Challa Sri Gouri

Abstract Children Stories Inspirational

4.6  

Challa Sri Gouri

Abstract Children Stories Inspirational

మంచి స్వభావం

మంచి స్వభావం

1 min
418


రామాపురం అనే ఊరిలో రఘు అనే ఓ మంచి అబ్బాయి ఉండేవాడు. ఊరందరి తో చక్కగా మాట్లాడుతూ, అందరికీ సహాయం చేస్తూ ఎప్పుడూ అందరి ప్రశంసలు పొందే వాడు. ఇది చూసి రఘు వాళ్ళ అమ్మ, నాన్న ఎంతో ఆనందిస్తూ ఉండేవారు. ఇలా అందరూ అతన్ని పొగడడం చూసి రవి,రాజు కి చాలా కోపం వచ్చేది. ఎలా అయినాసరే రఘు కు ఉన్న మంచి పేరును పోగొట్టాలని నిర్ణయించుకున్నారు. మంచి మాటలు చెబుతూ రఘుకి మెల్లగా దగ్గర అవ్వటం మొదలు పెట్టారు. ఒక రోజు రవి రఘు వద్దకు వచ్చి "రఘు మన రాజును ఎవరో బాగా కొడుతున్నారు పద అంటూ" రఘును తన వెంట తీసుకెళ్లాడు. ఎలాగైనా సరే రఘును గొడవ పడేలా చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ రఘు తన మంచి మాటలతో, క్షమాపణ చెప్పి గొడవ ఆగిపోయేలా చేశాడు. తమ ఉపాయం పనిచేయలేదని రాజు, రవి ఇద్దరూ బాధపడ్డారు. ఎలాగైనా సరే తాము అనుకున్నది చేసి తీరాలని ఇదేవిధంగా రోజుకొ ఉపాయంతో ముందుకొచ్చారు. కానీ రఘు ఏ మాత్రం తప్పు అడుగు వేయకుండా అన్ని సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటూ తన మంచితనంతో ఇంకా గొప్ప పేరును తెచ్చుకుంటూ ఉన్నాడు. అన్ని ప్రయత్నాలు చేసి అలిసిపోయిన రాజు, రవి తమ చెడు బుద్ధికి సిగ్గుపడుతూ క్షమాపణలు చెప్పారు. రఘు తనకి ఇదంతా ముందే తెలుసు అని చెప్పడంతో రఘు యొక్క మంచితనానికి వారు కూడా తనను ఇష్టపడడం మొదలుపెట్టారు. 


 నీతి: మంచి మనసు మంచి ఆలోచనలు ఉన్న వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మంచి స్వభావం కలవారికి మంచి స్వభావం కలవారికి చెడు ఆలోచనలు పోగొట్టే గొప్ప శక్తి ఉంటుంది. 


Rate this content
Log in

Similar telugu story from Abstract