STORYMIRROR

Narra Pandu

Tragedy Inspirational Others

4  

Narra Pandu

Tragedy Inspirational Others

నేనెవరు...?

నేనెవరు...?

1 min
370

నేనెవరు...?

నాలో నన్నే చూడాలనుకునే వాడినా..?

నాలో నేనుగా పరివర్తన చెందాల్సిన వాడినా..?

నాలో నేనెవరో తెలుసుకోవాల్సిన వాడినా..?

నేనెవరు....

నాలో నన్నే చూడాలనుకునే సందర్భంలో బంధనుబంధాలు బొందలో కప్పేసి, ఆకాశమంతా ఆశల్ని నింపేసి, తీరని దాహానికి, ఆరని ఆహానికి, స్వార్ధపు దేహానికి చిరునామా అవుదామనుకున్నాను.

నాలో నేనుగా పరివర్తన చెందాల్సిన సందర్భంలో గతాల వలయాల్ని చీల్చుకొని అవి మిగిల్చిన మచ్చల్ని తుడిచి, నేర్పిన పాఠాల్ని వల్లెవేసి సాధన శకటంలో మేధనై పయనించి ముళ్ల దారిని పూల దారిగా మార్చి పయనం అవుదామనుకున్నాను.

నాలో నేనెవరో తెలుసుకోవాల్సిన సందర్భంలో నీటిలో బిందువునై, మట్టిలో రేణువునై, కాంతిలో రేఖనై, పువ్వులో అందమై, అగ్గినై, బుగ్గినై , ప్రకృతిలో పరవశిద్దామనుకున్నాను-నర్ర పాండు✍️



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Tragedy