Anjani Gayathri

Inspirational Others

4.5  

Anjani Gayathri

Inspirational Others

🌹 ఆశలపల్లకి 🌹

🌹 ఆశలపల్లకి 🌹

3 mins
360


ఆశలపల్లకి


రచన :- అంజనీగాయత్రీ 


 ఆలోచిస్తూ నడుస్తోంది రంజని. హఠాత్తుగా ఉన్నట్టుండి ఆమె బట్టలు పై నీళ్లు పడ్డాయి . తలతిప్పి చూసింది. పక్కనే లారీలో నుండి వచ్చాయి. " అయ్యో! సారీ అండి, నేను వంట చేసుకుంటూ గిన్నె కడిగిన నీళ్లు ఎవరూ లేరనుకుని బయటకు పోసాను. ఇంతలో అనుకోకుండా మీరు వచ్చారు, " అని తడబడుతూ చెప్పాడు రాకేష్.


" ముందు వెనకా చూడకుండా అలా పోస్తే ఎలాగండి? నా చీర మొత్తం తడిసిపోయింది, ఇపుడు సారీ చెప్పినా ఉపయోగమేముంది? " అని చిరాకు పడింది రంజని.


" సారీ చెప్పాక కూడా అలా అంటే ఎలాగండి? కావాలని పోసానా? లారీ కేబిన్లో వంట చేసుకుంటూఇటు పక్కగా మీరు వస్తారని ఊహిస్తానా? " ఏదో రోడ్డు మీద లారీ ఆపలేదు. చెట్లు పక్కన ఎవరు రాని స్థలం కదా అని క్యాబిన్ లో నా వంట చేసుకుంటూ ఉన్నాను,

ఇంత లో మీరు వచ్చారు.


"ఓకే, ఇంక ఆపండి, దయచేసి," అనేసి వెళ్ళిపోయింది.


 లారీ క్యాబిన్లో పక్కగా చిన్న సిలిండర్ తో ఉన్న స్టవ్ మీద వంట చేసుకుని తింటూ లారీ లో అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఉంటాడు రాకేష్ , లోడ్ వేసుకుని , ఒక్కొక్క ఊరిలో రెండు మూడు రోజులు ఉండవలసి వస్తుంటుంది. పని పూర్తయ్యాక తిరుగుప్రయాణం అవుతాడు.


 ప్రతిరోజు రంజిని అదే రూటులో వెళ్ళడం, ఆమెతో గొడవ పడినప్పుడు ఆమె మాటలు, మనిషి పదే పదే గుర్తుకు వచ్చి, ఆమెను ఆరాధించడం, ప్రేమించడం మొదలు పెట్టాడు రాకేష్.


" ఆశకు హద్దు ఉండాలి, అని మనసు హెచ్చరిస్తూనే ఉంది, అయినా మనసు ఊరుకోదు, ప్రేమ కోసం తపిస్తూనే వుంది. " ఎలాగైనా ఆలోచించుకొని ఆమెతో పరిచయం పెంచుకుని మాట్లాడాలి.


 దగ్గరలో ఉన్న కిరాణా షాప్ దగ్గర ఆమె ఏదో కొనుక్కుని వెళుతూ ఉండడం గమనించి, " పంచదార కొనడానికి అని వంక తో వెళ్ళాడు.


" హాయ్ అండి బాగున్నారా?" అంటూ పలకరించాడు. బానే ఉన్నాను అనేసి వెళ్ళిపోయింది. షాప్ లో ఉన్న అతనితో " ఆమె రోజు ఇటే వెళ్తుంది, ఏదైనా జాబ్ చేస్తారా? ఏమిటి? అని ఆరా తీశాడు రాకేష్.


 " ఆమె భర్త చనిపోయాడు, స్కూల్లో టీచర్ గా చేస్తుంది, ఒక చిన్న పాప వుంది ఆమెకు ", ఆమెను చూడడానికి వెనక ముందు ఎవరూ లేరు,"అని చెబుతూ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు షాపు లోఉన్న అతను.


" అయ్యో! ఇంత చిన్న వయసులో ఎంత కష్టం వచ్చిందోఆమెకు, " అని బాధపడుతూ ఇక్కడ నుండి వెళ్ళే లోపల తన అభిప్రాయం

 చెప్పాలని అనుకున్నాడు.


అలాంటి ఆడవారికి అండగా నిలబడడం తప్పులేదు. ఎలాగైనా నా అభిప్రాయం చెప్పి ఆమె అభిప్రాయం తెలుసుకోవాలి. ఇష్టపడ్డప్పుడు ఎంతటి కష్టమైనా భరించాలి కదా.


ఒకరోజు " హాయ్ అండీ, బాగున్నారా? "అని పలకరించాడు ఎలాగైతే.

"హాయ్, అండీ! ఏమిటి మీ లారీ తో ఇక్కడే మకాం పెట్టినట్టు ఉన్నారు? " ఇంకా ఎన్నాళ్లు ఏమిటి? మీ పని పూర్తి అవడం, మీ వాళ్లని ఇన్నాళ్లు విడిచిపెట్టి ఉంటారా?" అంటూ కొనసాగించింది, వారి మధ్యమాటలు పరిచయం పెరగడం వల్ల ఆరా తీసింది.


" లేదండి? ఎప్పుడైనా ఇలా ఎక్కువ రోజులు ట్రిప్ వేయాల్సి వస్తుంది. చుట్టుపక్కల వాళ్ల తో పని ఉంది " అని సమాధానం ఇచ్చాడు. ఇదే సరైన సమయం తన మనస్సులో మాట బయట పెట్టాలని చూస్తున్నాడు. ఇప్పుడు చెప్పకపోతే ఆమె మరలా దొరకదు. ఇలాంటి అవకాశం వదులుకోకూడదు అని మనసులో గట్టిగా అనుకున్నాడు.


 అనుకున్నదే తడవుగా " మీరు ఏమీ అనుకోనంటే ఒక మాట, మీ జీవితం ఇలా ఒంటరిగా ఎంత కాలం గడుపుతారు, పాప చూస్తే చిన్నది, మీకు అండ, ఆసరా కావాలని అనిపించదా? " అని ప్రశ్నించాడు.


" ఏమి చేస్తాం అండి, అంతా నా ఖర్మ , పాప దురదృష్టం, నాన్న అనే పదానికి కరువైంది, " అని తల్లడిల్లిపోయింది.


" మీరు ఇప్పుడైనా మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు, తప్పేముంది?? "


 " నా ముఖానికి అదొక్కటే తక్కువ, పాప ఉన్న నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఎవరు ఒప్పుకుంటారు, ఆశ కైనా హద్దు ఉండాలి, " అని వాపోయింది.


" మీరు ఏమీ అనుకోనంటే, నా మనసులో మాట చెబుతా, చెప్పిన తర్వాత ఏమీ అనుకోకూడదు,


 మీరు ఓకే అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నేనుసిద్ధం గా ఉన్నాను,ఆలోచించుకుని మీరు రేపు చెప్పండి," అని అనగానే ఆశ్చర్యానికి లోనైంది తను. మరి మీ అమ్మగారు ఏమంటారు? ముందు నా అభిప్రాయం కన్నా ఆవిడది ముఖ్యం కదా.


" అమ్మ ఏమి వద్దు అనదు, నా ఇష్టానికి ఎప్పుడూ అడ్డు చెప్పదు, ఆదర్శమైన వ్యక్తిత్వం ఆమెది. అయినా నేను ఒప్పిస్తాను అమ్మను, " మాటిచ్చాడు.


" తనలో మళ్లీ కొత్త ఆశలు చిగురించాయి, తన ఆశల పల్లకిలో రాకేష్ కి చోటు ఉందని తన మనసు పదే పదే చెబుతోంది.


 నవ్వుతూ ఆమె ఇంటికి వెళ్లడం చూసి రాకేష్ మనసు ఆనందంతో ఉరకలు వేస్తోంది. ఖచ్చితంగా మంచి అభిప్రాయమే చెబుతుందని.


" రాకేష్ తొందరగా రెడీ అవ్వరా, నాకు ఫోన్ చేసింది రంజని, అప్పుడే రిజిస్టర్ ఆఫీస్ కి వచ్చేసిందట, మనం వెళ్లడమే తరువాయి, మనం చెప్పిన టైంకి అక్కడ ఉంది, టైం విలువ బాగా తెలుసు అనుకుంటా, " అని మెచ్చుకుంటూ తల్లి రాకేష్ ని తొందర పెట్టింది.


 రిజిస్ట్రార్ ఆఫీసులో ఇద్దరు దండలు మార్చుకుని, తెలిసిన వాళ్ళసాక్షి సంతకాలతో వివాహ తంతు ముగించారు. రంజని ఆశల పల్లకి లో రాకేష్ తో ఊరేగినంత సంబరంగా ఉంది.


ఆడ వారి జీవితం మోడుబారి పోయింది అనుకున్న సందర్భంలో మంచి హృదయమున్న మగమహారాజులు ఆసరాగా ఉంటే వారి ఆశలు నెరవేరి ఆశల పల్లకిలో ఊరేగినట్టే ఉంటుంది జీవితం.

🌹 సమాప్తం 🌹


Rate this content
Log in

Similar telugu story from Inspirational