STORYMIRROR

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Inspirational Others

4  

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Inspirational Others

నేను చూడని ఆమె!?

నేను చూడని ఆమె!?

5 mins
248

పురాణాల ఆకాశవాణి,వార్తల ఆకాశవాణి అన్నీ గాల్లో ప్రయాణం చేసినవే!మేలుకోరే వార్తలు అందించినవే!అలాంటి ఓ ఆకాశవాణి నా శరీరంలో కూడా ,మనస్సు చెబుతుంది అంటారే!?సరిగ్గా అలానే , పదేళ్ల క్రితం ఓ విషయాన్ని పదే పదే చెబుతూనే ఉంది.నేనే పట్టించుకోలేదు.

మా ఇంటికి ఒక్కసారే వచ్చిందట స్మరణి..నాన్నమ్మ , మాత్రం ఇప్పటికీ రోజూ చెబుతుంది.ఇక్కడ గోదావరి ఉంటే బావుంటుందని ఆమె అన్నది అని..ఆ ఇక్కడ అంటే!,మా పెరట్లో..పల్లెటూరు కాబట్టి ఆమె అలా అనడంలో తప్పు లేదు.కానీ స్మరణికి కావలిసినట్టు ఎప్పటికైనా మార్చాలి అనుకున్నాను.

నా పేరు రాజీవ్.చిన్ని వ్యాపారంతో,ఆమె పరిచయంతో మొదలైన జీవితం మంచి స్థితిలో నిలబెట్టింది.ఆమెతో కొన్ని రోజులు మాటలు సాగేయి.ఎప్పుడూ చూడలేదు.ఓ రోజు షాప్ ఓపెన్ చేసి,మిత్రుడికి చేయాల్సిన ఫోన్,ఒకే అంకె తేడాతో మిత్రురాలిని కలిపింది.ప్రకృతిలో మార్పు నేను గమనించుకోలేదు కానీ,నాకు నేను చాలా కొత్తగా అనిపించేను.ఓ కొత్త నవ్వు,మాట,పలకరింపు మనిషిలో ఉత్సాహాన్ని పెంచుతుంది.

నామీద నాకు ఎప్పుడూ శ్రద్దే!తరువాతి రోజు నుంచి మరింత శ్రద్ధ ఎక్కువయింది.గంట ముందే షాప్ కి బయలుదేరుతుంటే....అమ్మ బంగారంలా పలకరించింది.

పొద్దునే వెళ్లకపోతే,టిఫిన్ తినేసి వెళ్లొచ్చు కదా!మన వ్యాపారమే!ఎక్కడికి పోతుంది?ఒళ్ళు పాడుచేసుకోకు కన్నా!అంటూ

నాన్న,నాన్నమ్మ,తాతయ్యా వంత పాడేరు.అయినా ఈ కొత్తకి కారణం తెలీక మాట్లాడుతున్నారు.నేను అనుకున్నది నిజమయితే వీళ్ళూ నాలానే మారిపోతారు నవ్వుకున్నాడు రాజీవ్.

ఓ రోజు నాన్న టౌన్ కి,షాప్ దాకా వచ్చేరు.నేను ఉంటాను.అమ్మ నీతో మాట్లాడే పని ఉందిట.ఇంక రావొద్దు..సాయంత్రం నేనే షాప్ మూసి వస్తాను అన్నారు.

అమ్మకి ఫోన్ చేస్తే...కన్నయ్యా!,నా ఫ్రెండ్ కూతురు ఉంది.నీకు నచ్చుతుంది.తాను ఇక్కడే ఉంది.ఒకసారి చూస్తావని...నేనేం చెప్పలేదులే!మామూలుగా వచ్చింది.

కొంచెం భయం మొదలైంది.నేను ఒకమ్మాయిని ఇష్టపడుతున్న విషయం చెప్పాలా!వద్దా!ఆలోచిస్తున్నాడు.

ఏంటి !?ఆలోచన..బయలుదేరు రాజీవ్..నాన్నగారి మాటలకి లోకంలోకి వచ్చాడు.

హడావుడిగా తనకి ఫోన్ చేసేడు.దేవుడా!తానే తీసింది.

చెప్పండి అంది..

ఎం చెప్పాలి?ఆలోచిస్తూ..మీ గొంతు ఏమైంది.మాట తేడా వస్తుంది.ఇంకేం మాట్లాడాలో తెలీక అన్నాడు.

లేదండీ!బానే ఉంది.సవరించుకుంటూ..రాత్రి కూల్ డ్రింక్ తాగేము.తేడా చేసింది.నిన్న స్మరణి పుట్టిన...ఆగింది

ఆ!...నిన్న మీ పుట్టినరోజా!?ఆలస్యంగా విష్ చేస్తున్నా.శుభాకాంక్షలు చెప్పేడు,బస్ వస్తోంది ,ఇంటికి వెళ్ళాలి .తరువాత చేస్తాను..కట్ చేసేడు.

ఇంటికి వెళ్తుంటే,నాన్నమ్మ ఓ అమ్మాయి దారిలో ఎదురయ్యేరు.ఈమెను చూడటానికి అయుంటుంది.ఆమె ఈమెలా ఉంటుందా!?పోల్చుదాం అనుకున్నాడు..కానీ ఇష్టం లేదు.అవతలి మొహం చూసి ఉంటే...బావుండేది అనిపించింది.

ఏమైనా పెట్టమ్మా!ఆకలి వేస్తుంది..చెంగు చేతికి చుట్టుకుంటూ వెనకే తిరుగుతున్నాడు.

చూసావా!?ఆ అమ్మాయిని.ఏవో పరీక్షలు రాస్తుందిట.

నీకు ఇష్టం లేదేమో!?ఇంతవరకూ రాలేదని వెళ్ళిపోయింది.మీ నాన్నమ్మకి తెగ నచ్చేసింది.పరీక్ష బాగా రాయాలని గుళ్లో దణ్ణం పెట్టుకు వస్తానని,వేళకానివేళ వంకపెట్టుకుని...

పెత్తనాలకి వెళ్లిపోయిందిరా రాజా!..నాన్నని వదిలేసి,నువ్వు వచ్చావా.!?తాతయ్య ఆడిగేరు.

లేదు తాతయ్యా!నాన్న ఉంటానన్నారని వచ్చేను.ఇంక పనేం ఉంది?నేనూ వెళ్తాను అంటుంటే..

ఇంక ఇపుడు ఎందుకు!?రెండు మూడు గంటలు పోతే నాన్నే వచ్చేస్తారు అంది అమ్మ.మంచం మీద జారబడ్డాడు అరుగుమీద.

అన్నయ్యా!మీ బావ నన్ను బండి ఎక్కించేసేరు.పాపం!ఒక్కరే నడిచి వస్తున్నారురా..బస్ స్టాప్ దాకా వెళ్ళవా!?

అత్తారింటి నుంచి రాత్రి బయలుదేరిన చెల్లి నీరసంగా ఉన్నా బ్రతిమాలింది.

అయ్యో!ఎక్కడ చెల్లాయి.స్టాప్ లోనే ఉండమని చెప్పు.నేను ఇక్కడున్నట్టు వెళ్తున్నా అంటూ బండి స్టార్ట్ చేసేడు.

బావున్నావా!?ల పలకరింపులు అయి,అల్లుడు వచ్చేలోపు టీ,టిఫిన్ సద్ది ఉంచింది అనసూయ,రాజీవ్ అమ్మ.

భోజనాలు అయ్యాక,మేడ మీద పక్క వేసేరు.పొద్దున్నే బావా,రాజీవ్ కలిసి టౌన్ కి వెళ్లిపోయారు.రోజూ ఈసమయానికి ఫోన్ చేస్తుంది తను.ఇవ్వాళ ఇంకా చేయలేదు అనుకుంటూ షాప్ లో పూజ కార్యక్రమాలు ముగించేడు.

పదిన్నర అవుతోంది.ఒక్కసారి నేనే చేస్తే...రింగ్ ఇచ్చేడు.

రెండో రింగ్కే లిఫ్ట్ చేసేరు వేరే..ఎవరో!?

తను లేదా!?నువ్వు ఫోన్ తీసేవని,అడగలేకపోయినందుకు తిట్టుకుంటూ మోహమటంగా అడిగేడు.

తను అంటే...ఆమె వెటకారం అర్థం అవుతోంది.

ఫోన్ ఓనర్ కి ఇవ్వండి అన్నాడు.

ఈ ఫోన్ ఇల్లా,బడా,గుడా!?ఔనర్ అవ్వడానికి.ప్రస్తుతానికి ఇది నాది.మాట్లాడితే నాతో మాట్లాడండి.దగ్గరయినట్టు మాట్లాడుతోంది.

అంత చనువు నచ్చలేదు తనకి..అబ్బా!ఇంతకు ముందు అమ్మాయి నీ చుట్టం మరీ!?మనసు వెక్కిరించింది.నవ్వు వస్తున్నా,ఆహాన్ని తన అహం దెబ్బ కొడుతుంటే అలా ఉండిపోయాడు.

మధ్యాహ్నం భోజనం సమయం.కారేజ్ తెరుస్తూ ,ఇంటికెళ్తే వెళ్ళండి సార్,మాకూ బిజినెస్ టచ్ ఉంది!ఉడికించేడు బావ సుధీర్

నిజంగా ఉంటారా బావా!చిన్నపని..గంటలో వచ్చేస్తాను నవ్వు విరిసింది రాజీవ్ మొహంలో.

అమ్మ వాళ్ళ స్నేహితురాలు ఇంటికి వెళ్లమంది..కొంచెం

అవసరమయిన పని ఉంది.అందుకే ఫోన్ చేయలేకపోయాను.చెప్తుంటే..ఫోన్ ఇవ్వవే విసురుగా లాక్కున్నట్టు అర్థం అయింది.

సరిగ్గా అనిపించలేదు రాజీవ్ కి..ఇపుడు ఫోన్ కొనివ్వడం బాగోదు.ఎం చేయాలి!?ఆలోచిస్తుంటే పావుగంటకి ఫోన్ చేసింది.ప్రశ్నపేపర్స్ చూస్తున్నాం నెట్ లో..అందుకే ఫ్రెండ్ ఆడిగిందని...

ఎం పని అది!?నాకు పని ఉంటుందని చెప్పొచ్చు కదా!,!కోపం ఆపుకుంటున్నా తారాస్థాయికి వెళ్లిందని తను క్షమాపణ చెబుతుంటే కానీ అర్థం కాలేదు

సరే!పని అయిందా!...నిన్న ఎక్కడికో వెళ్ళేను అన్నావు.ఎం పని!?డబ్బులు ఏమన్నా అవసరమా అని అడగాలని ఉంది.కానీ తప్పుగా అనుకుంటే..!?ఈ ఫోన్ మాట్లాడడం బాగా అలవాటు,ఇష్టం అవుతున్నాయి.ఈ మాటకి ఫోన్ కట్ చేసినా,మాటలు ఆగిపోయినా యుగాంతం అవుతుందేమో !?అనేంత దాదాపు ప్రేమలోనే మునిగిపోయాడు రాజీవ్.

సరే!నేను మళ్ళీ చేస్తాను అని పెట్టేసింది..

ఏదో తేడా అని చెబుతోంది మనసు.ఎలా కనిపెట్టడం!?ఎక్కడ ఉంటుంది!?

మళ్ళీ ఫోన్ చేయండి బాసూ!బావ మాటలకి లోకంలో ఉన్నానని గుర్తొచ్చింది.

ఎవరూ!?మళ్ళీ అదే బోరింగ్ గొంతు.

మీరేవరు!?కోపాన్ని అణుచుకున్నాడు.

ఓనర్ కావాలి అన్నాడు.నేనే ఓనర్ చెప్పండి అంది గొంతు.

ఓ గంట ముందు ఈ ఫోన్లో మాట్లాడిన అమ్మాయి కావాలి.గట్టిగా చెప్పేడు.

ఓ స్మరణీ నా!?ఇప్పుడే బుక్స్ కొనుక్కోవాలి,డబ్బులు తెచ్చుకుంటాను అని బయటకు వెళ్ళింది. వాళ్ల అన్నయ్య

వచ్చారు.ఇంతకీ మీరు...

నాకు తన వివరాలు కావాలి.ప్లీసమ్మా...

అంత వద్దులెండి సర్..మీరన్నట్టు ఈ ఫోన్ ఓనర్ స్మరణి మాత్రమే కాదు,నేను,కవిత,మౌనిక,స్రవంతి ఇంత మంది ఉన్నాం.మేము బాంక్ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నాం.అంతా ఓ ఇంట్లో ఉంటాం.పార్ట్ టైం చేస్తూ,ఈ ఫోన్ కొనుక్కున్నాం.ఇది డబ్బా ఫోనులా అన్నమాట.అందరిదగ్గరా ఉంటుంది.ఎవరిదీ కాదు.మొదటిసారి కష్టం వింటున్నవారు ఆడా,మగా మంచి,చెడు ఆలోచించకుండా ఏడ్చేసింది స్వాతి.

చూడమ్మా !ఏడవద్దు...నేను సాయం చేయగలను.కానీ ఎలా ఎం చేయాలో తెలీదు! ఓ...ఒక్కనిమిషం గొంతు బొంగురు పోతుంటే ఆగేడు రాజీవ్..

పర్లేదు సర్!భూమి ఇంకా తిరుగుతోంది అంటే,కొంచేమ్ మీలాంటి బాధను అర్థం చేసుకునేవాళ్ళు ఉండడం వల్లేనేమో!?

మీకు ఎం సాయం కావాలన్నా నన్ను అడగండి.బుక్స్ ,ఫీ ఏమైనా చేస్తాను.మంచిగా చదువుకోండి.

మా అక్క అంటే ఇష్టమా సర్!?సూటిగా అడిగిన ప్రశ్నకు నవ్వుకున్నాడు..

లైన్లోకి వచ్చింది స్మరణీ!...మీ పేరు బావుంటుంది అన్నాడు.

కవిత...కవిత కూడా ఓ పేరే....

పోవే కవితా!అలాంటిదేం లేదు.నేను మాట్లాడి వచ్చేస్తాను అంటూ వాళ్ళకి చెప్పి, పక్కకు వచ్చింది..

ఎలా ఉన్నావ్ స్మరణీ!నేను మీ పరీక్ష కు ఏమైనా సాయం చెయ్యొచ్చా!?ఆడిగేసేడు చివరికి.

వద్దు..అసలు ఒకోసారి ఈ చదవడం,పరీక్షలు రాయడం చిరాకు అనిపిస్తుంది.అమ్మానాన్నలకి చెప్పి,పెళ్లి చేసేసుకోవాలి..తనవైపు ప్రేమని చెప్పేసినందుకు సిగ్గు పడినట్టుంది,ఫోన్ కట్ చేసింది.

ఇంక మనం పెళ్లిలోనే కలుద్దాం నవ్వుకున్నాడు రాజీవ్.

బావా!పాకం ముదురుతున్నట్టు ఉంది.సాయం కావాలా..

అసలు మేము వచ్జిందే అందుకని ఎపుడు తెలుస్తుందో

అర్భకుడికి మనసులో అనుకున్నాడు బావ సుధీర్.

మొత్తానికి సుధీర్ సంధి పనిచేసింది.కుటుంబం వాళ్ళింటికి చూసుకోవడానికి వెళ్ళేరు.అంతా బావున్నట్టు ఉంది.పైగా ఇద్దరూ ఇష్టపడ్డారని మంగళవాయిద్యాలు మోగించేరు.

పెళ్లి అయిపోయింది.మొదట్లో తనతో కాదేమో అని అనిపించేది ఒక్కోసారి..తాను ఇష్టపడ్డాడు కాబట్టి బంగారంలా చూసుకుంటున్నారు ఇంట్లో అంతా.. స్మరణి కూడా కలిసిపోయింది వారిలో...అయినా...స్మరణి జ్ఞాపకాలు వేరే ఉన్నాయి రాజీవ్ లో..అవి తనతో కలవడం లేదు,అనిపించేది.

పదేళ్లు గడిచిపోయాయి.ఇప్పుడు వ్యాపారం పెరిగి సిటీ కి వచ్చేసేడు రాజీవ్.భార్యని పుట్టినరోజు షాపింగ్ కి తీసుకొచ్చేడు..

ఓ మంచి కాఫీ !..కేఫ్ కి వెళ్లి ,తాను చేసిన ఆర్డర్కి నవ్వొచ్చింది.స్మరణి రెండోరోజు ఫోన్లో మాట్లాడిన మాట అది.ఎప్పటికీ మర్చిపోలేను నవ్వుకున్నాడు.

మీరు రాజీవ్ సర్ కదూ!ఇంచుమించు మా వయసు ఉండొచ్చు,కానీ నేను తెలిసి,నాకు తెలీని అమ్మాయి అంటే...ఎక్కడో చూసినట్టుంది.ఆవిడ ఎవరై ఉంటారు!?ఆలోచిస్తున్నాడు.

మీరు నన్ను గుర్తు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు.ఇంకా చెప్పాలంటే అంత సీన్ నాకు లేదు.కానీ సాయం అందుకుంటే...తప్పకుండా కృతజ్ఞతలు చెప్పాలి.లేకపోతే

దేవుడు క్షమించడు రాజీవ్ సర్...నవ్వుతూ...అమ్మా!ఇటు రండి!వైటర్ ని పిలిచింది.

ఆమె చర్య తెలుసున్నట్టు ,దగ్గరగా...ఈ నిమిషం కొత్త రహస్యం తెలియబోతున్నట్టు వాతావరణం తీయగా మారిపోయింది.

ఎందుకో!ఆమె వైటర్ తో చెప్పబోయే మాటకు ఆసక్తి పెరుగుతుంది రాజీవులో..

ఓ మంచి కాఫీ తే నాన్నా!థాంక్యూ మళ్ళీ నవ్వింది.

హ్యాండ్బ్యాగ్ లో ఏవో సర్దినట్టు..అటూ ఇటూ కదిపింది.

తప్పకుండా మేడం,ఎందుకు నవ్వేడో వైటర్ కూడా గంతులు వేసుకుంటూ పోయేడు.

స్మరణీ!అప్రయత్నంగా బయటకు అన్నాడు..

ఓ క్షమించండి...నా పేరు స్మరణి..నేను మీతో ఒకటి రెండు సార్లు మాట్లాడి ఉన్నాను.గుర్తు వచ్చిందా సర్!?నవ్వుతోంది.

రాజీవ్ కి మాటలు రావడం లేదు..మీరు నిజంగా...

అయ్యో!అబద్దాన్ని కాదు సర్..కానీ నిజాలు దాయబడతాయి.ఎపుడో అవసరానికి లేదా సరదాకు లేదా నిజం గురించే నిజం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఇలా...నవ్వు మాయం అయింది.మళ్ళీ హ్యాండ్బ్యాగ్ లో ఏంటో వెతుకుతోంది..

ఎందుకు అలా,ఆమె వంకే చూస్తున్నాడో,రాజీవ్ కి అర్థం కావట్లేదు.

మళ్ళీ మాట్లాడ్డం మొదలుపెట్టింది.కొంచెం సాయానికి ఏమి ఇస్తావు,ఎం చేస్తావు ఏవి అడుగుతారో తెలీదు సర్ కొంతమంది..మీ హెల్ప్ అస్సలు మర్చిపోలేను.ఆరోజు మీతో మాట్లాడిన అమ్మాయి స్వాతి,మిమ్మల్ని ఎఫ్బీ లో చూపించింది.ఇంత స్మార్ట్ ఉన్నారు..మీరు పోస్ట్ చేసిన ఫిక్స్ అన్నీ చూసి..సాయం నిజమేనా!?తప్పుగా అనుకున్నాను.

లేనివాళ్ళకి సాయం చేస్తే,అడగకూడనిది అడిగేస్తారు చాలా మంది కళ్ళు తుడుచుకుంది స్మరణి..సారి సర్! స్వాతి చాలాసార్లు చెప్పింది.మీరు అలా అస్సలు కారు,కాలేరు అని.పదేళ్ల పరిశ్రమ తరువాత చిన్న,చిన్న స్టేజ్ లు దాటుకుంటూ..బ్యాంకు మేనేజర్ అయ్యేను..ఈ జీవితం మీదే అని,కాళ్ళమీద పడిపోను,తప్పుకదా సర్,కానీ మీ సాయాన్ని చచ్చేవరకూ మర్చిపోలేను..

మేడమ్!మంచి కాఫీ...సర్!మంచి కాఫీ ఇద్దరువైటర్స్ ఒకేసారి వచ్చేరు.

హు!మంచి.. మనం చూసేదే మంచి అయితే మంచి,లేదంటే..అంతే!ఇందులో ఎం ఉంటుందో మనకి తెలుస్తుందా!?సర్.కానీ జీవితంలో మంచిని మాత్రం మనసు చెప్తూనే ఉంటుంది.దేన్నీ అయినా..నేను తగ...ను కళ్లనీళ్లు ఆగడం లేదు ఆమెకు,

తుడుచుకుంటూ.. నాదికాదేమో!?నన్ను కాదేమో!?అని వదిలేయడం ఖర్మ అవుతుందేమో కదా! సర్..

రాజీవ్ కేమో,అమ్మ మాటలు గుర్తొస్తున్నాయి..నిజంగానే ఈ అమ్మాయి నీకు నచ్చిందా!ఒక్కడివే నలుసు.నీ బాధ చూడలేము రాజీవ్.బాగా ఆలోచించుకో!?మాటలు ఇన్నాళ్ల తరువాత మళ్ళీ,అమ్మ పక్కనే ఉండి చెబుతున్నట్టు ఉన్నాయి.

సర్...టేబుల్ మీద చరిచింది.తలెత్తే పరిస్తుతుల్లో లేడు రాజీవ్..ఎక్కడ తప్పటడుగులు పడ్డాయో!?గతంలో వెతుక్కునే పనీలో ఉన్నాడు.దారి కనిపించడం లేదు.కన్నీటి వరదలు ముంచుతున్నాయి..

ఆకాశవాణి మేలైనవి ఎన్నుకొని ఒక్కసారే చెబుతుంది.

పట్టించుకోకపోతే..ఫలితం..ఎవరి మానసిక తాహతుకు తగ్గట్టు వారు అనుభవించాల్సిదే!?

కవిత రావడం చూసి,మీ మేలు మర్చిపోను అని చెప్పడానికి వచ్చెను అంతేకాదు,ఒక్కసారి మిమ్మల్ని స్వయంగా చూడాలనిపించింది..దేవుడి దర్శనం అయింది.దేవత దర్శనం ఈ జీవితానికి మంచిది కాదు.

చివరిమాట రాజీవ్ కు వినబడేలా మాత్రం చెప్పింది.

ఏమండీ!ఎవరామే!తెలిసినట్టు తెగ మాట్లాడేస్తుంది.ఒక్కటే కాఫీ చెప్పేరా!సరే!షాపింగ్ కి వెళ్ళాలి...మాట్లాడేస్తు కార్ వైపు చూసింది.స్మరణి బై చెబుతోంది తనకి.ఆ నవ్వులో కసిలేదు.అయినా తలొంచుకుంది కవిత ఉరఫ్ స్మరణి.

భర్త ఎదురుగా కూర్చుంటూ అంది.హలో సర్,నేను కవిత..ఆకాశవాణి మేలైన వార్తల్ని చెప్పగానే,వాటిని మన సొంతం చేసేసుకోవాలి. సిన్మాల ప్రేమలు తొందరగా దొరకవు సర్.అలా ఎవరికైనా దొరికినప్పుడు పంచుకోవాలని చూడడంలో తప్పు లేదు.

మాటలవరకే కదా తనతో దగ్గరైంది.ఇన్నేళ్లలో నా తీరు మీకు తేడాగా ఉందని,ఇపుడు అనిపిస్తే చెప్పండి

మార్చుకుంటాను.వెళ్లిపోమని మాత్రం చెప్పొద్దు..

నేను ప్రేమించిన ప్రేమ పోయినా నన్ను ప్రేమించే ప్రేమ దొరికిందని మనసు చెబుతోంది రాజీవ్ కి..కానీ ఓ వారం క్రితం ,స్వాతి బద్దలుకొట్టిన అగ్నిపర్వతం స్మరణిలో జీవితం మీద అశని తగ్గించేసింది.సముద్రంలా కాపాడిన నలుగురిలో కవిత ఎత్తుకుపోయిన స్వాతిచినుకుల జీవితాన్ని తల్చుకుంటుంటే దుంఖం ఆగడం లేదు.అందుకే బదిలీకి అర్జీ పెట్టుకుంది.సఫలం కావాలని ఆశిద్దాం!



Rate this content
Log in

Similar telugu story from Abstract