పుడమి అడుగులు
పుడమి అడుగులు
ఈ రోజు తమరి కధ ఎవర్ని ఉద్ధరించబోతుంది తండ్రీ!రాత్రి నుంచీ లాప్టాప్ తో కుస్తీ పడుతున్న కొడుకుని కొంచెం వెటకారం,ఆతృత మేళవించి అడిగింది తల్లి కోకిల...
నా కొడుకుని అలాగే తక్కువ చేసి మాట్లాడు..ఎపుడో ఒకప్పుడు అతిరధులు వేదికపై,హారతులు అందుకున్న రోజున నీ నోరు మూతపడడం ఖాయం....
అవునవును! మొన్న చెట్టు పుట్ట కథకి ఏకంగా పేపర్ వాళ్ళు మన ఇంటికి వచ్చి ఆశ్చర్యపోయినట్టే కదూ!అంది మరింత వెటకారంగా
ఆ రోజు నేను రాలేదమ్మా!ఏటయింది?అడిగింది పనిమనిషి సీతాలు
ఒసేయ్!సీతా!నా కొడుకు తడారుతున్నచెట్టు అని రాసిన కథకి తెలుగుసాహిత్యఅకాడమీ చెన్నై వాళ్ళు,ఇంటర్వ్యూ తీసుకుందామని వచ్చేరు...మన ప్రాంగణం చూసి మురిసిపోయేరు...ముక్కున వేలు కూడా వేసుకున్నారు...
అంటే!మనం పరిపించిన పలకలు బాగున్నాయేమో !అమ్మగారు అంది సీతాలు
అవును!చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిన పలకలు ఒంటరిగా ఉన్నాయని అంది కోకిల...
అవును సీతాలూ! మా చిన్నపుడు ఇంటి పేరట్లో వేప,మావిడి,రావి లాంటి చెట్లు వేసి ,చుట్టూ కూర్చోడానికి బెంచీ కట్టించేవాళ్ళు....మా అబ్బాయి తెలివిమీరి చెట్లన్నీ కొట్టించి ,ఇంటి వాకిలిని మోడు చేసి,ఖరీదైన పలకలు పరిపించేడు....ఒక్కో పలక యాభై పడిందే!
చిత్రం చూసేవు కాదు ?చెట్టుకి తడారిపోతుందని చెప్పిన రైటర్ గారు ఇంట్లో ఒక్క చెట్టు లేదు...ఎగిరినమ్మకీ వచ్చింది ఎగరనమ్మకీ వచ్చింది మెడకో డోలు అన్నట్టు.. అవార్డు ,రివార్డులు వచ్చినియ్యి....ఇంట్లో చిన్న మొక్క లేదు....ఆదుకునే వాళ్లలాగా ,ఇదిగో ఈ కుండీలు నెత్తికి కట్టేం...దానికి రోజు ఓ స్పూనుడు నీళ్లు పొయ్యాడానికి,ఐదువేలు పెట్టి స్ప్రే కొన్నాడు నా కొడుకు....
ఈలోపు ట్రింగ్ అణా శబ్దానికి అదిరిపడ్డాడు అరుణ్...
కోకిల;;ఏమైందిరా!
అరుణ్::నా ఇంకో కధ వాననీరు కు సాహిత్య అకాడమీ అవార్డ్ వచ్చిందమ్మా...పొంగిపోయాడు చెప్తూ
నా ఖర్మ!నా కొడుకుని చూస్తే,మోడు పువ్వు వేస్తున్నట్టు అనిపిస్తుంది....వీడికి భావుకత లేదు కానీ కధలు రాసేస్తాడు...అవార్డులు ఎందుకు వస్తాయో?అర్థం కాదు గెడ్డం కింద చెయ్యితో,ఆశ్చర్యపోయింది కోకిల
దేనికైనా మీరు చెప్పింది నాకు తెలీదు కానీ అమ్మగారూ)!అదృష్టం ఉండాలి అంది సీతాలు
హాలులో ఫోను రింగవుతుంటే పరిగెత్తింది సీత...అమ్మ!వదినగారు సరలమ్మ ఫోన్ చేసేరు...తొందర రండమ్మా!
ఉండవే!కాళ్ళు నొప్పులు...లేవాలా? వద్దా?
అమ్మా!అంటూ చెయ్యి నేలమీద ఆన్చి లేచింది కోకిల
సరళ వదినా! బావున్నావా....కుశలప్రశ్నలు అయినియ్యి...
వదినా!ఏరువాక పౌర్ణమికి రండి ఈ ఏడు..మీరు నాలుగేళ్ళయింది వచ్చి ఇక్కడికి...ఈ సారి తప్పకుండా రావాలి...సులక్షణకి పెళ్లి కుదిరేలా ఉంది...మాటలు జరుగుతున్నాయి...నువ్వుంటే కొంచెం బావుంటుంది వదినా! ఈ ఏడు వర్షాలు బాగా పడేలా ఉన్నాయని పంచాంగంలో చెప్పేరు...ఇంకో పది ఎకరాలు కౌలుకి తీసుకున్నాం...పిల్ల పెళ్లి చెయ్యాలి కదా!...అయ్యో వదినా...అంతా ఫోన్లోనే చెప్పేస్తున్నాను...నువ్వు అన్నయ్య అల్లుడు తప్పకుండా రండి...మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం...ఫోన్ పెట్టేసింది సరళ
చిత్రం చూడవే!సీత...మనకి నాలుగేళ్లుగా సరైన వాన లేదు...మనోళ్లు పొలాల్ని ప్లాట్లు చేస్తున్నారు...మా అన్నయ్య అదృష్టం ఏంటో!ఇంకా కొంచెం పొలం కౌలుకు తీసుకున్నాడట...వల్ల ధైర్యం ఏంటో...
ఓ సారి! చూసొద్దాం అమ్మా మీ ఊరు...ఈ పాలి నేనూ వత్తాను...అంది సీత
రెండురోజుల్లో ప్రయాణంఅనుకుని,అంతా బ్యాగులు సర్దుకుంటున్నారు...అరుణ్ కి ఎం తొలిచిందో?అమ్మ పుడమితల్లి పై కధ రాయాలి....నేను మా ఫ్రెండ్ తో కలిసి వైజాగ్ వెళ్తాను అన్నాడు మధ్యలో సర్దడం ఆపి..
నువ్వు రాయలనుకున్న కథకి మీ అమ్మమ్మ ఊరు సరైంది...వైజాగ్ లో ఏముందిరా?అరవపిచ్చోడా...మేంటల్ హాస్పిటల్ మీద కధ రాయాల్సి వచ్చినపుడు అక్కడికి వెల్దువు గానీ,ప్రస్తుతానికి మాతోరా...పైగా నీ మరదలు సులక్షణకి పెళ్ళంట...సరదాగా ఉంటాడు నీ ఫ్రెండుని కూడా అక్కడికే రమ్మను అంది...
అమ్మ!ప్లీజ్...ఆ పల్లెటూరిలో ఒక్క నిమిషం కూడా నేను ఉండలేను..ఉండను...నాన్న!మీరు చెప్పండి ప్లీజ్...నాకు యాక్...వాంతి వస్తుంది తలుచుకుంటేనే...కక్కుర్తిగా పొలాల్లోనే ఇళ్లు,నూతుల్లో నీళ్లు,మట్టి నిండిన రోడ్లు నాకు విసుపు వస్తుంది...పైగా ఏసీ కూడా ఉండదు అత్తయ్యా ఇంట్లో....
నోరుమూసుకు ఈ సరికి రా!అక్కడ చక్కబెట్టాల్సిన పనులు చాలా ఉన్నాయి...గదిమింది కోపంగా కోకిల
సరే అమ్మా! ఈసారి కి వస్తాను అంటూ కాళ్ళబేరానికి వచ్చేడు...
అసలే కోకిలకి సులక్షణ తన కోడలు కాకుండాపోతుంది అణా బాధలో ఉంది...ఈలోపు కొడుకు ఇలా అనేసరికి దుఃఖం కోపంగా బయటకువచ్చింది...కళ్ళు తుడుచుకుంటుంటే...
ఎపుడూ లేనిది?!అమ్మ ఏంటి ఇలా ?అనుకున్నాడు కానీ...ఎం కాదులే అనుకున్నాడు
ఆరు గంటల రైలు ప్రయాణం తరువాత,కారు పొలంగట్ల దారిన పరిగెడుతుంది...చిన్నగా చినుకులు పడుతున్నాయి...ఆ ఎండకి,ఈ చిరువాన చల్లని గాలిని మోసుకువచ్చింది...హాయిగా అనిపించింది...దూరమయ్యే దేనికో దగ్గర అవుతున్నట్టు ఉంది కోకిలకి..
ఈ వాతావరణం కొత్తగా,ఉల్లాసంగా ఉంది అరుణ్ కి..నాన్నా!భలే కూల్ weather కదా! వెనక్కి తిరిగి నాన్నతో అన్నాడు
నీకు అలా అనిపించిందిరా! నాకు సిటీ లోనే బావుంటుందిరా !అన్నాడు
మూతి తిప్పుకుంది కోకిల...
మీ అమ్మని చూడరా కొడకా! వాళ్ల ఊరిని ఏమీ అననివ్వదు...
అదేంటి నాన్నా!ఇది మీ ఊరు కూడా కదా!?కొడుకు అడిగేడు
ఇక్కడ .ఈవిడ ఆధిక్యత ఎక్కువరా!మాయి రెండు కుటుంబాలే !అందులో ఒకటి నా సొంత చెల్లెలు...దీని అన్నగారికే ఇచ్చేను..వాడో మూర్ఖుడు! ఆ ఊరునుంచి కదలడు...నాచెల్లిని ఆ ఊరిలోనే మగ్గబెట్టేస్తున్నాడు
ఎన్నేళ్లనుంచి దాచుకున్న అక్కసో బయట పెట్టాడు తండ్రి ..
ఇంతలో ఇల్లు వచ్చింది...అరుగుమీదే కూర్చున్నారు అంతా! పౌర్ణమికి ఊరు సిద్ధం అన్నట్టు,పెళ్లి ఇల్లులా హడావుడిగా ఉంది...
సరళ ఇంక మాతో ఎక్కడ మాట్లాడుతుంది?వదినగారు వచ్చేసిందిగా!ముద్దుగా దెప్పుతూ వెళ్ళిపోయింది పక్కింటామే..
రా వదినా! ప్రయాణం బాగా జరిగిందా ,కాళ్ళు కడుక్కోవడానికి నీరు అందిస్తుంటే,నువ్వు ఇంక కూకో!సరళమ్మా నేను వచ్చేను కదా!పనంతా నాదే ఇంక...మీ వదినమరదళ్ళు ముచ్చట్లు పెట్టుకోండి...నాకు ఎం వండాలో సెప్పేయండి అంది సీతాలు చేతిలో చెంబు లాక్కుంటూ...
బావున్నావా!సీతాలూ...నువ్వు రావడం మంచిదయిందే!మీ అమ్మాయిగారికి పెళ్లి కుదిరేలా ఉంది...వంటలు కు సాయం చేద్దువుగాని...అంది
నేను పెళ్లి సెసే ఎళ్తానమ్మా!నా భుజం మీద పనిభారం పెట్టేయండి సాలు...అంది సంబరపడిపోతూ
అత్తయ్యా!నేనుకూడా వచ్చేను...మర్చిపోయావా ?అరుణ్ అలిగేడు
అల్లుడూ!నీ రుబాబు నా దగ్గర సూపెట్టయ్యా!వేళాకోళం ఆడేడు మావ సుందరం
దూరంగా పాటలు వినిపిస్తుంటే అంతా సైలెంట్ అయిపోయారు...
మీ వదినలు ఇద్దరూ రండి!ఊరేగింపు మన సందుకి వచ్చేసింది...బిందెలతో నీరు తెండి...పసుపు కలిపి తెండి..అంటూ తుండుగుడ్డ తలకు చుట్టి,గుమ్మం బయటకు నడిచేడు
పెళ్లిలా ఉంది సంబరం...అరుణ్ ఆ అలజడిని కెమెరాలో బందిస్తున్నాడు..కొత్తగా ఉంది అంతా..
కాడెద్దులు ఇంటిముందుకు వచ్చి ఆగినియ్యి...దేవుడు బిందెలో ఓ తవుడు వడ్లు పోసింది సరళ....వదినా నువ్వు కూడా వెయ్యి...అంటూ ఓ పళ్లెం నిండా తెచ్చిన వడ్లు అందించింది...
ఊరేగింపు వెళ్ళిపోయాక...బట్టలు మార్చుకోండి వదినా స్నానం చేసి...దేవుడి పొలంలో మొదటగా దుక్కి దున్నుతారు ఈ రోజు..తాను ముస్తాబు అవ్వడానికి వెళ్ళింది..
నేనూ వత్తానమ్మా అంది సీతాలు ..
తయారవ్వు వెళ్దాం !మరి అంది కోకిల..
అమ్మా! నేనేం చెయ్యాలి?అరుణ్ కి చిరాగ్గా ఉంది,అలసటగా ఉంది పడుకుందాం అనుకున్నాడు...
నువ్వు కూడా రా బావా!నీ కథకి మంచి కాన్సెప్ట్ దొరుకుతుంది అంది వెనకనుంచి సులక్షణ
వెనక్కి తిరిగేడు చిరాగ్గా!
గుర్తున్నానా బావా! సులక్షణని...నీ మరదల్ని...దేవుడు పొలం తరువాత మీ పొలమే బావా! లెక్క చూసుకోవచ్చు ఇపుడు వస్తే....పైగా పండుగలా ఉంటుంది అక్కడ...నువ్వు చూసి తీరాలి బావా!దాన్ని షూట్ చేయడానికి నీ ఫోను బుర్ర సరిపోదు అంది నవ్వుతూ
వెల్దామా!అన్నాడు వెంటనే
ఫ్రెష్ అవ్వండి బావా! ఈలోపు నాన్న వస్తారు...మిమ్మల్ని ఎక్కడ కావాలంటే అక్కఫా తిప్పుతారు...అంది కళ్ళు తిప్పుతూ
ఆమె మాట్లాడుతుండగానే పెద్ద గుంపు వచ్చింది...దాన్ని అప్సరసలు గుంపు అనొచ్చేమో?అనుకున్నాడు మదిలో
పదినిమిషాల్లో ఎప్పుడూ లేని విదంగా తయారయ్యేడు పంచెకట్టుతో...
ఏంటే సంబరం! మరదల్ని అడిగేడు..
ఏరువాక పండుగ బావ....సంక్రాంతి తరువాత పెద్ద పండుగ..నాలుగురోజులు చేస్తాం...మీరు రారు ఎపుడూ ....పైగా మీ పొలం ఎక్కువ కదా!భయమేమి ఉంటుంది మీకు?మాదో నాలుగెకరాల మాగాణీ...ఈ ఏడు కౌలుకు కూడా తీసుకున్నాం....వర్షాలు టైములో రాబట్టి కానీ బావా! చాలా ఊళ్ళల్లో తాగడానికి కూడా నీరు లేదట...నాన్నకి పెద్దకుతురు వర్షం..రెండో కూతురు నేను...
ఇంత పండుగ ఎందుకు సులక్షణ దీనికి ?
అదేంటి బావా అలా అడుగుతారు?అమ్మ పాలు ఇచ్చి బిడ్డని పెంచుతుంది...బిడ్డ మంచిగా ఎదిగి తల్లిదండ్రుల్ని చూస్తుంది...ఈ నేల కూడా అంతే...చక్కగా దుక్కి దున్ని,నీ ఇంట నాలుగు గింజలు పండించి,పంటని నలుగురి నోటిదగ్గర బువ్వగా మారుస్తాను అంటే,సంతోషపడిపోతుంది.. బావా!
ఈలోపు చిన్న అలజడి మొదలైంది...
అటు చూసేడు అరుణ్...గోగునారని చర్ణకోలాలతో తెగ కొడుతున్నారు...ఆడాళ్లు పాటలు పాడుతున్నారు అన్నపూర్ణ తల్లి అంటూ...పీసు పీసు అయిన నారని ఆత్రంగా లాక్కుపోతున్నారు రైతన్నలు...దేవుడు పొలం లోనిదేమో?ఎక్కువ దొరకబుచ్చుకుందాం అనే ఆతృతలో ఉన్నారు..
సరళ అత్తయ్య!పిలుస్తుంది...రారా!అరుణ్...మీ ఎద్దులే ఇవి...తాతగారు ఉన్నపుడు చిన్నవిరా ఇవి...నువ్వు బాగా ఆడుకునేవాడివి వీటితో...పాలు ఇవ్సనివాటికి మేత ఎందుకత్తా అనేవాడివి?ఇపుడు చూడు ...హడావుడి అంతా వీటిదే!...ఆడవాళ్లు పొలంలోకి దిగి మట్టిముద్ద తెచ్చుకుంటున్నారు...
దాన్ని గౌరీదేవిగా చేసి,మన పొలాల దగ్గర పూజ చేసి,దుక్కి మొదలుపెడతారు బావా?మరదలు చెబుతుంటే ,వింటున్నాడు...
ఎంత సారం ఉంది దైనందిక జీవితంలో అనుకున్నాడు...
భూదేవి మనల్ని మామూలుగా మొయ్యడం లేదు బావా!మనందరం స్వార్ధపరులమే....అయిన నీరు,నిప్పు ,గాలి, అన్నీ తనతో అందిస్తుంది....మనం సవత్సరానికి ఒకసారి చేసే ఈ పండుగ , మన జీవితాలు ఆమె వైపుగా సాగేందుకు వేస్తున్న ఒక్క అడుగు అయితే,ఒకటికి వంద అడుగులు జత చేసి మనతో కలిసిపోతుంది...సంతోషపెడుతుంది...సుఖాలు పంచుతుంది....ముందు జీవితాన్ని ఇస్తుంది బావా...నమ్ముతారా మీరు???
నువ్వు కధలు రాస్తావా?అడిగేడు
ఏ!ఊరుకో బావా!ఈ ఊరులో కాలక్షేపానికే నాకు ఇరవైనాలుగు గంటలు చాలవు...ఇంకా కథలకు తీరిలా ఎక్కడ?
నన్ను అండీ ఆనొద్దు సులక్షణా??
ఎందుకు బావా??
నేనుకూడా పుడమితల్లి మాదిరే....నువ్వు ఒక్క అడుగులో ఇక్కడి జీవితాన్ని పూలపొదలా అర్థం అయ్యేలా చేసావు...
నేను కూడా ఏడడుగులు వేసి,దాన్ని నందనవనం చేద్దాం అనుకుంటున్నాను....ధరణికి నావంతు సేవ ఇక ఇక్కడ ఉండే అందిద్దామని...నేను కూడా పొలం పనిలో తరించి,పుడమితల్లి అడుగులకు,హారతులు పడతాను...నీతో కలిసి....

