STORYMIRROR

Narra Pandu

Romance

4  

Narra Pandu

Romance

నేటి తరం ప్రేమ కథ

నేటి తరం ప్రేమ కథ

1 min
451

ఒక గువ్వ ఒక గోరింక

అనుకోకుండా కలుసుకున్నాయ్

పలుకులు కలుపుకున్నాయ్

పరిచయాలు పెంచుకున్నాయ్

మాట మాట కలుపుకున్నాయ్

మదిలో గూడు కట్టుకున్నాయ్

నువ్వే నా ప్రాణం

నువ్వే నా ఊపిరి

నువ్వే నా శ్వాస

అంటూ ప్రకటించుకున్నాయ్

ఒకరినొకరు

గోరు ముద్దలు

నోరు ముద్దులు లాగించుకున్నాయ్

సినిమాలంటూ షికార్లంటూ

పుకార్లు పాలు అయ్యాయి

ఒకే గుడిలో తలదుర్చుకున్నాయ్

రెక్క రెక్క తడుముకున్నాయ్

ముక్కు ముక్కు రాసుకున్నాయ్

పక్క పక్క కలుపుకున్నాయ్

ఒకే దుప్పటి కప్పుకున్నాయ్

చివరికి

కలహలంటూ

కోపాలంటూ

తాపాలంటూ

ఆ గువ్వ మరో గోరింకను

ఈ గోరింక మరో గువ్వను

చూసుకొని తుర్రుమన్నాయ్.

ఇదే కదా నేటి తరం ప్రేమ కథ.


నర్ర పాండు రావణ్ మహరాజ్ అశ్వగోష్ బుద్ధ✍️



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Romance