ఒంటరి జీవితం
ఒంటరి జీవితం
గమ్యం లేని జీవితంలో
గత జ్ఞాపకాలతో నా జీవిత గమనం...
ఎల్లలు లేని ఎన్నో సమస్యలు
అంతుపట్టని ఆలోచనలు...
కరువు కాలంలో బ్రతుకు భారమై
ఎడారి ప్రాంతంలో ఎటు తోచని పరిస్థితిలా మారింది నా జీవిత చక్రం...
అదుపులేని ఆర్థిక పరిస్థితులు ఆమడదూరం తోసేస్తుంటే...
అదుపు లేకుండా పని చేసినా ఫలితం మాత్రం అందని ద్రాక్షే...
చదివిన చదువుకు సరైన ఉద్యోగంలేక...
పైచదువులకు వెళ్ళలేక...
ఆలోచిస్తూ ఆలోచిస్తూ అమరుడనయ్యే దారి ఎదురైతే...
చావలేక బ్రతకలేక అలలా వచ్చే బాధలతో అర్థం కాని జీవితం...
కరిమబ్బు నుండి రాలే కన్నీటితో కడుపు నింపుకుంటూ...
కష్టకాలంలో ఇష్టం లేని పని చేస్తూ...
బతుకు నావను సాగిస్తు బరువు బాధ్యతలు ఎన్నో మోస్తున్న...
ఆలోచిస్తూ అలమటిస్తూ అంతులేని వేదనతో కాలం గడిపిన రోజులెన్నో...
పడుకుంటే నిద్ర పట్టక మెలకువతో ఉన్న రాత్రులు ఎన్నో...
నేను నిద్ర లేచిన ప్రతి ఉదయం నా జీవితం ఆరంభం *ఆలోచన* అనే పదం...
ఆనందంగా ఉండే రోజు కోసం ఆరాటపడి చేసిన పనులు ఎన్నో...
ఆ చేసిన పనుల్లో నేను కోల్పోయిన ఆనంద క్షణాలెన్నో...
నాకు కావాల్సింది నాకు దొరకదు అని తెలిసినప్పటి నుండి...,
బాధలు వివరించడానికి బంధుత్వం లేదు...
చెప్పుకోవడానికి స్నేహితులు లేరు...
ప్రేమించడానికి ప్రేయసి లేదు...
కష్టాలు చెప్పడానికి కావాల్సినవారు లేరు...
ఎందుకంటే,
నేను అందరిలో ఉన్న నా ఆలోచన వేరు...
నేను ఎప్పుడు ఒంటరి వాడినే.
