ప్రేమ పరిచయం -1
ప్రేమ పరిచయం -1
అమ్మానాన్నల ప్రేమ, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల ప్రేమ, ఆప్యాయతలు తప్ప వేరొక ప్రేమ తెలియని ఒక అమ్మాయి కథ ఇది. స్కూలు, కాలేజీ చదువు ముగించుకుని డిగ్రీ స్థాయి కాలేజీకి వచ్చే సరికి అందరూ ప్రేమలో పడుతుంటారు. ఈ అమ్మాయి డిగ్రీ కాలేజీలో తనకు ఎదురైన సంఘటనలు, పరిచయం అయిన వ్యక్తులు, ప్రేమ ఎలా పుట్టింది వంటివి తెలుపుతుంది. కాలేజీలోని గొడవలు, స్నేహాలు, ఎన్నో మధుర జ్ఞాపకాలు ప్రతీ ఒక్కరి జీవితంలో "హ్యాపీ డేస్" లాగా గుర్తుండిపోతాయి.
ఈ అమ్మాయి పేరు సౌమ్య. అది తన మొదటి రోజు కాలేజీ, బెరుకు, భయం కలగలిసినట్లు ఉంది తనకి, వాళ్ళ నాన్న బండి మీద కాలేజీలో దింపేసి వెళ్ళారు. ఆరోజు "ఓరియన్టేషన్ ప్రోగ్రామ్". అక్కడే ఉన్న లైబ్రరీలో కూర్చోమన్నారు, పక్కనే ఉన్న మరో అమ్మాయితో మాట కలిపింది, యిద్దరు వాళ్ళ కాలేజీ వివరాలు ,ఎక్కడ చదివింది , ఇలా మాట్లాడుకుంటున్నారు. ప్రిన్సిపాల్ గారు వచ్చి కాసేపు మాట్లాడాక , కాలేజీ చూపించడానికి తీసుకెళ్లారు. తరువాత ఆడిటోరియంలో ప్రోగ్రామ్ మొదలయింది, కాలేజీ గురించి, కోర్సు గురించి మాట్లాడారు, అయి పోయాక ఇంటికి వెళ్ళిపోయింది. కాలేజీలో క్లాసులు మొదలయ్యాయి, మొదటిరోజు సీనియర్లు గుడ్ మార్నింగ్ చెప్పాలని, సెల్యూట్ చేయాలని, ఇంకా ఎన్నో రూల్స్ చెప్పారు. కోపం,ఏడుపు వచ్చాయి, ఎందుకు చేరాను అని అనుకుంది. రోజు ఇలా రాగింగ్, క్లాసులతో సరిపోయేది, తనకు తెలియని ఒక కొత్త లోకం, కొత్త మనుషులు ఏదో ఆశలు, ఎన్నో ఆలోచనలు, ఆశయాలతో రోజులు గడిచేవి. ప్రతీ రోజూ ఒక కొత్త అనభవమేగా జీవతం అంటే.
ఇంకా ఉంది .........
