STORYMIRROR

Swetcha k

Classics

4  

Swetcha k

Classics

ప్రేమ పరిచయం-2

ప్రేమ పరిచయం-2

1 min
10

కాలేజీ మొదటి సంవత్సరం మొత్తం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. రెండవ సంవత్సరం వచ్చింది, మేము సీనియర్లు అయ్యాము. మా వాళ్ళు జూనియర్స్ ను రాగింగ్ చేయడం మొదలు పెట్టారు.అల్లర్లు, సరదాలు, స్నేహాలు, పరీక్షలు, ప్రేమలు ఇలా ఎన్నో అనుబంధాలను, అనుభవాలను ఇస్తుంది కాలేజీ. నాకూ ఒకరి ప్రేమ, ఆరాధన దక్కాయి. ఎప్పుడూ నాతో మాట్లాడని ఒక అబ్బాయి నన్ను చూస్తూ ఉండటం గమనించాను. మొదట వేరే ఎవరినో చూస్తున్నాడు లే అనుకున్నా, కానీ ఎక్కడికి వెళ్ళినా నన్నే చూస్తూ, నవ్వుతూ ఉండే వాడు. కానీ ఎదురుగా ఉన్నా మాట్లాడడు, దూరం నుంచి మాత్రం చూస్తుంటాడు. తనకు నేనంటే ఇష్టం ఉందని అర్ధం అయ్యింది, కానీ జరగని వాటికి తనకు ఆశలు కల్పించకూడదు అని నేను తనని చూసే దాన్ని కాను. తనకు బాధ కలుగుతుంది అని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి నాది. ప్రేమించి తరువాత దగ్గర అవక పోతే పడే బాధ కంటే ఇదే మేలని అనుకున్నా. నేను ఎంతగా తనను చూడకూడదు, తన పేరు కూడా వినకూడదు అనుకున్నానో, అంతకంటే ఎక్కువగా తన పేరు ఎవరో వొకరి ద్వారా వింటూనే ఉన్నా. నా కాలేజీ ముగిసినా తను నాకు ఇప్పటికీ తన ప్రేమని తెలుపలేదు, ఇక తెలుపలేడు కూడా. మా ఇద్దరి దారులు వేరైనా, నాకు ప్రేమను పరిచయం చేసింది తనే, తన నవ్వు ఎప్పటికీ నాకు గుర్తుండిపోతుంది. తనంటే నాకు ఇష్టం అని తెలుపలేక పోయా. తనకు నేను ఒక చేదు జ్ఞాపకాన్ని కావచ్చు, తను మాత్రం నాకు ఒక తీపి జ్ఞాపకం లాగే గుర్తుండిపోతాడు. ఇదే నా ప్రేమ పరిచయం.


Rate this content
Log in

Similar telugu story from Classics