STORYMIRROR

Shaik Sameera

Thriller

4  

Shaik Sameera

Thriller

ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్ -4

ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్ -4

3 mins
210

రిథిమా కి ఏమైందో అని కబీర్ టెన్షన్ పడుతూ ఉంటాడు. వంశ్ సియా దగ్గరికి వచ్చి తన మెడ చుట్టూ ఉన్న చున్నీ ని తీసి కాపాడుతాడు. అప్పుడు సియా రిథిమా ని చూసి తను నాకు హెల్ప్ చేయాలనుకుంది అన్నయ్య ఇలా చేసావు ఏంటి అంటుంది. తను పరిగెత్తడం చూసి నీ పైన ఎటాక్ చేస్తున్నదని అనుకోని ఎటాక్ చేశాను అంటాడు సియా తో. సియా తను ఒక ఫీజియోథెరపిస్ట్ ఎందుకు ఎటాక్ చేస్తుంది నా పైన అంటుంది. అది విని ఇషాని ఫీజియోథెరపిస్ట్ నాతో ఈవెంట్ ఆర్గనైజర్ అనింది అంటుంది అది విన్న వంశ్ అసలు ఎవరు ఈ అమ్మాయి అని గాయపడిన రిథిమాని చూసి తన బాడీ గార్డ్ రాజ్ తో డాక్టర్ ని పిలవమంటాడు.వంశ్ రిథిమా దగ్గరికి వెళ్లి తనని ఎత్తుకొని రూమ్ కి తీసుకెళ్తాడు. రిథిమా షాక్ లో వంశ్ ని చూస్తూ ఉండిపోతుంది. డాక్టర్ వచ్చి రిథిమా గాయాన్ని క్లీన్ చేస్తూ వుంటే పెయిన్ కి తన చేయిని ముందు కి చాపుతుంది వంశ్ తన చేయిని గట్టిగా పట్టుకుంటాడు.రిథిమా గాయానికి ట్రీట్మెంట్ చేస్తారు డాక్టర్. 

రిథిమా తో వంశ్ అసలు ఎవరు నువ్వు ఫీజియోథెరపిస్ట్, ఈవెంట్ ఆర్గనైజర్ ఇంకేదే అయిన దాస్తున్నావా అని అడుగుతాడు. రిథిమా నా మీద ఎటాక్ చేసి నన్ను తిరిగి అనుమానిస్తూ అడుగుతున్నారా అని అడుగుతుంది .వంశ్ తన గన్ తీసి నిజం చెప్పు లేకపోతే బులెట్ నీ లోపలికి వెళ్ళిపోతుంది అంటాడు .దానికి భయపడి రిథిమా సముద్రంలో పడబోతోంది వంశ్ తన చేయి పట్టుకొని ఆపుతాడు .ప్లీజ్ కూర్చో ప్రతి ప్లీజ్ కి అర్థం బ్రతిమాలటం కాదు అంటాడు వంశ్ .రిథిమా కూర్చున్నాక ఎవరు నువ్వు చెప్పు అంటాడు వంశ్ .రిథిమా నేను టెన్షన్ పడకూడదు మామూలుగానే వంశ్ కి ఆన్సర్ ఇవ్వాలి అప్పుడే నమ్ముతాడు అని తన మనసులో అనుకోని మాట్లాడబోతుంది .వంశ్ తన ముందు ఒక బాటిల్ పెడతాడు అది ట్రూత్ సీరం అది తాగితే అబద్ధం చెప్పరు తాగు అంటాడు .రిథిమా అది తాగేస్తుంది వంశ్ కి అనుమానం వస్తుంది అని .తాగాక వంశ్ ఇప్పుడు చెప్పు అంటాడు .రిథిమా నేనేం ఫేమస్ ఫీజియోథెరపిస్ట్ కాదు ఒక్క సిట్టింగుకి 500 /- వస్తుంది అందుకే ఈవెంట్ కూడా ఆర్గనైజ్ చేస్తున్న బ్రతకడం కోసం తప్పేం కాదు కదా అంటుంది .వంశ్ సరే వెళ్లి రెస్ట్ తీస్కో అని పంపించేస్తాడు .రాజ్ వచ్చి ఏమైంది సార్ అంటాడు ఈ అమ్మాయి నిజమే చెబుతుందా అంటుంది వంశ్ రిథిమా టెన్షన్ పడింది గుర్తు చేసుకొని నో అంటాడు వంశ్ నేను తనకి ట్రూత్ సీరం ఇవ్వలేదు ఆంటీబయోటిక్ ఇచ్చాను తాగింది కానీ ఈ అమ్మాయి ఏదో దాస్తుంది మనం జాగ్రత్తగా తనని గమనించాలి అంటాడు .

రిథిమా రూమ్ లోకి వెళ్లేసరికి లోపల ఒక గిఫ్ట్ ప్యాక్ ఉంటుంది .అది open చేస్తే రెడ్ కలర్ గౌన్ ఉంటుంది అలాగే లెటర్ ఉంటుంది .నేను చేసిన తప్పుకి చిన్న గిఫ్ట్ ఇది వేసుకొని పార్టీ లో కి వస్తే నన్ను క్షమించినట్టే అనుకుంటాను అని ఉంటుంది .అది చూసి రిథిమా వంశ్ నన్ను నమ్మడం మొదలుపెట్టాడు అనుకుంటుంది. అదే గౌన్ వేసుకొని పార్టీ లోకి వెళ్తుంది .తన డైమండ్ క్లిప్ ఎక్కడ పడిపోయిందో వంశ్ కి దొరికితే తను దొరికిపోతుందని వెతుకుతూ ఉంటుంది . ఇషాని డాన్స్ చేస్తూ రిథిమాని చూసి తన కాలు అడ్డం పెడుతుంది రిథిమా పడబోతోంది వంశ్ వచ్చి తనని పట్టుకుంటాడు .వంశ్ రిథిమా కలిసి సాల్సా డాన్స్ చేస్తారు .రిథిమా డాన్స్ అయిపోయాక తన క్లిప్ వెతుకుతూ ఉండగా వంశ్ వచ్చి దొరికిందా అంటాడు ఏదో వెతుకుతూ ఉన్నావుగా అంటాడు .రిథిమా షాక్ అవుతుంది తన earring డాన్స్ లో పడిపోయిందని చూసుకొని తీసుకుంటుంది .నా నుండి నా కళ్ళ నుండి ఏది తప్పించుకోలేదు అని వంశ్ వెళ్ళిపోతాడు .

రిథిమా ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తూ వుంటే ఆర్యన్ తన దగ్గరికి వచ్చి తన డ్రింక్ తన రూంలోకి తీసుకొని రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు .రిథిమా ఆర్యన్ రూమ్ కి వెళ్లి డ్రింక్ ఇచ్చి రాబోతుంటే నేను ఇచ్చిన గిఫ్ట్ బాగా నచ్చినట్టు ఉంది నీకు అదే వేసుకొని పార్టీ కి వచ్చావు అంటాడు .రిథిమాకి ఆ డ్రెస్ వంశ్ ఇవ్వలేదని ఆర్యన్ ఇచ్చాడని అర్థం అయ్యి వంశ్ సార్ ఇచ్చారనుకున్నాను అంటుంది .వంశ్ అన్నయ్య గిఫ్ట్స్ ఇవ్వడు బుల్లెట్స్ ఇస్తాడు అని నవ్వుతాడు .రిథిమా వెళ్తుంటే ఆర్యన్ అడ్డంగా నిల్చొని తన పాకెట్ నుండి కార్డు తీసి ఇది లిమిట్ లెస్ క్రెడిట్ కార్డు ఇది తీస్కో నాతో డేటింగ్ కి ఒప్పుకో అంటాడు .అందుకు రిథిమా ఏడుస్తూ నేను అలాంటి అమ్మాయిని కాదు అని వెళ్లబోతుంది నీలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఇలాంటివాళ్లే అంటాడు .రిథిమాని బయటికి వెళ్ళకుండా ఆపుతాడు రిథిమా ఏడుస్తూ ఉంటుంది .వంశ్ ఆర్యన్ రూము కి వచ్చి రిథిమా ని బెదిరిస్తుండం చూసి ఆర్యన్ తనని వెళ్లనివ్వు అంటాడు .అందుకు ఆర్యన్ వంశ్ అన్నయ్య ఇదేం బిజినెస్ డీల్ కాదు మీరు చెప్పింది చేయడానికి ఇది నా పర్సనల్ మేటర్ నేనే డీల్ చేసుకుంటా మీ జోక్యం అవసరం లేదు అని రిథిమాని పట్టుకోబోతాడు .వంశ్ కోపంగా ఆర్యన్ రిథిమా మధ్యలో నిలబడి తను నా గెస్ట్ తో నువ్వు ఇలా misbehave చూస్తే నేను ఒప్పుకోను just leave her అంటాడు .ఆర్యన్ ఓకే అని వెళ్ళిపోతాడు .రిథిమా ఏడుస్తూ ఉంటుంది are you fine అని వంశ్ అడుగుతాడు ఎస్ అని చెప్పి వంశ్ చేసిన హెల్ప్ కి థాంక్స్ చెప్పి షేక్ హ్యాండ్ ఇవ్వాలని తన చేయిని ముందుకి చాపుతుంది .వంశ్ కూడా తన చేతిని ముందుకి చాపి రిథిమాకి షేక్ హ్యాండ్ ఇస్తాడు .ఇదంతా చూసిన ఇషాని ఆర్యన్ ని చూసి నువ్వు బెట్ ఓడిపోయావు అంటుంది కానీ బాధపడకు వంశ్ అన్నయ్యే రిథిమా కి బుద్ది చెబుతాడు .వంశ్ అన్నయ్య కోపాన్ని భరించవచ్చు కానీ తన ప్రేమని అసలు భరించలేము చూద్దాం రిథిమా లైఫ్ ఏం అవుతుందో అంటుంది .వంశ్ రిథిమా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు .


 





రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Thriller