నేనే నాయకుడిని అయితే
నేనే నాయకుడిని అయితే


కేశవరావు మరియు శ్రీలక్ష్మి దంపతులకి రాజా , చిన్న అని ఇద్దరు పిల్లలు. పుట్టుకతోనే పేదరికం అనుభవిస్తూ పెరిగారు పిల్లలు ఇద్దరూ.
కేశవరావు ఒక బట్టల కొట్లో గుమస్తాగా పని చేస్తూ ఉండేవాడు. శ్రీలక్ష్మి మెషీన్ కుట్టి భర్త కి తన వంతు సహాయం చేస్తూ ఇంటిని నెట్టుకుంటు వచ్చారు.
పిల్లల వయస్సుతో పాటు వాళ్ళ చదువులకు అయ్యే ఖర్చు కూడా పెరుగుతూ వచ్చింది. శ్రీలక్ష్మి వాల్ల అన్న, చెల్లెలి కష్టాన్ని చూడలేక రాజా చదువు కి అయ్యే ఖర్చు తను కడతాను అని చెప్పి రాజాని చదివిస్తూ వచ్చాడు.
పిల్లలు ఒక వయసుకు వచ్చేవరకు ఎలాగో కష్టపడి అప్పుచేసి చదివించారు. పిల్లలు కూడా సెలవు రోజుల్లో ఏదో ఒక పని చేసి వచ్చిన డబ్బుతో వల్ల చదువుకు కావలసిన పుస్తకాలు కొనుక్కొని చదువుకోనే వారు.
ప్రభుత్వం వారు పేదవారికి ఉచితంగా ఇల్లు కట్టిస్తున్నారని తెలిసి దరఖాస్తు వేసాడు కేశవరావు. ఇల్లు ఉంటే కనీసం ఆ అద్దే డబ్బులన్నా మిగులుతాయేమో అని ఎన్నో ఆశలతో ఎదురుచూస్తుండగా. దరఖాస్తు రద్దు అయింది అని చెప్పడంతో ఎంతో కృంగి పోయాడు.
రాజా తన చదువు పూర్తి చేసిన వెంటనే ఏదో చిన్న ఉద్యోగంలో చేరి వచ్చే జీతంలో వాళ్ళ నాన్నగారు వాళ్ళ చదువుల కోసం చేసిన అప్పు తీర్చేసాడు.
చిన్నోడికి ఒంట్లో బాగలేక హాస్పిటల్ కి వెళ్తే మా తీన పరిస్థితిని చూసి "ఆరోగ్య శ్రీ కార్డ్ కి ధరకాస్తు పెట్టుకోండి కొంత వైద్యం ఉచితంగా చేయించుకోవచ్చు "అని డాక్టర్ సలహా మేరకు దరఖాస్తు పెట్టుకున్నాడు.
అదికూడా రాలేదు, కారణం తెలియలేదు. ఇలా అన్ని విధాలుగా వాళ్ళకి ఇబ్బందులే ఎదురవడంతో విసిగిపోయాడు కేశవరావు.
"ఈ ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఎవరికోసం ఇస్తున్నారో అర్దంకావట్లేదు. కులాల పేరు చెప్పి మనుషుల్ని విడదీసి అందులో వెనక బడిన కులాలు అని చెప్పి పథకాలు పెట్టి ఓట్లు లాగుతున్నారు తప్ప.
"అసలు ఆ పథకాలు చేరవలసిన వాళ్ళకి చేరుతున్నాయో లేదో తెలుసుకుంటున్నారా. కులాల పరంగా వెనకబడిన వాళ్ళకి కాదు ఆర్ధికంగా వెనుకబడిన వాళ్ళకి చెందేలా పథకాలు పేడితే అప్పుడు ఈ రాష్ట్రం, ఈ దేశం రెండూ బాగుపడతాయి.
"నేనే కనుక నాయకుడిని అయితే ఈ కులాలని పక్కన పెట్టి ఆర్ధికంగా వెనుకబడిన వాళ్ళకే అన్నీ పధకాలని ప్రవేశపెట్టేలా చేస్తాను. కుల వివక్షత లేకుండా చేస్తాను. అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది." అని ఎంతో ఆవేదన చెందారు.