ఓ పరిచయం
ఓ పరిచయం
హాయ్!
నా పేరు.......! నా కలం పేరు సుధామయి!
నా స్నేహితురాలి కథ!
In her POV
నేను ఒక డాక్టర్ని. తానొక ఇంజనీరు.
ప్రేమ,జీవితం అంటే ఏమిటో తెలియని 22 ఏళ్ల నాకు మొదటి సారి తన వలన ఏదో వర్ణించ లేని భావం కలిగింది.తనతో బంధం బలంగా అవుతుందని అనిపించింది.
మన చుట్టూ మనమే బాగుచేయాలి, అందరికీ సహాయం చేయాలి అనే తత్వం తనది.
డాక్టర్ గా నా వంద శాతం సమాజానికి ఇవ్వాలి, డబ్బు కోసం కాదు ఈ వృత్తి అనే తత్వం నాది.
తాను ఒక ఉచిత వైద్య సేవలందిచే యాప్ కి యజమాని. ఆ యాప్ కి డాక్టర్లు కావాలి. దాని కోసం తాను నాకు మెసేజ్ చేశాడు. నెమ్మది గా కరోనా సమయంలో తను అందించిన సేవల గురించి, తను తాను పుట్టిన ఊరి కోసం చేసిన పనులు మొదలగు వాటి గురించి తెలుసుకున్నాను.
ఇది తనలో నన్ను ఆకర్షించిన లక్షణం.
అలా చాల విషయాల్లో మా ఇష్టాయిష్టాలు కలిశాయి.
అలా రోజులు గడిచాయి.
మా సంభాషణ సమయం పెరిగింది.
అది ప్రేమ అని అనిపించింది కాని మనస్సు ఏమో "ప్రేమ కాదు ఏం కాదు ఎదో తన ఆలోచనలకు నువ్వు ఆకర్షితురాలివి అయ్యావు అంతే" అని చెప్పింది.
ఒక రోజు తను నేను మీ ఊరిలో పరీక్ష ఉంది వస్తున్న కలుదామ అన్నాడు.
నేను కూడ సరే అన్న.
నేను మొదటిసారి ఒక కొత్త మనిషిని మనస్సున ఒక కొత్త భావంతో కలుసుకోనున్నా అనే విషయం నాలో ఒక అలజడి సృష్టించింది.
ముందు రోజు రాత్రి
నా మనస్సు కుదురుగా లేదు! అలోచనలు అనే అలలు నన్ను నిద్ర పోనివ్వలేదు. 6 మాసాల పరిచయంలో తన మీద తన కుటుంబం మీద మంచి అభిప్రాయమే ఏర్పడింది గాని ఎక్కడో చిన్న భయం ఆన్లైన్లో పరిచయం అయ్యాడు అని.
మరోపక్క నీకు ఆన్లైన్లో 7-8 ఏళ్లుగా తెలిసిన ఇద్దరు ముగ్గురు చాలా మంచి స్నేహితులు ఉన్నారు కదా వాళ్ళ లాగే తిను మంచి మిత్రుడు లేదా అంతకు మించి ఏదో ఒకటి అవుతాడు అని అనుకొన్న.
ఏం బట్టలు వేసుకుందాం అనే ఆలోచన ఒక వైపు!
అలా అలా నిద్ర పట్టలేదు.
ఒక రాత్రి ఇంత పెద్దగా అనిపించటం బహుశ ఇదే మొదటి సారి ఏమో నాకు!
అలా నిద్రలోకి నాకు తెలియకుండానే జారుకున్నాను.
ఆ రోజు
మొత్తం తయారు అయి తనకు ఫోన్ చేశాను.
"ఒక పది నిమిషాల్లో నీ ముందు ఉంటా" అన్నాడు.
నేను బయట కారు లో ఉన్న నువ్వు రా అని ఫోన్ చేశాడు.
నేను మిశ్రమ భావాలతో నెమ్మదిగా కారు దగ్గరకి వెళ్లి నిలబడాను.
వెంటనే డోర్ తీశాడు.
తనని చూశాక నా భయాలు అనీ పోయాయి. ఒక్కసారిగా మనస్సు అంతా నిర్మలంగా ఉన్న సముద్రం వలే మారింది.
ఇద్దరం కలిసి బీచ్ కి వెళ్ళాం.
అక్కడ మేం ఇద్దరం తప్ప ఎవ్వరూ లేరు!
అందమైన అలలు అవి చేసిన వినసొంపైన శబ్దాలు!
మమ్మల్ని తాకుతూ వెళ్లిన పిల్ల గాలులు!
దాగుడుమూతలు ఆడిన సూర్యుడు!
చేయి పట్టుకొని నడిచిన తాను!
అలా కాలం ఆగిపోతే ఎంత బాగుంటుంది అని అనిపించింది.
"ఇద్దరం ఒకరి చేయి ఒకరు పట్టుకొని చాలా విషయాలు మాట్లాడుకుంటూ రెండు గంటలు నడిచాము."
నా గుండె వేగం పెరిగింది.
ఏదో బాగా తెలిసిన ఇష్టమైన వ్యక్తి తో నడుస్తున్నటు అనిపించింది.
నాన్న దగ్గర ఉన్న అంత ధైర్యంగా అనిపించింది. అలా నడుస్తు ఉండి పోవాలి అని అనిపించింది.
ఆ తర్వాత ఒక మంచి రెస్టారెంట్ లో భోజనం చేశాము.
ఆ తర్వాత ఒక సినిమా చూసి మళీ మాట్లాడుకొని తర్వాత నన్ను మా ఇంట్లో దింపేసి వెళ్లి పోయాడు.
ఆ రోజు రాత్రి
నాలో ఏదో తెలియని కొత్త అనుభూతి.తన చేతి స్పర్శ గుర్తుకువస్తునే ఉంది.
ఆ రోజున అనిపించింది ఇదే ప్రేమేమో అని.
ఆ స్పర్శ ఈ రోజుకి నాకు గుర్తు ఉంది.
తాను మధురం!
తనని చూసిన క్షణం మధురం!
తన స్పర్శ మధురం!
తనతో గడిపిన ప్రతి నిమిషం మధురం!
తనతో గడిపిన ఆ రోజు మరువలేని ఒక మధుర జ్ఞాపకం!
ఈ రోజుకి ఇద్దరికి ఒకరు అంటే ఒకరికి ఇష్టం.
ఆ ఇష్టానికి పేరు లేదు! అవసరం లేదు!
ఈ అనుభూతి ఓ అందమైన గ్న్యాపకం!

