STORYMIRROR

Nagesh Pulletikurthi

Drama Classics Inspirational

4  

Nagesh Pulletikurthi

Drama Classics Inspirational

శివరాత్రి – జాగరణ

శివరాత్రి – జాగరణ

3 mins
1

శివరాత్రి అంటే చిన్నప్పుడు ఉన్నంత ఉత్సాహం భక్తి  ఇప్పుడు లేవు ఎందుకో..

అయినా అప్పటి శివరాత్రికి వున్నది పూర్తిగా భక్తి అని అనలేం..

ఇష్టం అని చెప్పవచ్చు... అవును , చాలా ఇష్టం..

నాకే కాదు.. మా అందరికీ.

ఊహ తెలిసిన తర్వాత అంటే పన్నెండు పదమూడు ఏళ్లవయసులో శివరాత్రి వస్తుందంటే రెండు మూడు వారాల ముందే ఒక వింత ఎక్సయిటమెంట్ మొదలయ్యేది మాలో.

 భోగి పండగ తరువాత.. మమ్మల్ని అంతటి ఎక్సయితేమెంట్ కి గురిచేసేది శివరాత్రి..

భోగికి దొంగతనం గా చెట్లు కొట్టడం, పాత సామాన్లు ఇళ్ల నుండి దొంగిలించుకు రావడం వంటివి ఎక్సయిటమెంట్ కి గురిచేస్తే..

మళ్ళీ ఇప్పుడు మొత్తం పగలు రాత్రి అంతా ఇష్టం వచ్చినట్లు, ఇష్టమైన ఆటలు ఆడుకోవచ్చు..

మరీ ముఖ్యంగా  ఎవరు చదవమని చెప్పరు కూడా..

 ఉదయం లేచిన వెంటనే తలారా స్నానం చేసి దగ్గరలో వున్న శివాలయానికి తప్పకుండా అందరం కలసి వెళ్ళే వాళ్ళం.

వచ్చి తిన్న తర్వాత ఇక అసలు జాగరణ ప్రారంభం అయ్యేది..

అంటే నా ఉద్దేశ్యం ఆటలు..

రాత్రికి ఈ ఆటలు ఎలా ఆడాలి. ఎవరెవరు ఆడాలి..

ఎవరెవరు ఒక టీం లో వుండాలి. ఏఏ ఆట వస్తువులు జమ చేసుకోవాలి.

అన్నీ ఒక కొలిక్కి వచ్చే సరికి మధ్యాహ్నం భోజనాలు టైమ్ అయ్యేది.

ఇక తిన్న వెంటనే నిద్ర రెఢీ..

నిద్ర పోతే ఇంకేం జాగారం రా .. అని పెద్దవాళ్ళు అంటున్నా..

మేం మాత్రం ఆ రూల్స్ పిల్లలకి వర్తించావు పిన్నీ అని దబాయించే వాళ్ళం.

ఇక సాయంత్రం నుండి ఆటలు షురూ అయ్యేవి.

 క్రికెట్, బ్యాడ్మింటన్, రింగ్ టెన్నిస్, జోరా బాల్ , చిల్లి పెంకులు, సిగరేటె పాక్కెట్స్ తో బెచ్చాలాట, చింత పిక్కలు, ఐదు రాళ్ళ పిక్కలతో.. బహుశా గుంజన గుళ్ళు అనుకుంటా.. ఆష్టా చెమ్మా ఆట.. అప్పుడే కొత్తగా మార్కెట్ లో కి వచ్చిన బ్యాంక్ ఆట...

ఇలా ఒకటా రెండా.. ఎన్నో.. ఎన్నెన్నో..

ఇక చీకటి పడితే ఆటలకి ఇంకో మజా వచ్చేది --

మొదట దాగుడు మూతలుతో ఆటలు స్టార్ట్ అయ్యేవి, నేలపై కాలు మోపకుండా - గోడ పట్టుకోవడం, సైకిల్ రేసులు, కబడ్డీ, సైకిల్ టైర్ పోటీలు, కుంటుతూ ముట్టుకోవడం, ఇల్లా ఎన్నెన్నో ఆటలు..

ఇక్కడ ఎక్కడా శివుడి ఆలోచన లేదు, అసలు ఆయన ఊసే లేదు కదూ,

ఉదయం ఎప్పుడో పెద్దోళ్లతో గుడికి వెళ్ళి అందరితో పాటీ ఒక మొక్కు మొక్కీ వచ్చేసేవాళ్ళం అంతే.

కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు మాలో శివుడి ఊసు లేకపోయినా శివుడి జాడ వుండేదేమో కదా..

 మరి ఇప్పుడు శివరాత్రి కి ఎక్కడ చూసినా శివుడే.. శివుడు.

 ఉదయం లేచిన వెంటనే వాకిట్లో శివుడు అదే.. ఇంటికి వచ్చే పేపర్ లో శివుడు..

 మొబైలు whatsapp మెసేజ్ లలో శివుడు.. హ్యాపీ శివరాత్రి అని..

 ఇంస్టాగ్రామ్ లో శివుడు.. AI రీల్స్ లో శివుడు.. ఇక్కడ క్రియేటివిటీ ని అందరం మెచ్చుకోవాలి 

 TV లో రకరకాల ప్రోగ్రామ్ లలో శివుడు

 సినిమాలలో శివుడు,

సీరియల్స్ లో శివుడు

 మా వీధి చివర గుడిలో శివుడు.

 నేను ముందు అంటే నేను ముందు అభిషేకం చేయాలి అనే మా ఆత్రం తో శివుడు చిరాకు పడుతున్నట్లు నాకైతే అనిపించింది.

 శివుడిని నీళ్ళు పాలు పంచామృతాలతో గొప్పగా మేం చేసే అభిషేకాలతో శివుడు వంటి రంగు మారిపోతాదేమో అనిపిస్తుంది.

 ఇంట్లో పిల్లలలకి కూడా ఎప్పుడు అలా స్నానం చేయించలేదు.. అలా అభిషేకం చేశాం..

నేను ముందు అంటే నేను ముందు..

 ఇప్పుడు పడుకుంటే శివునికి కోపం వస్తుంది అపచారం అవుతుందేమో అనే భయమే ఎక్కువ

 అప్పుడు ఆడినంత సేపు ఆడి .. రోజు కన్నా త్వరగా నిద్రపోయే శివరాత్రులు..

 అప్పుడు ఆట సందడిలో పడి శివుని ఊసు లేకపోయినా శివుడి జాడ వుండేదేమో

కానీ ఇప్పుడు జన సందోహ సందడిలో శివుని జాడ మాత్రం కాన రాలేదు.

 అప్పుడు ఆటల మధ్యలో శివుడిని మర్చిపోయాం..

మరి ఇప్పుడు ఈ హడావిడి పోటీ భక్తి తో శివుడిని చూడలేకపోతున్నాం.

ఇదే మాట మా ఆవిడ తో అంటే

మాతో బాటు ఉదయాన్నే కోవెలకి వచ్చి భక్తితో స్వామి అభిషేకం చేసి, ఉపవాసం చేసి, జాగరణ చేయకుండా తప్పించు కోవడానికి ఇలాంటి దొంగ పిడి వాదాలు బాగా నేర్చుకున్నారు అని నవ్వేస్తుంది.

అవును మరి నాగురించి నాకన్నా ఎక్కువ ఆమెకే తెలుసు.

 నాకనిపించింది శివరాత్రి నాడు రాత్రి అయితే వుంది కాని శివుడు మన మధ్య లేడేమో అని.

 ఇంకా చెప్పాలంటే ఈ శివరాత్రి హంగామాలని చూసి శివయ్య ఖచ్చితంగా ఈ రోజు హిమాలయాలకి వెళ్ళిపోయి వుంటాడు.


Rate this content
Log in

Similar telugu story from Drama