jayanth kaweeshwar

Drama Action Children

4.5  

jayanth kaweeshwar

Drama Action Children

నాటిక : "ఆరోగ్యంఆనందం" -: kaweeshwar

నాటిక : "ఆరోగ్యంఆనందం" -: kaweeshwar

3 mins
317


నాటిక : "ఆరోగ్యంఆనందం" 

పాత్రలు: 1 .బాలుడు(3) ; 2.బాలిక(3); 3.శిక్షకుడు ( కోచ్:శంకర్): 4. ఇంటావిడ.:

5 . వాకర్స్ (2 . స్త్రీలు ,2 పురుషులు) ;6 న్యాయనిర్ణేతలు(2 ). 7 యాంకర్.

స్క్రీన్న- ప్లే : పాఠశాల మైదానం లో సంభాషణ ( గార్డెన్& స్కేటింగ్ రింక్) .

బాలుడు: హాయహాయ్! ఎలాగున్నావు? 

బాలిక : హాయ్ ! నేను మంచిగా ఉన్నాను . నువ్వెలా ఉన్నావు?

బాలుడు: నేనుచాలాబాగున్నాను . 

బాలిక : చాలా బాగా అంటే ఎలా?

బాలుడు: అంటే నేను ఆరోగ్యంగా - ఆనందం గా ఉన్నాను.

బాలిక :ఆరోగ్యంగా- ఆనందంగాఎలాగా? 

బాలుడు : అమ్మ చేసిన కషాయం, గ్రీన్ టీ మొదలైన వాటిని త్రాగి ఇమ్మ్యూనిటి పవర్ పెంచుకుంటున్నాను . అంతే కాకుండా రోజూ సాయంత్రం సైక్లింగ్ కూడా చేస్తున్నాను . 

బాలిక : నేను కూడా నీలాగా ఆరోగ్యంగా - ఆనందంగా ఉండాలనుకుంటున్నాను .

బాలుడు : నేను చెప్పినట్లుగా మీ అమ్మ ను కూడా అడిగిమనం ఒక కోచ్ వద్ద శిక్షణకోసం పోదామా?

బాలిక : సరే. నేను రేపు చెబుతాను . 

ఆ తర్వాత రోజు ..........

బాలుడు : మీఅమ్మనుఅడిగావాఅడిగావా?

బాలిక : అవును. అడిగాను. మన ఆరోగ్యం గురించి అంటే సరేఅన్నది. 

బాలుడు: ఐతే ఓకే !ఇప్పుడేమనం కోచ్ వద్దకు పోదాం.

కోచ్ ఇంటివద్ద : 

బాలుడు : కాలింగ్ బెల్ నొక్కి , మేడం కోచ్ ఇంట్లో ఉన్నారా?

మేడం : లేరు , ఇప్పుడే మార్నింగ్ వాక్ కు వెళ్లారు . అక్కడ గార్డెన్ లో స్కేటింగ్ - డే గురించి 

తనమిత్రులతో మాట్లాడాటానికి వెళ్లారు. 

బాలుడు బాలిక : ఓకే థాంక్యూ ఆంటీ .

బాలుడు: మనం ఇప్పుడే పార్క్ కు వెళ్లి కోచ్ తో మాట్లాడుదాం .

బాలిక : సరే ! వెల్దాము .

పార్క్ దగ్గర : { కోచ్ తన స్నేహితులతో మాట్లాడుతున్నారు . అక్కడ ఒక రింక్ కూడా ఉన్నది . కొందరు దానిపై స్కేటింగ్ చేస్తున్నారుచేస్తున్నారు.

కోచ్ : పిల్లలూ గుడ్ మార్నింగ్ ! చెప్పండి ఏమిటిలావచ్చారు? 

బాలుడు : సర్ మేము ఆరోగ్యం గా - ఆనందంగా , చలాకీగా ఉండాలని అను కుంటున్నాము . దానికి మీ శిక్షణ మాకు కావాలి .

బాలిక : మేమిద్దరం కూడా స్కేటింగ్ లో శిక్షణ పొందాలని అనుకుంటున్నాము జాయిన్ చే సుకుంటారా? 

కోచ్ : సరే ! మీరు రేపు వచ్చేయండి. వచ్చేటప్పుడు స్కేటిం గ్ ప్యాడ్స్ తెచ్చుకోండి. 

బాలుడు: మఱి మీరు దేనిగురించి చర్చించు కుంటున్నారు? 

కోచ్ : మేము స్కేటింగ్ - డే సెలబ్రేషన్స్ గురించి చర్చించుకుంటున్నాం .అది జూన్ 21 నాడు జరుపుకుంటున్నాము. ఇంకా స్కేటింగ్ మంత్ కూడా అక్టోబర్ లో జరుపుకుంటున్నాము.

పార్క్ లో : సంభాషణ :-

శర్మ గారు : మనం ఎక్కడ సెలెబ్రేట్ చేసుకుందాం ? 

రావు గారు : ఈ పార్క్ లోనే స్కేటింగ్ ఏరియా ను డెవలప్ చేయించి , సెలెబ్రేట్ చేద్దాం .

అనసూయ : వీటికి సంబంధించిన arrangements ఎలా ?

కోచ్ శంకర్ : నా శిష్యులు ఉన్నారు కదా! వారి ద్వారా పని కానిచ్చేద్దాం . ఇంకా సి నెలలు టైం ఉంది కదా! 

ఆ తర్వాత రోజు :- 

కోచ్ శంకర్ : పిల్లలూ ! మీకు నేను స్కేటింగ్ నేర్పిస్తాను , దానితో ఏంతో అద్భుతం గా ప్రాక్టీస్ చేయించి , కాంపిటీషన్స్ కు తయారవుదురు గాని. 

బాలుడు : సరే మాష్టారు .

బాలిక నేను కూడా రెడీ !.

కోచ్ శంకర్ : సరే ! ఇప్పుడు ఇక్కడే ప్రాక్టీస్ చేయండి.

{ స్టేజి పైన - : పార్క్ సీన్ , స్కేటింగ్ ట్రాక్ . (వీడియో పాటలు ప్లే అవుతున్నాయి : పడకు పడకు అడ్డుకడకు , హిందీ స్కేటింగ్ సాంగ్ కూడా ప్లే అవుతుంది.) పిల్లలు స్కేటింగ్ ప్రాక్టీస్ చేస్తూఉంటారు. }

బాలుడు : ఇది భలే బాగుంది! ఈ compitition కాగానే ఎం చేస్తావు ?

బాలిక : ఈ స్కేటింగ్ ప్యాడ్స్ ఇంట్లో కూడా వాడుతాను .

బాలుడు : అది ఎలా ?

బాలిక : ఏముంది? మా ఇంటిదగ్గర , స్కూల్ దగ్గర అలాగే ప్రాక్టీస్ చేస్తూ త్వరగా పనులు చేసుకోవచ్చు .

        మరి నీ వో ? 

బాలుడు : మరి నేనైతే అమ్మ- నాన్న - చెప్పిన పనులన్నీ ఇలాగే స్కేటింగ్ పాడ్స్ కట్టుకొని చేస్తాను.

బాలిక : మరి క్రింద పడిపోతే ఎలా ? 

బాలుడు : ఏముంది ! మల్లి మూవీ స్ప్రే కొట్టుకుని ప్రాక్టీస్ చేస్తాను .

బాలిక : మనం పార్కులో కూడా ప్రాక్టీస్ రోజూ చేద్దాం .

బాలుడు : సరే !

{ ఇలా వాళ్లిద్దరూ రోజూ ప్రాక్టీస్ చేసి కాంపిటీషన్ కు రెడీ అవుతారు. }

కోచ్ శంకర్ : పిల్లలూ మీరు ప్రాక్టీస్ చేశారా? 

పిల్లలు : అవును.

కోచ్ శంకర్ : మరి రేపే కాంపిటీషన్ - ఇలా ముగ్గురు పిల్లలు కూడా పాల్గొంటున్నారు.(చైల్డ్ ఆర్టిస్ట్స్ నరేష్ అండ్ others )

పిల్లలు : మేము రెడీ.

 Narration : కాంపిటీషన్ రోజు బాలుడు , బాలిక ఇంకా ముగ్గురు పిల్లల మధ్య కాంపిటీషన్ జరుగుతుంది. అందరు పార్టిసిపేట్ చేస్తారు . వీడియో సాంగ్స్ ప్లే అవుతాయి. నరేష్ ఇంకా ఇద్దరు పిల్లలు పార్టిసిపేట్ చేస్తూ చేస్తూ క్రింద పది , పట్టుతప్పి పడిపోతూతూమరలా లేచి . మరలా స్కేటింగ్ లో పార్టిసిపేట్ చేస్తుంటారు . ( కామెడీ కోసం )

ఆ తర్వాత కోచ్ - శంకర్ ఫలితాలను అందింప జేయ వలెనని జజడ్జిలకు ( న్యాయ నిర్ణేతలకు ) చెబుతాడు.

జడ్జి 1 : " ఇలానే ఆరోగ్య కరమైన , ఆనందకరమైన వాతావరణం లో ఈ పోటీలు జరగడం ఏంటో ఆనందకరం . ఇలాగే ప్రతి సారి జరగాలని భావిస్తూ ..... నేను ఈ పోటీల్లో రన్నర్ అప్ ని ప్రకటిస్తున్నాను . బాలుని పేరు. (ప్రకటిస్తారు.)

జడ్జి 2 : నేనుఈసంతోషసమయంలోఅందరిని అభినందిస్తూ విజేతపేరునుప్రకటిస్తున్నాను . ( బాలిక పేరు .(ప్రకటిస్తారు.)

యాంకర్ ( అనసూయ ) : మిగిలిన వారిని , కళాకారుల , రచయిత, కోచ్ శంకర్ మొదలైనవారి పేర్లను ప్రకటిస్తుంది అందరికి achievement సర్టిఫికెట్స్ , momentoes ని జడ్జెస్ ద్వారా ఇప్పిస్తారు. 

వ్యాఖ్య : ఈవిధం గా క్రీడాకారులు , కోచ్ లు , పిల్లలు మొదలైనవారు అందరూ ఆరోగ్యం గా, ఆనందం గా , ఫిట్ గా ఉండడానికి అందరూ ప్రయత్నిస్తే అందరూ ఆరోగ్యం గా , ఆనందం గా జీవిస్తారు. 

ఈ నాటిక సమాప్తం . : రచన : కవీశ్వర్ జయంత్ కుమార్ .



Rate this content
Log in

Similar telugu story from Drama