jayanth kaweeshwar

Children Stories

5.0  

jayanth kaweeshwar

Children Stories

నాల్గవ కోతి

నాల్గవ కోతి

4 mins
473


నాల్గవ కోతి

ఒక ఊరిలో రాము, రవి, రమ్య శ్రావణి అనే నలుగురు విద్యార్థులు ఉండేవారు వారు దగ్గర లోని పాఠశాల లో చదువుతుండేవారు . రాము విద్యార్ధి చాలా అల్లరి వాడు . అతడు తన బుద్ధికి ఏ ఆలోచన వస్తే దాన్ని , అది కష్టమైన , నష్టమైనా దాన్ని అమలు పరిచేవాడు . గురువులు చెప్పిన మాటలను, సూచనలను సరిగా వినకుండా , ఎప్పుడు దాన్ని చెడు గా చెప్పేవాడు. అతడు ఎప్పుడూ తన స్నేహితులకు పెద్దలగురించి చెడునే చెప్పేవాడు . ఆ విధంగా అతడు అలాగే చదువును కొనసాగిస్తున్నాడు. ఇదిలా ఉంటె రవి ఎప్పుడూ తాను పనికి రాని చెడు చిత్రాలను , ఫోటోలను దినపత్రికల్లో వచ్చిన వాటినే చూస్తూ సమయాన్ని వ్యర్థం చేసేవాడు . అంతే కాకుండా తన ఇంట్లో ఉన్న ఇంటర్నెట్ లో గల పోర్న్ ఫిలిమ్స్ కూడా తల్లిదండ్రలకు తెలియకుండా చూసే వాడు . అతని తల్లి దండ్రులు ఇద్దరూ ఉద్యోగస్తులే . ప్రొద్దున వెళితే రాత్రి 9 గంటలకు వచ్చేవారు . వారిది చిన్న ఫామిలీ . ఈ విధం గా వారిద్దరూ చదువును కొనసాగిస్తున్నారు. గురువులు ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. {చెడు అనవద్దు , చెడు కనవద్దు }

ఇక రమ్య ఆమె తల్లి దండ్రులు కూడా ఎప్పుడూ కొట్లాడుకుంటూ ఉంటారు తల్లి గృహిణి తండ్రి ప్రభుత్వ ఉద్యోగి . వాళ్ళు అఱుచు కుంటూ ఉండే వారు . ఒకరినొకరు తిట్టుకోవడం లాంటివి ఎక్కువగా జరుగుతుండేది . దానివలన రమ్య కూడా వాటినే నేర్చుకుని పాఠశాలలో వాడుతుండేది . ఆ మాటలు వినలేక మిగిలిన విద్యార్థులు ప్రిన్సిపాల్ కు complient ఇచ్చారు ప్రధానాచార్యుడు ఆ అమ్మాయిని మందలించాడు , కానీ రెండు రోజుల తర్వాత మ ళ్ళి అలాగే ప్రవర్తించేది . ఇక శ్రావణి ఆ అమ్మాయి తల్లి దండ్రులు మెకానిక్ , వారి అమ్మ గృహిణి . ఆమె ఎప్పుడూ అస్సేబ్లింగ్ పని ఆ అమ్మాయి వాళ్ళ నాన్న చేసిన పనిని చెడగొట్టేది. అదే అలవాటును ఆ అమ్మాయి పాఠశాలలో ప్రదర్శించేది పిల్లల దగ్గర ఉన్న calculator లాంటి వస్తువులను అడిగి చెడగొట్టేది ఆ పిల్లలు బాధతో ప్రిన్సిపాల్ గారికి compliant చేశారు, {చెడు వినవద్దు ; చెడు చెయ్యవద్దు } .

అయితే ప్రిన్సిపాల్ గారు వారి క్లాస్ టీచర్ ని పిలిచి ఈ నలుగురు పిల్లలని మార్చి వివేకవంతులు చేసి మరల ఆ దావారిలో పోకుండా కౌన్సిలింగ్ చేస్తే బాగుంటుంది అని చెప్పారు. మరుసటి రోజు వారి తరగతి ఉపాధ్యాయుడు ఆ పిల్లల తల్లిదండ్రులను పిలిచి పిల్లలకు వారి సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు . అయితే వారి తల్లిదండ్రులకు వారిని psychologist దగ్గరికి తీసుకు వెళ్లాలని అనుకుంటూ వారివారి పిల్లలను తీసుకుని వెళ్లారు. సైకాలజిస్ట్ వారి పిల్లలను పరీక్షించి వారు ఆలా ప్రవర్తించడానికి కారణం ఏమంటే?తల్లిదండ్రులు సరిగా ఇంటిలో పట్టించుకోక పోవడమే . ఎదుగు తున్న వారికి తల్లిదండ్రుల సహాయం తప్పక ఉండాలని , వారి పిల్లలను ఒకకంట , పిల్లల ప్రవర్తనను కనిపెట్టుకుని ఉండాలని , అయితేనే వారు అనుకున్న విధం గా అభివృద్ధిలోకి వస్తారని చెప్పారు కౌన్సిలర్ . అలా ఇదిఅంతా జరిగిన వారం రోజులకు వారి తల్లిదండ్రులు ఒక ఉపన్యాసానికి తీసుకు వెళ్లారు . అక్కడ స్వామిజి యొక్క ఉపన్యాసము విన్నారు. అందులో స్వామిజి ముఖ్యమైన విషయాన్ని బోధించారు . అది ఏమంటే " మానవుడైన ప్రతివ్యక్తికి జ్ఞాన నేత్రం అనేది ఉంటుంది కానీ మనసు దానివైపుకు పోవడంలో నియంత్రిస్తుంది. ఆలోచనలే ఆవిధంగా వెళ్ళడానికి పురమాయిస్తున్నాయి . ఆ ఆలోచనలు రెండు రకాలుగా ఉన్నాయి . అవి మంచి , చెడు . మనసెప్పుడూ చెడు వైపుకు పంపించడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే అది తాత్కాలికం గా సులభం గా , అందమైన అబద్ధంలా , శాశ్వత నష్టానికి తాత్కాలిక ఉపశమనాన్ని అందించేలా ప్రవర్తిస్తుంది. అందుకనే పిల్లలు ఆవిధంగా ప్రవర్తించారు. ఇప్పటినుండి మీరు ఇచ్చిన కౌన్సిలింగ్ అంటే కాకుండా నా ధనాత్మక ఆశీర్వాదము ల తో మీ పిల్లలు అభివృద్ధి పథంలో పయనిస్తారు . అంతే కాకుండా నేను గాంధీజీ చెప్పిన మార్గదర్శకాలు, సూక్తులు పిల్లలకు వివరించాను . వాటిలో ముఖ్యమైనవి ఏమిటంటే { చెడు అనవద్దు ; చెడు కనవద్దు : చెడు వినవద్దు అలాగే చెడు చెయ్యవద్దు } దీనివల్ల ప్రజలు ప్రశాంతముగా ధర్మ తత్పరులై అభివృద్ధి పథంలో డూ ఆర్ డై అని దూసుకు సాగిపోతారు అని స్వామిజి వారిని వారి పిల్లలను ఆశీర్వదించి , పిల్లలకు " పెద్దలు

మీ మంచికే , మీ అభివృద్ధికే సరియైన మార్గదర్శనం చేస్తారు కాబట్టి ఉపాధ్యాయులు , తల్లిదండ్రులు చెప్పిన మంచి సూచనలను తప్పక పాటించి ఉన్నతులవ్వండి. అని చెప్పారు. అంతటి తో వారు అక్కడి నుండి వారి వారి ఇళ్లకు వెళ్లిపోయారు. ఆ తర్వాత రోజురోజుకూ వారి ప్రవర్తనలో మార్పు రా సాగింది. రాము చెడు చెప్పడం మానేసి ఉపాధ్యాయులు చెప్పేది సమీక్షించి అది ఎంతవరకు సరియైనది అని ఆలోచించి ఎవరికీ కువిమర్శలను చెయ్యకుండా , అందరికి తలలో నాల్కలా సౌమ్య, మృదు భాషి గా మారి అభివృద్ధి పథం లో పయనించసాగాడు. అలాగే రవి తన ప్రవర్తనలో కూడామంచి మార్పును క్రమంగా తెచ్చుకున్నాడు. ఆటను చెడు , పోర్న్ ఫిలిం లను చూడడం మానేసి ఇంటర్నెట్ లో తన చదువుకు సంబంధించిన నోట్స్ ను అవసరమైన సమాచారాన్ని సమీకరించుకుని పరీక్షలలో, కంపిటీషన్స్ లో ఆన్- లైన్ టెస్ట్ లలో పాల్గొని విజ్ఞాన వంతుడైనాడు. అంతేకాకుండా జీవితం లో అభివృద్ధి పథం లో పయనించసాగాడు. ఇక రమ్య తన తల్లిదండ్రుల ప్రవర్తనలలో మార్పును గమనించి , అక్కడి మాటలు ఇక్కడ - ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం , తోటి పిల్లలను తిట్టడం , ఉపాధ్యాయులను విమర్శించడం మానుకుంది. అంతేకాకుండా ఆమె అందరితో స్నేహంగా మెలగడం తో అందరి సహాయ సహకారాలతో వక్తృత్వO లాంటి పోటీలలో పాల్గొని మంచి వక్త గా పేరును సంపాదించుకుంది . ఇక శ్రావణి తండ్రి చేసిన పనులను చెడ గొట్టకుండా అతనికి సహకరించి అందులో ప్రావీణ్యము సంపాదించుకుని దానిని తన పాఠశాలలో అమలు పరచి కొన్ని ప్రత్యేకమైన యంత్రములను, గాడ్జెట్స్ ని వాటి పనితీరుని మెరుగుపరచి దైనందిన జీవితంలో ఉపయోగపడే అద్భుతవస్తువులను ఆవిష్కరించి పేరు ప్రఖ్యాతులను పెంపొందించుకుంది. ఈ విధంగా ఆ నలుగురు విద్యార్థులు వెనుకటి జీవితంలోకి జారీ పోకుండా తగిన జాగ్రత్తలను తీసుకుని పెక్కుమంది విద్యార్థులకు ఆదర్శప్రాయులుగా ఉండిపోయారు . దానిని చూసి తరగతి ఉపాధ్యాయుడు , ప్రధానోపాధ్యాయుడు , మనస్తత్వవేత్త, తల్లిదండ్రులు ,స్వామిజి , ఇతర పాఠశాల సిబ్బంది , తోటి పిల్లలు చాలా ఆనందించారు .

ఈ విధంగా గాంధీజీ మార్గాన్ని ఆచరించి ఇతరులకు ఆదర్శ ప్రాయం గా నిలిచారు.

శుభం భూయాత్ - సర్వ్ జనాః సుఖినో భవన్తు .



Rate this content
Log in