Read a tale of endurance, will & a daring fight against Covid. Click here for "The Stalwarts" by Soni Shalini.
Read a tale of endurance, will & a daring fight against Covid. Click here for "The Stalwarts" by Soni Shalini.

Dawath Sainath

Drama Tragedy Fantasy

3.4  

Dawath Sainath

Drama Tragedy Fantasy

నా ప్రేమ….

నా ప్రేమ….

4 mins
829ప్రేమించడం ఎవరైనా ప్రేమిస్తారు కానీ అ ప్రేమ ని వ్యక్తం చేయడం లో విఫలం అవుతుంటారు ఆలా తన ప్రేమని వ్యక్తం చేయలేక పోయిన వ్యక్తి కధే నా ప్రేమ.


ఈ కథ నా కథ గ చెప్తున్నాను.

 

నా పేరు సూర్య. మాది ఒక చిన్న కుటుంబం అమ్మ,నాన్న,అక్క,నేను. నాన్న ఒక ప్రైవేట్ కంపెనీ లో వర్కర్, అమ్మ ఇంట్లో నే ఉంటుంది. 

 

అక్క డిగ్రీ పూర్తి చేసి ఒక ఫైనాన్స్ ఆఫీస్ లో అకౌంటెంట్ గ పని చేస్తుంది. మా అక్క ఆఫీస్ వాళ్ళు పదోవ వార్షికోత్సవం సందర్బంగా ఒక పార్టీ ఏర్పాటు చేసారు ఆ పార్టీ కి మా అక్క కూడా వేలింది అక్కడ మా అక్క కి అరుణ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు మా అక్క నచ్చడం తో అరుణ్ ఏమి ఆలోచించకుండా పెళ్లి సంబంధం మాట్లాడానికి వాళ్ళ అమ్మ నాన్నలతోమా ఇంటికి ఒచ్చారు. 

 

మా కుటుంబనికి అరుణ్ కుటుంబం నచ్చడం తో పెళ్లి ఖాయం చేసారు పెద్దవాళ్ళు. వచ్చే సంవత్సరంలో పెళ్లి ముహూర్తం పెట్టుకుందాం అని అన్నారు అప్పటివరకు నా ఇంటర్ పరీక్షలు కూడా ఐపొతాయి నాన్న కి తోడుగా పెళ్లి పనులు చూసుకోవచ్చు అని అనుకున్నను. 

 

చూస్తూ ఉండగేనే అక్క పెళ్లి తేదీ వచేసింది. పెళ్లికి కి అందరు ఒచ్చారు చాల బాగా జరిగింది పెళ్లి అప్పుడే తనని చూసాను తన పేరు కోమలి. 

 

కోమలి చాల అందగా ఉంటుంది తను అరుణ్ వాళ్ళ సైడ్ నుంచి వచ్చినా అమ్మాయి అనుకున్న కానీ తను మా అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బంధువు . మా అక్క ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి సమ్మర్ హాలిడేస్ కి ఒచ్చింది . 

 

మా అక్క ఫ్రెండ్ తో నేను మాట్లాడి కోమలి వివరాలు తీసుకున్న . కోమలి కూడా ఇంటర్ పూర్తి చేసి emcet పరీక్షలు రాయడం కోసం చూస్తుంది.

 

హాలిడేస్ అని మా అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఒచ్చింది. కోమలి బెంగుళూరు లో ఉంటుంది. కోమలి నీ చూసిన వెంటనే అనిపించింది తను నా కోసమే పుట్టింది అని. 

మా అక్క వాళ్ళ ఫ్రెండ్ కోమలి గురించి చెప్తూ ఉండగానే నా మైండ్ లో ఒకటే రన్ అవుతుంది ఎంసెట్ లో మంచి రాంక్ కొట్టాలి బెంగుళూరు లో ఇంజనీరింగ్ చేయాలి అంతే.

 

అక్క పెళ్లి సంతోషంగా ఏ ఇబంది లేకుండా ప్రశాంతంగా జరిగింది. నేను ఎంసెట్ రాసాను అనుకున్నటుగానే మంచి రాంక్ ఒచ్చింది. నాన్న కి చెప్పా బెంగుళూరు లో చదువుకుంటాను అని నాన్న సరే అని చెప్పారు .

 

మా అక్క వాళ్ళ ఫ్రెండ్ ని కలిసి కోమలి ఉంటున్న అడ్రస్ తీసుకొని తను ఏ కాలేజీ లో చేరిందో తెలుసుకొని అదే కాలేజీ లో సీట్ కోసం ట్రై చేశా కానీ దురదృష్టం కాలేజీ లో సీట్ దొరకలేదు. 

 

సరే అనుకోని వేరే కాలేజీ లో చేరాను, కానీ నేను కోమలి వాళ్ళు ఉంటున్న ఇంటి దగ్గర నా రూమ్ తీసుకున్నాను. మొదట్లో తనతో మాట్లాడానికి చాల ప్రయతించాను కానీ ధైర్యం సరిపోలేదు తనతో మాట్లాడానికి.

కాలేజీ లో ఫస్ట్ డే అంత గందరగోళంగ అనిపించింది ఒక్కసరిగా హ్యాపీ డేస్ మూవీ సీన్లు అన్ని నా కాళ్ళ ముందు కనిపించాయి. మెల్లి మెల్లిగా కాలేజీ వాతావరణం , కొత్త ఊరు అంత అలవాటు ఐయ్యింది. 

చూస్తూ ఉండగానే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఒచ్చేసాయ్. ఈ ఒక్క సంవత్సరంలో కోమలి ని 4 ,5 సార్లు చూసాను అంతే. వాళ్ళ కుటుంబం లో పట్టింపులు ఎక్కువ చాల స్ట్రిక్ట్ రేసుగుర్రం లో ప్రకాష్ రాజ్ ఫ్యామిలి లాగా, ఎప్పుడు ఇంటి లోపలే ఉంటారు ఏదయినా కావాలి అంటే పని వాళ్ళు తెస్తారు. 

 

నా ఫస్ట్ ఇయర్ ఎక్సమ్ ఐపోయాయి ఇంటికీ ఒచ్చేసాను రెండు నెలలు తర్వాత బెంగుళూరు కి వెళ్ళాను. కాలేజీ 2nd ఇయర్ ,కాలేజీ 3rd ఇయర్ ఇలా 3 సంవత్సరాలు గడిచిపోయింది.

 

కానీ ఈ 3 సంవత్సరాలలో కోమలి గట్టిగ ఒక 20 సార్లు చూసి ఉంటాను. మా అక్క ఫ్రెండ్ ని అడిగి కోమలి Facebook Id కానీ ఫోన్ నెంబర్ కానీ అడిగి తీసుకుందాం అని అనుకున్నను కానీ అ ఆలోచన నాకు నచ్చలేదు వేరే ఏదయినా చేస్తే సహాయం తీసుకోవాచు కానీ ప్రేమ లో కష్టం,ఇష్టం మొత్తం ప్రేమించే వాళ్లదే ఉండాలి అని నెంబర్ తీసుకోలే.

 

కానీ ఇప్పుడు నేను 4th ఇయర్ ఇది నా ఇంజనీరింగ్ చివరి సంవత్సరం ఇప్పుడు నా ప్రేమ ని కోమలి కి చెప్పక్కపోతే ఇక ఎప్పటికీ చెప్పలేను అనే ఒక చిన్న భయం. ధైర్యం చేసి కోమలి ఇంటికి వెళదాం అని , కోమలి వాళ్ళ ఇంటి గేటు దగ్గర ఇంటి లోపలికీ వెళదామా వద్ద అని అక్కడే నిలబడి ఆలోచిస్తూ ఉన్న అప్పుడే తను ఒచ్చింది దేవత లాగా ఎవరు అని అనుకుంటున్నారా మా అక్క ఫ్రెండ్ కోమలి వాళ్ళ ఇంటికి ఒచ్చింది. 

 

మా అక్క ఫ్రెండ్ ని చూసాక నాకు ఇంకా ధైర్యం ఒచ్చింది నేరుగా మా అక్క ఫ్రెండ్ దగరికి వేళ్ళ మాట్లాడాను కోమలి వాళ్ళ ఇంట్లో కి వెళ్లి పోయాను. అప్పుడు అనిపించింది అక్క నువ్వు ఇన్ని రోజులు ఎందుకు రాలేదా అని. అక్క ఫ్రెండ్ తో కలిసి కోమలి వాళ్ళ ఇంట్లో అడుగుపెడుతున్న ,గేట్ దగ్గర ఒకటి కాదు రెండు కాదు మూడు కార్లు ఒచ్చి ఆగాయి. 

 

ఎవరు బంధువులు అని అనుకున్న వాళ్ళ చేతిలో పువ్వులు, పండ్లు, స్వీట్స్ , ఉన్నాయి సరే కానీ అని లోపలి వెళ్ళాను కోమలి కోసం వెతికా కబడలేదు.

 

మా అక్క ఫ్రెండ్ దగరికి వేళ్ళను కోమలి ని చూపించు అని అడుగుదాం అని కానీ మా అక్క ఫ్రెండ్ ఒక shocking సమాచారం చెపింది అది ఏమిటి అంటే ఈరోజు కోమలి కి పెళ్లి చూపులు అని, కోమలి ని చూసుకోవడానికి బెంగుళూరు ఓచ్చము అని పెళ్ళికొడుకు నా తమ్ముడు అని చెప్పింది.కోమలి ఇంజనీరింగ్ ఐపోయాక పెళ్లి అని చెపింది.

 

మనం ప్రేమించిన విషయం ప్రేమించిన వారికీ ఎంత త్వరగా వ్యక్తం చేస్తే అంత మంచిది . నేను కోమలి ని ప్రేమించిన విషయం నాకు, చదువుతున్న మీకు తప్ప ఇంకా ఎవరికీ తెలియదు. 

 

సో ప్రియమైన ప్రేమికులారా మీ ప్రేమ ని వ్యక్తం చేయండి. నా లాగా సోలోగ మీ లోపలే దాచుకొని మీ ప్రేమ ని వృధా చేయకండి. ఏదయినా మనం ప్రేమించే వాళ్ళు సంతోషం మనకు ముఖ్యం.

 

నా చదువు పూర్తి చేశాను మంచి జాబ్ ఒచ్చింది . కానీ కోమలి ఫై ఉన్న ప్రేమ ముగిసిపోనిది. జీవితం లో స్వచమైయినా ప్రేమ ఒక్కసారే కలుగుతుంది ఫస్ట్ లవ్ అంత ఈజీ గ పోదు.

 

ప్రేమ ని వ్యక్తం చేయక పోతే విఫలం అవుతుంది. సో ప్రేమ ని వ్యక్తం చేయండి ఎదుటివారికి నచ్చితే ఓకే కానీ నచకపోతే వాళ్ళ సంతోషాన్ని కోరుకోండి.


Rate this content
Log in

More telugu story from Dawath Sainath

Similar telugu story from Drama