Anjani Gayathri

Inspirational Others

4.7  

Anjani Gayathri

Inspirational Others

🌹 అన్నదమ్ములు🌹

🌹 అన్నదమ్ములు🌹

2 mins
285


అన్నదమ్ములు


రచన :- అంజనీ గాయత్రి దేశరాజు


" అన్నయ్యా! నీవే నాకు దారి చూపాలి, " అంటూ వచ్చాడు రవి. ఏమి చేయాలో పాలుపోవడం లేదు కృష్ణ కు. ఎందుకంటే, రవి అంతగా చదువుకోలేదు. ఏదైనా ఉద్యోగం చూపించాలని కోరుతూ కృష్ణ వద్దకు వచ్చాడు. తల్లిదండ్రులు పల్లెటూర్లో ఉంటారు.రవి అక్కడ జులాయిగా తిరుగుతూ భవిష్యత్ నాశనం చేసుకుంటున్నాడు,


తండ్రి కృష్ణ కి ఫోన్ చేసి చెప్పాడు, " ఏదైనా ఉద్యోగం చూసి పెట్టు రవికి, "అంటూ తండ్రి అడిగేసరికి,


కాదనలేక, " సరే పంపండి " అంటూ అంగీకారం తెలిపాడు. కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడంలేదు.


రవి స్వతః మంచివాడే, తెలివైనవాడే, కానీ సావాసాల వల్ల చదువు అబ్బలేదు. ఉద్యోగం లేనిదే పిల్లని ఎవరు ఇవ్వరు. తండ్రి బాధ అదే. అందుకే కృష్ణ దగ్గరకు పంపాడు.


 రవి వచ్చాడే గాని ఒక్క పనిలోనూసహాయపడకుండా తినేసి సెల్ చూసుకుంటూ కూర్చోవడం, ఖాళీ గా వున్నపుడు బయట షికార్లు తిరగడం చేస్తూ ఉంటాడు. ఉద్యోగం వెంటనే దొరకదుగా,


 ఈశ్వరి కి పిల్లల చాకిరీ తో బాటు రవి వచ్చాక అదనపు పని ఉంటుందిగా. కనీసం పిల్లల్ని స్కూల్ కి తీసుకెళ్లడం కూడా చేయడు. అందువల్ల కృష్ణదగ్గర బాధ పడుతుంది ఈశ్వరి. "బాధ్యత లేకుండా ఎలా వుంటున్నాడో??ఇలా అయితే ఉద్యోగం లో కూడా ఎలా నిలదొక్కుకుంటాడు?? ఉద్యోగం దొరికాక అయినా కష్ట పడతాడో లేదో అనుమానంగా ఉంది," అంటూ మరిది గురించి భర్తకు చెప్పి,బాధపడుతుంది.


" వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ఏమి అనకు, వదిన, ఇలా అంది అని వాడి మనసులో ముద్ర పడిపోతుంది. మంచి చెడు వాడితో నేను మాట్లాడతాను, " అంటూ భార్యకు నచ్చజెప్పాడు కృష్ణ.


 అలాగే ఒక రోజు రవిని "బీచ్ కి వెళ్దాం రా, ప్రశాంతంగా బాగుంటుంది, " అంటూ బీచ్ కి తీసుకెళ్లి అన్ని విషయాలు మాట్లాడతాడు కృష్ణ.


 తండ్రి పడే బాధగురించి చెబుతూ," అలాగే ఇక్కడ వదినా,నేను ఎంత కష్ట పడుతున్నామో చూసావా? పెళ్లయి పిల్లలు పుడితే భార్య ఒక దాని వల్ల సంసారం నడపడం అవ్వదు, ఇద్దరూ బాధ్యత గా ఉంటేనే ఆ కాపురం నిలబడుతుంది." ఒకవేళ నీకు ఉద్యోగం వచ్చినా నువ్వు స్థిరం గా ఉద్యోగం చెయ్యకపోతే నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకో?? అమ్మానాన్న తర్వాత నిన్ను చూసే దిక్కు ఉండరు. మాకు పిల్లలు బాధ్యతతో ఎలా సతమతమవుతున్నామో చూసావు గా, " అంటూ అన్నీ వివరించాడు.


" అన్నయ్య! నువ్వు చెప్పినవన్నీ నాకు ఇప్పుడు బాగా అర్థం అయ్యాయి, అమ్మ, నాన్న నాపై ప్రేమ తో ఎపుడు ఇలా చెప్పలేదు. నేను బాధ పడతాను ఏమో అనీ," నువ్వు అన్ని చక్కగా చెప్పి నాన్న తర్వాత అన్నయే మరొక నాన్న, " అవుతాడని నువ్వు నా విషయంలో నిరూపించావు. నా కళ్ళు తెరిపించావు. ఇకనుండి నువ్వు చెప్పినట్టుగా నడుచుకుంటాను అంటూ మాట ఇచ్చాడు రవి.


 ఇచ్చిన మాట ప్రకారం నడుచుకుని అన్న చూపించిన ఉద్యోగంలో నిలదొక్కుకొని తండ్రి చూపించిన మంచి అమ్మాయి వనిత ని వివాహమాడి జీవితంలో నిలదొక్కుకొని తల్లిదండ్రులతో పాటు అన్నా వదినలని కూడా తల్లి దండ్రులు గా భావించి జీవితప్రయాణం లో అంచెలంచెలుగా పైకి ఎదిగాడు. అన్నదమ్ములు ఎప్పుడూ అన్యోన్యంగా ఉండేవారు తండ్రికిచ్చిన మాటకై.


 కలిసికట్టుగా ఉంటే ఎంతటి విజయాన్ని అయినా సాధించవచ్చు అని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు.


🌹 సమాప్తం 🌹


Rate this content
Log in

Similar telugu story from Inspirational