శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Inspirational Others

4  

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Inspirational Others

నిండుఒంటరి

నిండుఒంటరి

2 mins
396


టెక్నాలజీ లేని రోజుల్లో...ఒంటరితనం నరకప్రాయం.పుస్తకాలు ఎన్ని ఉన్నా,అర్థంకాని ఆస్తిదస్తవేజుల్లా ఉండేవి.ఎవరైనా ఒకటీ ఆరా హారికదో,బుర్రకదొ చెప్పడానికి వచ్చినా ,నేను ఒంటరిని అనిఫిక్స్ ఐపోయినవారిని జనాల్లోకి తీసుకురావడం బహుకష్టం.ఎవరెన్ని చెప్పినా..మనవారు చెప్పే మాట ,దెబ్బ తిన్నాక చేదుగాఉంటుంది..

అమలాపురానికి ఇంకో గంట ప్రయాణంగా ముందుకు పోతే ...శాస్త్రి అమ్మమ్మ ఊరు వస్తుంది.గంట ప్రయాణం గుర్రబ్బండి మీద సాగాల్సిందే.అది పూర్తిగా నిండాలంటే ఎక్కేవారు కోసం ఆగాల్సిందే.

శాస్త్రికి సంబంధం కోసం ఆఊరు ప్రయాణం కట్టారు సహదేవుడు,సరస్వతి ల జంట..

మాకు నచ్చింది.సరస్వతి అంటూండగా

అబ్బాయినికూడ ఒకమాట ఆడగండి.పిల్లలు మాట్లాడుకుంటారేమో ? ఓ నిమిషం బయటఉందాం.అమ్మాయిని పాట పాడమంటారా?త్యాగయ్యకృతులు బాగా పాడుతుంది..ఈ వంటలు అమ్మాయే చేసింది...ఆడపిల్లవారు ,అబ్బాయి

మోముపై చిఱునవ్వుకి శతవిధాల ప్రయత్నించారు.

సన్నీటికీ మౌనంగా కుర్చున్నాడు.నేను మాట్లాడుతాను అంది అమ్మాయి.పెద్దోళ్ళు అసాధ్యులు అనుకుంటే...పిల్లలు వారికంటే ఓమెట్టు ఎక్కువే?

అమ్మాయి కౌముది కి ఏదో తేడా ఉందనిపించింది.

అందుకే అలా అంది.అక్కడ కూడా,హోమ్వర్క్ చెయ్యని పిల్లవాడు,పనిష్మెంట్ కి భయపడ్డట్టు నుంచున్నాడు.

మీరు ఎవరిని ఐనా ఇష్టపడ్డారేవిటి,.?ప్రశ్న సూటిగా తగిలేసరికి తలెత్తి,చూసాడు శాస్త్రీ.

మావయ్య కూతురు,లావణ్య.పేరుకి తగ్గట్టుగా అందంగా,బొమ్మలా ఉంటుంది.పరికిణీఓణీల్లో లక్ష్మిలా ఉంటుంది.

నేనూ ఇంచు మించు అలానే ఉంటాను.మనవాళ్ళు అందరూ ఆడిగేట్టుగానే పొడవుజడ కూడా ఉంది.పెళ్లికి ముందు నేనూ లంగాఓణీలే వేసుకున్న..ఇహ ఇపుడు చీరలకి వచ్చేస్తా...

కౌముది మాటలకి వేరే ఎవరైనా అయితే...అమాయకత్వం అనుకుని,పడిపోయేవారే? కానీ అయ్యగారి ఊహల్లో అమ్మాయికి,ఈ అమ్మాయి సరితూగక ,అదోలా నవ్వేడు..

కౌముది బామ్మకి ,నువ్వు ఎంత ప్రయత్నం చేసినా,నన్నుదక్కించుకొలేవు అన్నట్టు గోచరించింది ఆనవ్వు..

సందుకే ఆ సoభాషనకీ అంతటితో స్వస్తి పలికేందుకు వారిమధ్యకు వెళ్ళింది,చేతిలో పువ్వులు తీసుకుని మరీ.

అదేవిటే..కౌము...మల్లెలు కాస్త జడలో తురుముకుంటే భలేఉండేది కదుటే! పా వెన్సక్కి తిరుగు అంది ,దండను పేటలు వేస్తూ...

ఈలోపు ఇంకోవైపు తిరిగి,అలా నడుస్తూ గులాబిమొక్కదగ్గర ఆగి,నవ్వుకున్నాడు శాస్త్రి.

పదవే సిగ్గులేని దానా!నేను బ్రతికుండగా నీకేం తక్కువ కానివ్వను.నాకోమాట ఇవ్వు,వీడ్ని చేసుకోను అని , చెయ్యి చాపింది .

బామ్మతో నడుస్తోంది కానీ,అమ్మాయిచేత తిరస్కరింప

బడ్డాడు అంటే,ఆ బాధ దిగమింగుకోవడం అంత సులువు కాదు.ఎలా అయినా ఈ అబ్బాయిని మామూలు మనిషిలా,సరదాగా మార్చాలి.ఇతనే నా భర్త అని తన మనసున ఉన్నది నాన్నతో చెప్పింది.

నీకైమనా పిచ్చె బంగారుతల్లి..వాళ్ల అమ్మానాన్నని చూస్తుంటే వాడ్ని ఎటైనా వదిలించుకోవాలని చూస్తున్నట్టు ఉంది.బాగా ఆలోచించుకోవే చిన్నమ్మా..నీ బతుకు బుగ్గయిపోతుంది.బామ్మనెత్తి

నోరు బాదుకుంది.

బామ్మా నా మనసు చెబుతుంది.అబ్బాయికి ప్రేమగా మాట్లాడే నాలుగు మాటలు కావాలి.అలాంటివాళ్ళు యిట్టే మారి మానుషులౌతారు.

మనసుమట్టిగడ్డలు ఏమీ ఉండవు.కళ్ళకి పొర కమ్మేస్తుంది.దాన్ని ప్రేమ అంటారుమీరు.మనసుకి ఆలోచన ఉండదు.అందుకే బుర్రతో ఆలోచించ

మంటారు.కళ్ళు మోసమ్ చేస్తాయే కన్నమ్మా..ఒక్కమారు ఆలోచించు..బామ్మ పోరింది.

ఎం ఆగలేదు.పెళ్లి ఘనంగా జరిగింది.అప్పగింతలకి పిల్లకి చెప్పింది బామ్మ.దేవుడి దయవల్ల నీ కన్నెరికం సరదాగా జరిగి గుర్తుండిపోవాలే..ఇంతకన్నా నాకేకోరికా లేదు కన్నీళ్లుపెట్టుకుంది.

మొదటిరోజు హడావుడి మా ఇంట్లో అన్నారు మగపెళ్లివారు...ఇదేం ఖర్మ?,,నేనెక్కడా వినలేదు అంది బామ్మ..

ఇది ఆగలేదు.అలా అని జరగనూ లేదు..ఓ వారం పోయాక,కౌముది నుంచి ఫోను.అమ్మా!నాకు ఇక్కడ అస్సలు నచ్చలేదు.మాట్లాడడానికి కూడా ఎవ్వరూలేరు..రోజూ గేదెలు,పాలు తీయడం,మేత వెయ్యడం ..ఇవే నాపనులు..ఆయన అస్సలు నన్ను పట్టించుకోరు భోరుమంది..

రెండురోజుల్లో పంపిస్తాం అని అమ్మాయిని తీసుకొచ్చేడు కౌముది తండ్రి.

మనసు మాటకాదు,మెదడు మాట వినమన్నాను.ఇప్పుడు నీ బతుకు నువ్వే బలి చేసుకున్నావ్..బామ్మ మొదలుపెట్టింది.

అమ్మా దాన్ని చెప్పనివ్వు.అయినా నువు చిన్నపిల్లవు కాదుతల్లి? భర్తని అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది.పైగా..ఏదో చెప్పబోతుంటే ఆపిందిబామ్మ

మీ దిక్కుమాలిన ఆలోచనలు ఏమీ పనిచేయవు ఇప్పుడు.వాడు మెదడులో బానే ఫిక్సయిపోయాడు..ఇదే ఏదో ఉద్దరిస్తానని వెళ్ళింది.దీని కడుపున కాయ కాస్తే,నేను గుండు కొట్టించుకుంటా...అక్కడినుంచి వెళ్ళిపోయింది.

ఇంకో వారంలో వియ్యంకుడు నుంచి ఫోను..అబ్బాయి అమ్మాయితో కలిసి ఉండడానికి సుముఖంగా లేడు..మరదల్ని మర్చిపోలేకపోతున్నాడు.మీరు అమ్మాయిని ఇలాంటి సమయంలో తీసుకువెళ్ళేరు.అబ్బాయి చాకుతో చేయి కోసుకున్నాడు..చాలా బ్లడ్ పోయింది..అంటూ చేప్పుకుపోతున్నాడు....

ఆడపిల్ల జీవితం బావగారూ ,కాస్త ఆలోచించండి..కంటికి మింటికి ధారలయ్యాయి కన్నీళ్లు..

ముందు ఎవరు విన్నారని,ఇప్పుడు ఒకరు మన మాట వినడానికి!

ఆలోచన ముందు జీవితానికి అయినపుడు మెదడుతోనే ఆలోచించాలి..దానంకాదు మనసుతో చేయడానికి..ఓ అమ్మాయి నిండు జీవితం.నూరేళ్ళ పంట అయ్యే పెళ్లి....అన్నీ అయి,అందరూ ఉన్స నిండు ఒంటరి కౌముది...



Rate this content
Log in

Similar telugu story from Abstract