Anjani Gayathri

Inspirational Others

4.5  

Anjani Gayathri

Inspirational Others

🌹నా హృదయంలో నిదురించే చెలి 🌹

🌹నా హృదయంలో నిదురించే చెలి 🌹

3 mins
271


🌹 నాహృదయంలో నిదురించే చెలి 🌹

రచన :-అంజనీగాయత్రి.


" నా హృదయంలో నిదురించే చెలి , కలలలోనే కవ్వించే సఖి.... వయ్యారి వై...." అని పాత సినిమా పాట పాడుతూ బైక్ తుడుచుకుంటున్నాడు సుందరం.


 పక్కింటి పద్మ , నీళ్లు పట్టుకుందామని కుళాయి దగ్గరికి వచ్చింది . అతడి పాట విని మనసులో నవ్వుకుంటోంది . పైకి గట్టిగా నవ్వకపోయినా , నవ్వుతో కూడిన ఆమె మోము చూసి , పాడుతున్న పాట ఆపేసాడు .


 సుందరం మరియు పద్మవాళ్ళఇళ్ల వాటాలు పక్కపక్కనే కావడం మూలంగా, గట్టిగా మాట్లాడుకుంటే , ఒకరి మాటలు మరొకరిఇంట్లోకి వినిపిస్తాయి. ఇద్దరూ, అద్దెఇళ్లకోసం వచ్చి ఆ ఇళ్లలో ఉంటున్నవాళ్లే. ఇంటి ఓనర్ ఇంకో ఊర్లో ఉంటారు . అందుకే వీళ్ళు స్వేచ్ఛగా , ఆ ఇళ్లలో ఉంటూ సొంత ఇళ్ళులా వాడుకుంటున్నారు .


 సుందరం ఇంట్లో తల్లి మరియు తమ్ముడు తో సుందరం ఉంటాడు. తండ్రి గతంలో చనిపోయాడు.


 పద్మ వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు, పద్మ మరియు వాళ్ళ అన్నయ్య ఉంటారు .


 సుందరానికి పాటలు పాడుతూ పని చేసుకోవడం అలవాటు . పద్మ ఎప్పుడైనా అతని పాటలు వింటుంటే , "పాటలంటే ఇంట్రెస్ట్ ఏమో?బానే పాడుతున్నాడు, "అని మనసులో అనుకొని , ఒకరోజు ఉండబట్టలేక , పాటపాడుకుంటూ బైక్ తుడుచుకుంటూఉన్న అతనిని, " పాటలు బానే పాడుతున్నారు మీరు , పాడుతా తీయగా లాంటి సంగీత ప్రోగ్రామ్స్ లాంటివి, వేటికి అయినా వెళ్లొచ్చు కదా?? " అని అడిగేసింది.


" నాకు అంత సీన్ లేదండి , సంగీతం రాదు , ఏదో సినిమాలో పాటలు విని సరదాగా పాడుతూ ఉంటాను, " అని తడబడుతూ చెప్పి తన పనిలో నిమగ్నమయ్యాడు. మనసులో మాత్రం నిజంగా పొగిడిందా?? లేక వెటకారంగా ఆ మాటలు అందా?? అనే అనుమానం మాత్రం అతని మనసును వీడిపోలేదు .


 ఆమె నిజంగానే బాగా పాడాడని, ప్రోత్సహించాలనే ఉద్దేశంతోటే అనడం వలన , అతను అన్నమాటకు ఆమె మళ్లీ కల్పించుకుని , " పాటలు పాడాలంటే సంగీతం నేర్చుకోనక్కర్లేదు . పాడాలనే ఉత్సాహం , ఉండి , విన్నపాటను విన్నట్లుగా పాడటం అనేది అరుదైన విషయం. మీలో ఆ టాలెంట్ ఉంది , " అని చెబుతూ తన సెల్ తీసుకుని , అతనిని అతనికి నచ్చిన పాట పాడమని, సెల్ లో వీడియోగా తీసింది. ఆ పాటని యూట్యూబ్ లో పెట్టింది.


 యూట్యూబ్లో పాట చూసిన వారందరూ ఎంతో బాగా పాడారని కామెంట్లు, లైకులు పెడుతూ తమ ప్రోత్సాహం అందించారు.


 మంచి కామెంట్లు, లైక్ లు వచ్చాక ఆ వీడియో తీసుకొచ్చి అతనికి చూపించింది . అవి చూసి,అతను ఆశ్చర్యపోయి , తనలో అంత టాలెంట్ ఉందా?? అని, తన టాలెంట్ ను ఆమె గుర్తించినందుకు మరియు ప్రోత్సహిస్తున్నందుకు సంతోషంగా ఉంది సుందరానికి . "మీ ప్రోత్సాహానికి చాలా చాలా థాంక్స్ అండి , " అని సంతోషంగా చెబుతూ ఆ వీడియో తల్లికి చూపించాడు. తల్లి చాలా సంతోషపడింది . పద్మని వీడియో తీసి పెట్టినందుకు అభినందించి కృతజ్ఞతలు తెలుపుకుంది .


 పద్మ ఇచ్చిన ప్రోత్సాహంతో ధైర్యంగా ఇంకా ఇంకా మంచిగా పాడుతూ , యూట్యూబర్ గా మారి తాను కూడా మంచి సెల్ కొని , సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి , మంచి గాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు.


 యూట్యూబర్ గా పాటలు పాడుతూనే పెద్ద పెద్ద సంగీత ప్రోగ్రామ్స్ కి వెళ్లి ఎన్నో బహుమతులు పొందాడు. తాను గాయకుడుగా స్థిరపడడానికి కారణమైన పద్మని మాత్రం అతడు జీవితాంతం మర్చిపోలేదు .


 ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలియగానే , తల్లి చేత పద్మ వాళ్ళ తల్లిదండ్రులని అడిగించాడు , " మా అబ్బాయి సుందరానికి మీ పద్మ నిచ్చి పెళ్లి చేస్తారా?? అన్నయ్యగారు, అంటూ అడుగుతూనే , వదిన గారు!అమ్మాయిని ఎక్కడికో దూరంగా పంపేకంటే మా అబ్బాయికి ఇస్తే కళ్ళ ముందు ఉంటుంది , " అంటూ ఇద్దరినీ అడిగింది.


 పద్మ తల్లిదండ్రులు కాసేపు ఆలోచించుకుని మాకు మీ అబ్బాయిని అల్లుడుగా చేసుకోవడం ఇష్టమే కానీ పద్మనడిగి ఏ విషయం తర్వాత చెప్తాము , తాను కూడా ఇష్టపడితే మాకు ఏ అభ్యంతరం లేదని చెప్పారు.


 పెళ్లి విషయం పద్మనడిగితే సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయింది. అతను అంటే ఆమెకు ఇష్టమని తెలిసాక మంచి సమయంలోపెళ్లి ముహూర్తాలు పెట్టించి , అంగరంగ వైభవంగా వివాహం చేశారు ఆ ఇద్దరికీ.


      🌹🌹🌹🌹🌹


Rate this content
Log in

Similar telugu story from Inspirational