుకున్న ఆమని " పెద్దలుకు భయపడి నా ప్రేమను వదులుకుంటావా...? " అంటూ నిలదీసింది . 


 "ఎప్పటికీ నిన్ను వదులుకునే ప్రసక్తే లేదు " అంటూ ఆమె చేతిలో చేయి వేసి చెప్పాడు...


వసంత్ పై నమ్మకంతో ఉన్న ఆమె బీచ్ లోని ఇసుక లో తమ పేర్లు రాస్తూ... పేర్లతో కూడిన మట్టిని కెరటం వచ్చేలోపు తన చేతిలోకి తీసుకుని , " మన ప్రేమ ఎప్పుడు ఓడిపోదు అంటూ గర్వంగా వసంత్ కేసి చూస్తూ ఆ మట్టిని వసంత్ పై చల్లుతూ అల్లరి పెట్టింది."


 ఆమె నుండి తప్పించుకోవడానికి సముద్రపు నీటిని ఆమెపై జల్లుతూ అల్లరి పెట్టాడు వసంత్. 


 కానీ వసంత్ వాళ్ళింటిలో చెల్లెలి నిశ్చితార్థం రోజు వసంత్ పై ఒత్తిడి తెచ్చి, వసంత్ లత తో పెళ్లికి ఒప్పుకోకపోతే సూసైడ్ చేసుకుంటానంటూ వసంత్ తండ్రి బెదిరించడంతో తప్పని పరిస్థితుల్లో పెళ్లికి ఒప్పుకున్నాడు...



 అదే రోజు వసంత్, లతల నిశ్చితార్థం కూడా జరిగిపోతుంది.. విషయం తెలిసినా ఆమని ఏమి చేయలేక పోతుంది. ఎందుకంటే వాళ్ల మధ్య అంతస్తులు తేడా.


 ఆమనికి వెనుక ఎవరూ లేకపోవడం , చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోతుంది. దూరపు బంధువు దగ్గర ఉంటూ చదువుకుంటూ ఉంటుంది.


 వసంత్.. లత ల పెళ్లి నిశ్చితార్థం జరిగిన నెల రోజులకి అయిపోతుంది. 


 ఇంతలో ఆమని వెనుక నుంచి పల్లవి వస్తూ ఆమనిని ఎంత పిలిచినా తన లోకంలో ఉండటం వల్ల ఆమని పలకదు..


"ఏమిటి..? గతం లో విహరిస్తున్నావా..? "అంటూ పల్లవి అనగానే.....



"విహరించడానికి ఏముంది నాకు... ఒంటరితనం.. జ్ఞాపకాలు తప్ప?" అంటూ బాధపడుతూ,


"ఆ కెరటాలకు.. నాకు పెద్ద తేడా ఏముంది?? అవి ఉవ్వెత్తున వస్తూ మరలా వెనుకకు పోతాయి.. అచ్చంగా నేను ,నా కోరికలు అంతే! ఎంత వేగంగా వస్తాయో, అంతే వేగంగా పోతాయి! ఎగసిపడే కెరటమే నా జీవితం!" అంటూ నిట్టూరుస్తుంది ఆమని...


 ఆ మాటలు విని పల్లవి,

 " కెరటాలకి అడ్డుకట్ట ఎలా అయితే వేస్తామో అలాగే నీ ఆలోచనలు నుంచి వసంత్ ని తుడిచెయ్.నీకు ఏమి తక్కువ?? అందం,చదువు ఉంది. వసంత్ కన్న ఇంకా మంచి వాడే భర్తగా వస్తాడు " అని ఓదార్చింది పల్లవి.


" సరేలే..!! పెళ్లి మాట తర్వాత చూద్దాం.?ఇప్పుడు చీకటి పడుతోంది ఇంటికి పోదాం..!" అంటూ అక్కడనుండి లేస్తుంది ఆమని.


 ఆమనికి మంచి జీవితం దొరకాలని కోరుకుందాం. ఎగసిపడే కెరటంలా కాకుండా.... నిశ్చలంగా ఉన్న నదిలా.


    సమాప్తం


Rate this content
Log in

Similar telugu story from Inspirational