Narra Pandu

Romance Tragedy Action

3.1  

Narra Pandu

Romance Tragedy Action

పెళ్ళిగోల

పెళ్ళిగోల

2 mins
254


ఇంట్లో తెలిసిన ప్రేమ భాగోతం

నిలదీసిన అమ్మ

మందలించిన అన్నలు

మౌనంగా ఉన్న వదినలు

మాట్లాడని ప్రేయసి

ఏమి చెయ్యాలో తెలియని పిచ్చోడిని...


చాలారోజుల తర్వాత అనుకోకుండా ఒకరోజు ఉదయం నేను మా ఇంటికి వెళ్ళాను.


మా ఇంట్లో నేను అడుగు పెట్టిన మరుక్షణమే మా అమ్మ గారు అన్నం తినమని ఆదేశించి వడ్డించారు.


నేను మా ఇంటి హాలులో అన్నం తినే సమయంలో మా కుటుంబ సభ్యుల మోహల్లో ఏదో తెలియని అలజడి మరియు హడహుడి కనిపించింది.


హాలుకు ఆనుకొని ఉన్న ప్రక్క గది నుండి మా అన్నలు ఏదేదో మాట్లాడుతున్న గుసగుసలు వినపడుతున్నాయి.


అపుడు నాలో ఏదో తెలియని భయం మొదలయ్యే సమయానికి అన్నం తినడం ముగిసింది.


నేను తిన్న కంచం తిస్తూనే నీతో మాట్లాడాలి కదలకుండా ఇక్కడే కూర్చో అని మా అమ్మ గారు ఆదేశించారు.


అంతలోనే మా అన్నయ్యలు మూకుమ్మడిగా నేనున్నా గదిలోకి వచ్చారు.


అసలు కథ ఇక్కడ మొదలైంది......


తమ్ముడు నీ పెళ్లి చేయాలనుకుంటున్నాము అమ్మాయిని చూస్తాము అని ప్రారంభించారు.


నేను ఇపుడే నాకు పెళ్లి వద్దు కొన్ని రోజుల తర్వాత చేసుకుంటాను అని చెప్పాను.


అసలు ఇపుడు వద్దా.. అసలు పెళ్లే వద్దా...


మేము చూసే అమ్మాయి వద్దా అని అన్నారు.


ఇది మంచి సమయం అనుకోని అసలు నాకు పెళ్ళి వద్దు అన్నాను.


అపుడు మా అమ్మ గారు పెళ్లే వద్దు అనేవాడివి నీ ప్రేయసికి అలా చెప్పే ప్రేమించినావా అని నిలదీసింది


నేను ఒక్కసారిగా మాట రాక మౌనంగా ఉండిపోయాను.


వాళ్ళు ఒక మాట నేను ఒక మాట ఇలా మాటల యుద్ధం సాగుతూనే ఉన్నది.


చివరగా ఎవరు ఎవరి మాట మీద నిలుస్తామో తెలియకుండానే మాట్లాడుతున్నాము నేను 

నా ప్రేమ గురించి 

వాళ్లు నా పెళ్లి గురించి....


మధ్యలో మా వదినలు కలగజేసుకుని భాధపెట్టకండి భయపెట్టకండి అంటూ మా అన్నయ్యలకు సర్దిచెప్పారు.


కొంత సమయం తర్వాత.......


మేము నీ ఇష్టప్రకారమే నీ పెళ్లి నీ ప్రేయసితోనే చేయడానికి అంగీకరిస్తున్నాము అని అన్నారు.


అంత సేపు కన్నీరు అయిన నా కంటి నుండి ఆనందభాష్పాలు మొదలయ్యాయి.


భవిష్యత్తు గురించి భాధపడిన అమ్మ

మనసు మార్చుకొని మాట ఇచ్చిన అన్నలు

ఆనందపడిన వదినలు

మాట్లాడని ప్రేయసి

మాట్లాడలేని పరిస్థితి

మాటలురాక నేను మళ్ళీ ప్రేమ పిచ్చొడిని



అసలు సమస్య ఇపుడు మొదలైంది

ప్రేయసితో మాట్లాడదామని కాల్ చేస్తే కట్ చేస్తుంది


మెసేజ్ చేస్తే చూస్తుంది కానీ రిప్లై ఇవ్వడం లేదు


మళ్ళీ ప్రేమ పేరుతో మోసపోయానేమో అని సందేహం వస్తుంది


ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని దీనస్థితిలో అర్థంకాక ఆలోచిస్తున్నాను.


నర్ర పాండు రావణ్ మహరాజ్ అశ్వగోష్ బుద్ధ✍️



Rate this content
Log in

Similar telugu story from Romance