Challa Sri Gouri

Tragedy Inspirational Children

4.8  

Challa Sri Gouri

Tragedy Inspirational Children

మంచి ఆలోచన

మంచి ఆలోచన

1 min
478


 రాము, సోము ఇద్దరు అన్నదమ్ములు. వారు పప్పి అనే కుక్కపిల్లను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. వారి వార్షిక పరీక్షలు పూర్తి అయిపోయాయి. ఇంట్లో ఇద్దరికీ ఏమీ తోచటం లేదు. అప్పుడు రాముకు ఒక ఆలోచన తట్టింది. తమ వీధి చివర ఉండే రామయ్య అనే తాతయ్య గారి దగ్గరకు వెళ్లాలి అనుకున్నారు. ఆ రామయ్య గారికి ఎవరూ లేరు. ఆయన భార్య రెండు సంవత్సరాల క్రితమే కాలం చేశారు. పిల్లలు విదేశాల్లో ఉంటున్నారు. ఆయన ఒంటరి పక్షిలా బాధపడుతూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇక రాము, సోము కలిసి రామయ్య గారి దగ్గరకు వెళ్లారు. ఆయన హెడ్మాస్టర్ గా పని చేసి పదవీ విరమణ పొందారు. ఇద్దరూ ఆ తాతగారి నుంచి ఎన్నో మంచి విషయాలను తెలుసుకున్నారు. వీళ్ళిద్దరూ దానికి కృతజ్ఞతగా తాత గారి బాధను విస్మరింపజేసి, వారిని ఆనంద పరచాలి అనుకున్నారు. అందుకని ఆ తాతగారిని బతిమిలాడి క్రికెట్ ఆడటానికి ఒప్పించారు. వీరంతా కలిసి ఆరు బయట క్రికెట్ ఆడుతుండగా బంతి ఎదురుగా ఉన్న కాంతమ్మ గారి ఇంటి కిటికీ కి వెళ్ళి తగిలింది. దానితో అదంతా గమనిస్తూ ఉన్నా

 కాంతమ్మ గారు ఆగ్రహంతో కేకలు వేశారు. అప్పుడు ఆ ఇంటికి కొంచెం దూరంలో ఉన్న చెట్టు మీద ఒక కోతి కూర్చుని ఉంది. కాంతమ్మ గారు వీళ్ళని కోపడుతున్న సమయంలో ఆ కోతి చటుక్కున వచ్చి ఆ బంతిని తీసుకొని పోయింది. ఆ తరువాత కాంతమ్మ గారు ఆగ్రహాన్ని అదుపు చేసుకుని లోపలికి వెళ్ళిపోయారు. కోతి ఆ బంతిని ఏం చేసింది? ఆ బంతిని పప్పి కి తెచ్చి ఇచేసింది. ఇదంతా చూస్తూ ఉన్న తాతగారికి తన బాల్యం గుర్తుకు వచ్చి ఆ రోజంతా ప్రశాంతంగా, ఆనందంగా ఉన్నారు. అప్పటి నుంచి సెలవులు వచ్చినప్పుడల్లా ఆ తాత గారి దగ్గరకు వెళ్లి మంచి విషయాలను తెలుసుకోవడంతో పాటు ఆయన బాధను మరిచిపోయేలా చేశారు. ఆయన ఆ రోజు నుంచి తన మనవడిని వీళ్ళిద్దరిలో చూసుకుని ఎంతో ఆనందంగా ఉండటం ప్రారంభించారు. 


Rate this content
Log in

Similar telugu story from Tragedy