gowthami ch

Inspirational

5.0  

gowthami ch

Inspirational

పర్యావరణ పరిరక్షణ

పర్యావరణ పరిరక్షణ

2 mins
1.4K


శ్యాం పల్లెటూరి కుర్రాడు తన స్నేహితుడు రాం ని కలవడానికి పట్నం వచ్చాడు. రాం స్టేషన్ కి వెళ్లి శ్యాం ని తన రూంకి తీసుకొని వచ్చాడు.


ఇద్దరూ ఫ్రెష్ అయ్యి టిఫెన్ తినడానికి బయటకి వెళ్లి టిఫెన్ తినేసి వచ్చారు.


"అబ్బాబ్బా ఏంటిరా ఈ ట్రాఫిక్ , ఈ దుమ్ము. అమ్మో ఎలా ఉంటున్నారురా ఇక్కడ. నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇంత లేదు కదా ఈ 5 సంవత్సరాలలోనే ఎంత మార్పు!!" అని ఆశ్చర్యపోయాడు శ్యాం.


"పట్నాల్లో అంతేరా జనాలు పెరిగేకొద్దీ ట్రాఫిక్ పెరుగుతుంది. ట్రాఫిక్ పెరుగేకొద్ది దుమ్ము , కాలుష్యం పెరుగుతుంది.


అందుకేగా మెట్రోలు అని ఫ్లైఓవర్ లు అని ఎన్నో కడుతున్నారు. ఆవేవో కట్టేస్తే సగం బాధ తప్పుతుంది." అన్నాడు రాం.


"అవి కట్టడం వల్ల సమస్యలు తగ్గుతాయి అనుకుంటున్నారా? అది ఎంతవరకు సరైన నిర్ణయం అనుకుంటున్నావు?"అడిగాడు శ్యాం.


"మరి..ఇంక అంతకన్నా ఏం చేయగలరు?" అన్నాడు రాం.


"ఆలోచిస్తే మార్గం అదే దొరుకుతుంది.

ఆ మెట్రోలు , ఫ్లైఓవర్ల వల్ల ట్రాఫిక్ తగ్గుతుందని ఆలోచిస్తున్నారే తప్ప అవి నిర్మించే క్రమంలో ఎన్ని చెట్లు నాశనం అవుతున్నాయో గమనించట్లేదు. చెట్లు లేకుండా అవన్నీ కట్టినంత మాత్రాన కొంత వరకు ట్రాఫిక్ నియంత్రించ వచ్చేమో కానీ చెట్లు అంతరించడం వల్ల ఆక్సిజన్ కొరత ఏర్పడి ఎన్నో రోగాలు వస్తాయి. ఇప్పుడు ఉండే జనాభాకు తగిన ఆక్సిజన్ అందకుంటే అది మన భవిష్యత్తుకే ఎంతో నష్టం.


"ఇష్టమొచ్చినట్లుగా చెట్లని నరికి పెద్ద పెద్ద భవనాలని, వ్యాపార సంస్థలని , ఏవేవో కడతారు వాటిలో కొన్ని 10ల , 100 ల కార్ లు పట్టేంత కాళీ స్థలం ఉంటుంది కానీ ఒక్క చెట్టు నాటడానికి స్థలం ఉండదు. ముందు మన పర్యవరణం పరిశుభ్రంగా ఉంటేనే కదా మనము బాగుండేది ,అలానే మన భవిష్యత్తు తరాలు కూడా బాగుండేది.


కానీ ఆ భవిష్యత్తు గురించి ఎవరూ ఆలోచించడం లేదు. కనీసం ఆ భవిష్యత్తులో ఉండేది ఎవరో కాదు మన వారసులే అన్న సంగతి కూడా మరచిపోతున్నారు. ముందు మనుషులలో మార్పు రావాలి. సుఖాలకి మరిగి కష్టం అంటే తెలియడంలేదు. ఇంట్లో నుండి అడుగు బయట పెడితే చాలు కారో , బైకో, ఆటోనో అదీ కాకుంటే బస్సు, అలా మారిపోయారు. స్వల్ప దూరాలకి కూడా వాహనాలు వాడటం, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సొంత వాహనాలు కొనడం లాంటివి తగ్గించి ఇంటికి ఒక చెట్టు నాటడం, అవసరమైన మేరకు మాత్రమే సొంత వాహనాలు వాడటం , చుట్టూ ఉన్న పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచడం లాంటివి చేస్తే చాలా వరకు పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Inspirational