Anjani Gayathri

Inspirational Children

4.5  

Anjani Gayathri

Inspirational Children

🌹నేటి బాలలే రేపటి పౌరులు🌹

🌹నేటి బాలలే రేపటి పౌరులు🌹

2 mins
362


🌹 నేటి బాలలే రేపటి పౌరులు🌹

రచన :- అంజనీగాయత్రి.


 అవంతి స్కూల్లో టీచర్ గా పని చేస్తోంది . చుట్టుపక్కల తిరిగే పేదపిల్లలను చేరదీసి, కూలి పనులకు వెళ్లకుండా మాన్పించి , వారికి చక్కటి భవితనివ్వాలని తాపత్రయపడుతూ ఆ పిల్లల తల్లిదండ్రులకు మంచిమాటలు నూరిపోస్తూ పిల్లలు స్కూల్ కి వెళ్లేలా చేసింది. వారి చదువుకయ్యే ఖర్చు మీరు భరించక్కర్లేదు. అంతా నేను చూసుకుంటాను అని చెప్పి , పిల్లలు బడిబాట పట్టేలా చేసింది.

 ఎందుకంటే?? నేటి బాలలే రేపటి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఆశయంతో ఆమె ముందడుగు వేసింది.


 ఆ ఊరి ప్రెసిడెంట్ ని, పెద్దలని కలిసి స్కూల్ కి అవసరమయ్యే సదుపాయాలన్నీ , వారిద్వారా చందాలు వసూలు చేసి స్కూలు రూపురేఖలు మార్చేసి , ఆ ఊర్లో ప్రతి పిల్లలు చదువుకునేలా కంకణం కట్టుకుంది.


 పిల్లలు చదివితేనే కదా , దేశ పురోగతి కూడా బాగుంటుంది. నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలంటే , చక్కటి విషయపరిజ్ఞానాన్ని అందించాలి కదా? అందుకే అవంతి ఊర్లో ఉన్న పిల్లలందరిని చేరదీసి చదువు చెబుతూ, వారికి అక్షరజ్ఞానాన్ని సమకూర్చి , విద్యాబుద్ధులు నేర్పుతోంది .


 ఆమె ఆశయాన్ని మెచ్చుకుంటూ, అదే ఊర్లో ఉండే కృష్ణకాంత్ అనే అబ్బాయి, ఆమెను ఆరాధిస్తూ, స్కూల్ విషయంలో ఆమెకు చేయూతగా ఉంటూ , అతడు కూడా స్కూల్ లో ఒక టీచర్ గా మారి పిల్లలందరికీ చక్కటి విద్యను అందిస్తూ , అవంతి పై ప్రేమను పెంచుకున్నాడు .


 ఒక మంచి రోజు ఆమెను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. నాకు తల్లిదండ్రులు లేరు నేను అనాదని. మీ వాళ్ళు నన్ను కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకుంటారా??అని అడిగిందామె.


 మా అమ్మానాన్నలును నేను ఒప్పిస్తాను . నీకు నేను ఇష్టమంటే చెప్పు , మిగతా విషయాలు వదిలేసి నువ్వు నిశ్చింతగా ఉండు , అన్ని నేను చూసుకుంటానని మాట ఇచ్చాడు.


 అవడం కృష్ణకాంత్ కి ఏ వంక పెట్టడానికి లేదు . రూపురేఖల్లో ఆరడుగుల ఎత్తుతో బలమైన శరీరసౌష్టవంతో అందంగా ఉంటాడు. చదువు కూడా బానే చదివాడు. తనతో మసులుకొనే విధానమే తనని బాగా చూస్తాడని అర్థమవుతోంది . ఇంక అడ్డు చెప్పడానికి ఏముంది??

 తాను కూడా మంచి సమయం చూసి అతడిని ఇష్టపడుతున్నాను అని మనసులో మాట చెప్పింది.


 ఆమె ఒప్పుకుంది అన్న ధైర్యంతో ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర తాను అవంతిని ప్రేమిస్తున్న విషయం వెల్లడించాడు. ఆమెకు నా అన్న వాళ్ళు ఎవరూ లేరని , పెళ్లయితే తమ ఇంటికి వస్తుంది కదా? తమ మనిషి అవుతుంది కదా అనే సందేహం వెలిబుచ్చి ఆమె ఫోటో చూపించాడు. ఆమె ఆశయాలు కూడా చెప్పాడు.


 ఫోటోలో చాలాబాగుంది. ఊర్లో ఉన్న పిల్లలందరినీ బాగా చేరదీసి చూస్తోంది అంటే , తమ కుటుంబాన్ని కూడా చక్కగా చూసుకోగల బాధ్యత ఉంటుందని భావించి కృష్ణకాంత్ తల్లిదండ్రులు అవంతిని కోడలుగా చేసుకోవడానికి అంగీకరించారు.


 మంచి ముహూర్తంలో అవంతి కృష్ణకాంత్ ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించారు. అవంతి నడిపే స్కూల్ పిల్లలు అందరూ , ఆ నూతన వధూవరులకి తమ ప్రేమ పూర్వక స్వాగతం అందిస్తూ వారి వివాహ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిపి హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులు కదా? వారి ప్రేమ పూర్వక అభినందనలు అందుకున్న ఆ జంట ఆ స్కూల్ ని మరింత అభివృద్ధి దిశగా పయనించేలా చేశారు.


Rate this content
Log in

Similar telugu story from Inspirational