Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Soudamini S

Drama

5.0  

Soudamini S

Drama

Re: మీ శివాని

Re: మీ శివాని

1 min
210


ఈ ఉత్తరం "మీ శివాని" ఉత్తరానికి సమాధానం. దీని ముందు భాగం "మీ శివాని" కధ ను చదవండి.

శివాని కి

ఈ రోజు పడుకొనే ముందు మెయిల్స్ అన్నీ చూస్తుండగా నీ మెయిల్ కనిపించింది. స్వచ్ఛమైన తెలుగు చదివి ఎన్ని రోజులయ్యిందో...


శివాని అన్న పేరు చదవగానే మనసులో ఏదో తెలియని ఆనందం. చదువు, తెలివితేటలు, సంస్కారం అన్నీ కలగలసిన నీ రూపం నా కళ్ళ మందు ప్రత్యక్షమయ్యింది. నిన్ను అభిమానించని వారు ఎవరు ఉంటారు.. ప్రక్కనున్న మనిషి గురించి ఆలోచించటానికి తీరిక లేని ఈ రోజుల్లో ఒక మనిషి జ్ఞాపకాలను ఇన్ని సంవత్సరాలుగా మనసులోనే ఉంచుకోవటం సాధ్యమా.. అలాంటి నిష్కల్మషమైన ప్రేమని పొందిన నేను ఎంత అదృష్టవంతుడిని .. ఇన్ని రోజుల తరువాత నీ నుండి ఉత్తరం వచ్చినందుకు ఆనంద పడాలో, దేవుడి దగ్గరకు వెళ్లాలని ఉబలాట పడుతున్న నీ ఆరాటానికి బాధ పడాలో అర్థం కాలేదు. కాలేజీ లో రాగ్గింగ్ జరుగుతోంది అని మా బ్యాచ్ కుర్రాళ్లపై ప్రిన్సిపల్ కు కంప్లయింట్ ఇచ్చిన శివాని ఏనా ఇంత బేల గా అయిపోయింది అని ఆశ్చర్యపోయాను.

బాధ్యత తో కూడిన ప్రేమ ఎప్పుడూ గొప్పదే...


నీవు ఎంతో గౌరవం గా నిర్వచించిన మన బంధాన్ని నిలబెట్టుకునే బాధ్యత నా మీద ఉంది. రేపు మొదటి ఫ్లయిట్ కే టికెట్ బుక్ చేసుకున్నాను. నీ మానసిక స్థైర్యం ఎంత గొప్పదో నాకంటే ఇంకెవరికి తెలుసు. నీ శరీరం పెట్టాలనుకున్న బాధ ఎంత పెద్దదైనా దాన్ని తునా తునకలు చేయగల శక్తి నీ మనసుకి ఉంది. నీలో బ్రతకాలి అన్న ఆశ చిగురించాలే కానీ కాన్సర్ లాంటి మహమ్మరి నీకొక లెక్కా. నువ్వు త్వర లోనే కోలుకుని మరొక పది మంది జీవితం లో ఆశ ని చిగురింపచేయటం నేను చూస్తాను. అందుకు నీకు నా పూర్తి సహకారం అందిస్తూ నీకు తోడు గా వుంటాను.

                                                                                                                               నిన్ను కలవటానికి ఆరాటపడుతున్న

                                                                                                                                              నీ విల్సన్.


Rate this content
Log in

More telugu story from Soudamini S

Similar telugu story from Drama