STORYMIRROR

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Inspirational Others

4  

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Inspirational Others

పెళ్లయిన ప్రేమ...

పెళ్లయిన ప్రేమ...

4 mins
355

ఇంతోడి పిక్చర్ని,హాల్ లో చూడకపోతే ఏం?నెలరోజులు పోతే టీవీ లో ఏదోపండుగ సందర్భంలో ఇచ్చేస్తాడు. ..అపుడే చూడొచ్చు....కుర్చీలోంచి లేవబోయింది కావ్య..

ఆగవే!ఇపుడు ఇంకో హీరో ఎంట్రీ ఉంటుంది...చాలా బావుంటాడు...

ఎందుకు బాగోడు!వేలకువేలు ఉట్టి టిక్కెట్టుకె కుమ్మరిస్తున్నాం కదా!ఆ డబ్బులతో కేజీలకు కేజీలు బూడిద పుస్తె అందంగా ఉండక ఇంకెలా ఉంటాడు...విసుక్కుంటూ కూర్చుంది...

చూడవే...మిగతా హీరోల్లా కదలడు,మెదలడు...ఉన్నచోటే ఉండి డైలాగు చెప్తాడు..కోట్లు వసూలు చేస్తాడు తెలుసా! మళ్ళీ చెప్పింది హరిత పాప్కార్న్ అందిస్తూ...

వెయ్యి రూపాయలు టిక్కెట్టుకు...ఇంచి కూడా కదలడు...స్పీడుగా డాన్స్ వెయ్యడు...బట్టలు మాత్రం బ్రాండువే వేస్తాడు...నా డబ్బులు తగలేస్తున్నాడు...కాదు కాదు ...ఇలాంటి హీరో కోసం నేనే నా డబ్బుల్ని తగలేస్తున్నాను ఖర్మ...ఖర్మ...ఇంకా ఎంతసేపు ఈ నరకం...తల కొట్టుకుంది....

నీ బోడి వెయ్యికి ఆ హీరో ఫేస్ క్రీమ్ కూడా రాదు...ఏంటే వాడ్ని తెగ తిడుతున్నావ్....సినిమా అయ్యాక బయటకు వస్తూ ఆడిగింది హరిత...

చిన్నప్పటినుంచీ ముప్పయివేలు ఖర్చు టిక్కెట్టుకు మాత్రమే....మరి సినిమాకి వెళ్లినపుడల్లా పాప్కార్న్,కూల్డ్రింక్....,వెళ్ళేం కదా!అని చిన్న షాపింగ్...షాపింగ్ కదా అని టిఫిన్,....టిఫిన్ టైం అవ్వగానే ఇంటికి ఎం వెళతాం అని పార్క్ లో కూర్చుంటాం....అక్కడ మళ్ళీ ఏదోతిండి...భోజనం బయటే...సాయంత్రం ఇంటికి తొందరగా వెళ్ళాలి కాబట్టి,ఈవెనింగ్ మీల్స్ ఇంట్లో...మైగాడ్....లేకపోతే అది కూడా బయటే అయితే ఈ ఖర్చులు అన్నిటికి నా టర్మ్ వచ్చినపుడు నా క్రెడిట్ కార్డు గోకుతాను...ఇవ్వాళ సినిమాలో టైటిల్స్ చూసావా....మీ హీరో సినిమాకి అప్పు ఇచ్చింది మేమే ICICI బ్యాంకు అంది ,భుజం మీద తట్టుకుంటూ..

అబ్బ చా! హరితతో కలిసింది మరో మగగొంతు....వెనక్కి తిరిగి చూసేరు ఇద్దరూ...

Sorry...sorry...ఇంత భారీ బడ్జెట్ సినిమాలకి ఖర్చుపెట్టే ఆస్తిపరులు, నేలమీద మీ రూపంలో తిరుగుతున్నారని ఇపుడే తెలిసింది....హ...హా...గుడ్ జోక్....నవ్వుకుంటూ పక్కనుండి వెళ్లిపోయేడు...

లూస్ గాడు...కావ్య అంది

వాడు సినిమా మొత్తం బాగానే చూసేడు...నీ ఎనాలిసిస్ కి బుర్ర పనిచేయడం మానేసింది....లేకపోతే వాడి జన్మకి నవ్వడం ఇప్పటికి చూడలేదు నేను....

నీ ఫ్రెండా? అడిగింది హరితని...

మా ఇంటిదగ్గరే వాళ్ళ ఇల్లు.....మీ అన్నయ్యకి కూడా బెస్ట్ ఫ్రెండ్....మీ అన్నయ్య రోజులో మూడొంతులు వీళ్ళ ఇంటిదగ్గరే ఉంటాడు...తొందరగా నడు...మన బస్ వచ్చేసింది..కంగారు పెట్టింది హరిత..

తొందరగా రోడ్ దాటే లోపలే బస్ వెళ్ళిపోయింది....

షెల్టర్ లో గంట నిలబడ్డ బస్ రాలేదు కానీ,కావ్య అన్నయ్య రవి వచ్చేడు...

బండి ఎదిరా అన్నయ్యా?మమ్మల్ని ఇంటి దగ్గర దింపేయ్యవా?బాగా లేట్ ఐంది,అమ్మ తిడుతుంది మళ్ళీ...

అబ్బా!అంత భయం అయితే ఫస్ట్ షో సినిమాకి ఎందుకు వెళ్లావే? ఈ టైం బస్ ఉండదని తెలుసుగా..భయం లేకుండా ఏడుస్తున్నారు?చూడరా ఈ ఝాన్సీ కి రాణి ని....పద ఆటో లో వెళ్ళండి....అటుగా వెళ్తున్న ఆటో ఆపి ఎక్కించేడు....

శ్రవణ్ని దింపి ,బయలుదేరబోతుంటే....ఒరేయ్!రవి....చాలా లేట్ అయింది...భోజనం చేసి వెళ్ళు...నీతో కొంచెం మాట్లాడలిరా....వింటున్న రవి ఆశ్చర్యపోయాడు...

నువ్వేనా?శ్రవణ్....చాలా రోజులు ఐందిరా!

నిన్ను ఇంత ఫ్రీగా మాట్లాడ్డం చూసి.,పద !అంటూ లోపలికి వెళ్లేరు...

బావున్నావ రవీ?శ్రవణ్ అమ్మానాన్నలు కుశల ప్రశ్నలు అయ్యాయి.భోజనాలు తింటుంటే మొదలైంది ఏడుపు,అయ్యో!బంగారుతల్లి లేచిందే!ఉయ్యాల లోంచి బయటకు తీసుకువచ్చింది శ్రవణ్అమ్మగారు...

ఏంటి?ఆంటీ!చిట్టితల్లి ఇపుడు లేచిందే?నాన్న వచ్చేది తెలిసిపోయిందా? అంటూ చేతిలోకి తీసుకున్నాడు రవి..

కొంచెం సేపు పాపతో ఆడి,ఇంకవెళ్తానురా....బాగా ఆలస్యం అయింది...అన్నాడు

నీతో అసలు విషయం చెప్పలేదు...హర్షిణి కనిపించింది ఇవ్వాళ....మొత్తం ఆస్తి తనకి ఇచ్చేసి,వేరే కాపురం పెడితే ఆలోచిస్తుందట...లేకపోతే విడాకులకు రెడి గా ఉండమంది....నాకేం చెప్పాలో అర్థం కాలేదు.....కనీసం పాప ఎలా ఉందని కూడా అడగలేదు?చాలా బాధ అనిపించిందిరా!!.

ఇదే వద్దన్నాను...నీకేం తక్కువ అని...వద్దు అనుకుంటే విడాకులు తీసుకుని,ఇంకో పెళ్లి చేసుకో అని చెబుతున్నాను....మేము ఎన్నాళ్ళు ఉంటాము రవీ ?

కొంచెం మేము ఉండగానే వాడి జీవితం సర్దితే,మాకు నెమ్మదిగా ఉంటుంది కొంచెం....కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్తుంది రవితో...

తన ప్రేమలో పడి....నేను అమ్మనాన్నలకి ,చెల్లెళ్ళకి ఎపుడూ,ఏదీ చెయ్యలేదు...

మంచి చెడు చూడలేదు...పెళ్లిళ్లు,ఇంటి అవసరాలు

ఏమీ నేను తీర్చలేదు....ఆమె మాయలో ఏం చేసానో,ఏం కొల్పాయానో అర్థమవ్వడానికి నాలుగేళ్లు పట్టింది...యాభైవేల జీతం నెల తిరిగేసరికి నేరుగా తన అకౌంట్ లోకి వెళ్ళేది....నేను ఏమీ చేయలేదని అందరి దగ్గర చెప్తుంది...

ఊరుకోరా!అపుడే చెపితే వినలేదు....ఆ అమ్మాయికి జీవితం అంటే ఒక రేంజ్ ఆలోచనలు ఉన్నాయి...వాటిని నువ్వు తీర్చలేవు అని....జరిగినదాన్ని తవ్వుకుని చేసేదేమీ లేదు...నాకు అర్థం కాని విషయం నెలల పిల్లని వదిలి తాను ఎలా ఉండగలుగుతుంది ?అని....

అమ్మ...ఎంత మంచి సృష్టి ఈ ప్రపంచంలో....అడుక్కునేవాడు అమ్మా! అని పిలిస్తేనే ఇంత పెట్టకుండా ఉండలేము...ముద్దొచ్చే కూతురిని వదిలి ఎలా?....ఇంక మాట్లాడలేకపోయాడు రవి....

సరేరా!ఏదైనా మంచిగా ఆలోచిద్దాం ...ఒక దారి చూద్దాం....బాగా లేట్ అయింది...ఉంటానురా ఇంక...బయలుదేరేడు రవి...

అయిందా! మీటింగులు...ఏమి ఉంటాయిరా ఆడవాళ్ళలాగా అంతసేపు కబుర్లు చెప్పుకుంటారు? రాత్రి పదకొండు అవుతుండగా తలుపు తెరుస్తూ అడిగింది కావ్య..

ఇంకా పడుకోలేదా కావ్య...నీతో కొంచెం మాట్లాడాలి..స్నానం చేసి వస్తాను...పడుకోవద్దు అన్నాడు...

స్నానం ముగించి వస్తూ...అన్నం వడ్డిస్తున్న అమ్మని అడిగేడు...కావ్య ఏదమ్మా?కూర్చోమని చెప్పాను తనతో మాట్లాడే పని ఉందని కూడా అన్నాను...కొంచెం కూడా బాధ్యత లేదమ్మా!నీ కూతురికి....కంప్లైంట్ చెప్తున్నట్టుగా అన్నాడు..

మీరు మీరు పడండిరా....నాకేమీ చెప్పొద్దూ....చెప్తే వినేరకాలా మీరు...నేను పడుకుంటాను....పొద్దున్నే లేవాలి...నువ్ కూడా తినేసి పడుకో...అంటూ వెళ్ళిపోయింది...

తెల్లారిందో లేదో ...ఇంకా కొంచెం చీకటిగానే ఉంది...అన్నయ్యా..లేవరా...నీనిద్ర నిమ్మపువ్వు గాను...నన్ను గుడిలో దింపేసి రారా....ఇవ్వాళ నా పుట్టినరోజు కదా!వచ్చే పుట్టినరోజుకి ఒక ఇంటి దాన్ని చేసేయమని దేవుడ్ని కోరుకోవాలి....నీకు కూడా లైను క్లియర్అయిపోతుందిరా...ఒకే ఒక్కరోజు నిద్ర పోగొట్టుకోండి...జీవితంలో అనూహ్య విజయాలు సాధించండి...ఇలా ఏదో వాగుతూనే ఉంది....అంత నిద్రలోను నవ్వు వచ్చింది రవికి....

ఒక్క పది నిమిషాల్లో బైకు ముందు వుంటాను...వెళ్లి బైక్ దగ్గర ఉండు అన్నాడు...ఇదిగో తాళాలు కూడా పట్టుకెళ్లు...పురామయించి ఫ్రెష్ అవడానికి వెళ్ళేడు...

ఇన్ని సరిపోతాయా?బండి కూడా నేనే నడుపుకుంటూ వెళ్లిపోనా? కొంచెం వెటకారం జోడించింది...

వద్దులే!మీ వదిన తిరగాల్సిన బైకు....జాగ్రత్తగా చూసుకోవాలి కదా!ఇంకొంచెం ఉడికించేడు...

ఎన్ని అన్నా, గుడిలో పూజ,ప్రదక్షిణ,ప్రసాదం ఇచ్చేవరకూ బయటే వెయిట్ చేసేడు రవి...

అంతా ముగిసేసరికి తొమ్మిది అయింది....అపుడు బయటకు వస్తుండగా చూసేడు...నా కావ్య బంగారం!అనుకున్నాడు....

ఏంట్రా అన్నయ్యా!ఆడపడుచు కట్నం ఎగ్గొట్టే ప్లాన్ ఏమన్నా వేశావా?బయటే నుంచున్నావ్?ఎవరు ఆ తెల్ల ఓణీ అమ్మాయా లేక అదిగోముందు చుడిదార్ లో నీకు లాగే కంగారుగా నడుస్తుంది ఆ అమ్మాయా? కనుబొమ్మలు ఎగరేస్తూ ఆటపట్టించింది...

ఇంతలో స్పీడ్ గా దూసుకొచ్చింది ఓ కార్....వెంట్రుకవాసిలో బండిని,తాకించబోయి ఆపేడు...

దూకుడుగానే వెళ్లబోయాడు.....ఇంకోసారి కార్ నెంబర్ చూసి ఆగిపోయాడు...శ్రవణ్ కార్ అది...నవ్వుతూ ఎదురెళ్లి,పలకరించేందు....

ఏంటి!శ్రవణ్ ఇక్కడ ప్రోగ్రాం ఉందని తెలిస్తే,నేను కూడా వచ్చేవాడిని కదా!

అదేమీ లేదురా!అనుకోకుండా రావాల్సి వచ్చింది....శాస్త్రిగారు పాపకి పేరు పెట్టండి పైగా రేపటికి సంవత్సరం నిండుతుంది...రెండూ కలిసివస్తాయి....అన్నీ శుభంగా గుడిలో చేద్దాం అని సడన్ గా చెప్పేరు....పెద్దగా హడావుడి ఎం లేదు....మా ఫామిలీ మాత్రమే వచ్చేము...కొంచెం మాతోపాటు ఉండరా! ప్లీస్...శ్రవణ్ అంతగా అడగడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది....

ఆర్డర్ వెయ్యాలిరా నువ్వు...ముందు చెప్పలేదని కోపం తప్ప ఎం లేదురోయి...పుట్టినరోజు పండుగ అదిరిపోవాలి పాపది....మావయ్యా ఉంటే ఎలా చేస్తాడో,అలా చేస్తా చూడు....అంటూ లోపలికి నడిచేరు..

పాప నామకరణం జరుగుతుంటే ఏడుపు మొదలు పెట్టింది...ఎంత మంది మార్చి మార్చి ఎత్తుకున్నా

ఏడుపు ఆపడంలేదు....చెయ్యి ఏటో చూపిస్తూ ఒకటే ఏడుపు...

ఎం కావాలిరా....చెట్టు చూడు...భలే పూసిందే....అమ్మో ఎన్ని పువ్వులో....ఎత్తుకుని అవి ఇవి చూపిస్తూ తిప్పినాలాభం లేకపోయింది...

నాకు ఇవ్వండి...పిల్లల్ని భలే ఆడిస్తానునేను...ఆ విషయంలో ఆస్కార్ ఇవ్వొచ్చు నాకు....చేతుల్లోకి తీసుకుంది కావ్య...

ఒక్కదాన్నీ అయిపోయానమ్మా!ఈ రోజు ఈ బంగారం పుట్టినరోజు...పెరు పెట్టడం కూడా....అన్ని ఒకసారె తెచ్చుకుంది...ఒక్క అమ్మనే....అంటూ ఆగిపోయింది...శ్రవణ్ తల్లి ...

మీరు ఏమైనా పని చూసుకోండి...నేను ఆడిస్తాను అన్నానుగా....ఇవ్వాళ నువ్వు,నేను కూడా పుట్టేసేమ్...అబ్బో!పెద్ద పండుగ కదా! వీళ్ళకి అంటుంటే

ఊ...అంటూ నవ్వింది పాప..ఇంక కావ్య ఎం చెబుతున్నా ఊకొడుతూనే ఉంది...పొద్దున్నుంచి ఒకటే ఏడుపుతో నా దుంప తెంచింది...ఇపుడు చూడు ఎలా నవ్వుతుందో?బడవా.....నాన్నమ్మ మురిసిపోయింది...

శ్రవణ్ తండ్రికి అపుడే అనిపించింది....ఈమె మా కోడలు అయితే ఎంత బావుండేదో? ....అదే ఆలోచనతో భార్యవైపు చూసాడు...

రండి!అనుకున్నవన్ని జరగాలంటే దేవుడు దిగి రావాలి...అంది పెద్ద ఎదో అర్థం అయినట్టు...

ఆడుకుంటూ ఆడుకుంటూ అలిసి ,అమ్మ గుండెలపై హాయిగా పడుకున్నా అన్నట్టు,నిద్రలోకి జారుకుంది పాప...మధ్యలో పువ్వులా నవ్వుతోంది....ఆ నవ్వు నాకు ఇంక భయం లేదు...అన్నట్టు ఉంది....

ఇలాంటి గుండెలకు హత్తుకునే తల్లి కదా!కావాల్సింది..తప్పయినా అడుగుతాను అనుకుంటూ రవి దగ్గరికి వెళ్ళేడు శ్రవణ్....

నేను ఎపుడో అనుకున్నాను...కానీ స్నేహం చెడిపోకూడదని ఆగేను...నీ నమ్మకాన్ని వాడుకున్నట్టు నీకు అనిపించకూడదు కదా! రవి తన మనసులో మాటని కనిపెట్టి అన్నాడు....

బుజ్జి తల్లి...ఇప్పటి నుంచి మనం అమ్మా,కూతురులం తెలుసా నీకు....ఎం పేరు పెడితే బావుంటుంది ఆత్తయ్యా?

మురిసిపోయింది శ్రవణ్ తల్లి....ఈ పిలుపు కోసం మా ఇంటిల్లిపాది చూసింది తల్లి...నాకు ఇద్దరు కాదు...ముగ్గురు కూతుళ్లు...నాకొడుకు నిప్పుల కుంపటిమీద ఉన్నాడు ఇన్నాళ్లు...వాడిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే...రేపే మీ ఇంటికి వచ్చి మాట్లాడుతాం రవీ....నీ సాయాన్ని మేము మర్చిపోలేము....

ఉంటాం ఆత్తయ్యా!రవి వాళ్ళదగ్గర సెలవు తీసుకున్నాడు....

పాపని తీసుకుంది శ్రవణ్ తల్లి...ఏడుపు లంకించుకుంది మళ్ళీ....అయ్యయ్యో బంగారం!వెనక్కి తీసుకుంది కావ్య...ఈసారి మరింత గట్టిగా పట్టుకుంది అమ్మని తన చిట్టి చేతులతో....మళ్ళీ పువ్వులా విచ్చుకుంది నవ్వు....శ్రవణ్ మురిసిపోవడానికి హద్దే లేదు ఇక....ఈ క్షణం తాను మా ఇంటికి వచ్చేస్తే అన్న ఆలోచనలో ఉన్నాడు...పాప మాత్రం వెచ్చని గూడులో నిద్రిస్తున్న పక్షిలా తల్లిని అతుక్కుపోయింది....



Rate this content
Log in

Similar telugu story from Abstract