Pallavi S Suma

Abstract Drama Romance

3.4  

Pallavi S Suma

Abstract Drama Romance

మిస్డ్ కాల్

మిస్డ్ కాల్

2 mins
202


న్యూస్ పేపర్ అంటూ పేపర్ బాయ్ ప్రశాంత్ ఉన్న కాలోని లో పేపర్ని ప్రతి ఇంటికి వేస్తూ ఉంటాడు, సూర్యుడు ఉదయమిస్తూ భువిని వెలుగులో ప్రకాశిస్తున్నాడు, పక్షుల ఇంపైన శబ్దం ఉదయాన్ని మరింత అందంగా చేస్తున్నది, ప్రశాంత్ వారి అమ్మ 5 గంటలకు లేచి కొడుకు ఇంటర్వ్యు మంచిగా కావాలని పూజ చేస్తూ ఉంటుంది, నాన్న బ్యాంక్ మ్యానేజర్.. ఆఫీస్ కు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు, చెల్లెలు అన్నయ్య కోసం తన బట్టలను ఐరన్ చేసి టిఫిన్ తయ్యారు చేసి అన్నయ్యను లేపడానికి వెళుతుంది.


       నిద్రలోకం నుంచి విరామం పొందడానికి మనసు రానంతగ వీచే చల్లటి గాలి, పక్షుల మధుర స్వరం, అమ్మ పూజ చేస్తున్న గంటల శబ్దం పేపర్ బాయ్ శబ్దం, తన ఫోన్ మోగుతున్న శబ్దం, చెల్లెలు "అన్నయ్య లే ఇంటర్వ్యు కు టైం అవుతుంది" అని నిద్ర లేపుతున్న శబ్దం, ఇవేవీ తన చెవిన పడనంత గాఢంగా ప్రశాంత్ నిద్రపోతున్నాడు.


       గాఢమైన నిద్రలో ఉన్న ప్రశాంత్ ను మెల్లగా కలల లోకం కమ్ముకుంటుంది, ఆ కలల లోకం లో దేవకన్యే లాంటి అమ్మాయి, నెమలి లాంటి కళ్ళు, చందనం లాంటి ఆమె శరీరం, కేంగులాబీ కూడా సరితూగని ఎర్రటి పెదాలు, అందమే అసూయ పడేంత తన అందం, పాలులాంటి రంగు, తన అందాన్ని మరింత పెంచుతున్న కాటుకకన్నా నల్లటి కురులు, కోకిల లాంటి తన మధుర స్వరం, ఈ దేవకన్యే (తులసి) ప్రశాంత్ చేయి పట్టుకుని సాగుతూ ఉంటుంది.


       సాగుతున్న ఆ ప్రయాణాన్ని ఆపి ఒక్కసారిగ ఆ దేవకన్యే(తులసి) కళ్లలోకి ప్రశాంత్ చూస్తూ  

"*తొలి చూపులోనే ప్రేమలోకి లాగిన ఓ ప్రేయసి* "

*గంధర్వ గానాలు వెల్లువెత్తేనే నిను చూసి* 

*ఏ వైపుగా అడుగేయలేకపోతున్నను నిను చూసి*

*మై మరచిపోతున్నాను మళ్ళీ మళ్ళీ నిను తలచి*

*నేను ఉన్నానని మరచిపోతున్నాను నిను చూసి*

*ప్రేమించే నాకై ఏడడుగులు వేస్తావా నాతో కలిసి* అని అంటాడు.


       ప్రశాంత్ నోటి వెంట స్వచ్చమయిన ప్రేమతో నిండిన మాటలను విన్న తులసి ఇలా అంటుంది

"మీ జీవితపు ప్రేమను మీరు కలుసుకున్నప్పుడు మరి నేను మాత్రం కలవకుండా ఉంటాన నాలో నిన్ను దాచుకుని నీలో నన్ను నేను వెతుకుతుంటాను" అని ప్రేమగా ప్రశాంత్ కళ్ళలోకి చూస్తూ చెబుతుంది. ఇలా ఒకరినొకరు చూసుకుంటూ అలా ప్రేమ లోకంలోకి కొద్దిసేపు జారిపోతారు. ఇలా ఉండగా తులసి" మళ్ళీ రేపు కలుద్దాం అని అంటూ ప్రేమను దారపోస్తు ఉంటుంది.


       అలా ప్రేమ లోకంలో ప్రశాంత్ ఉండగా మెల్లగా తులసి మాయమవుతుంది ఇంతలో మెలుకువొచి ప్రశాంత్ చుట్టూ చూస్తూ కల అనే భ్రమతో ఇంతసేపు ఉన్నానని గ్రహిస్తాడు. అప్పటికే ఆరు సార్లు తనకు మిస్సేడ్ కాల్ రాగ 7వ సారి మళ్ళీ కాల్ రావడం చూసి కాల్ అటెండ్ చేసెలోపు కాల్ కట్ అవుతుంది, ఆ నంబర్ కు మళ్ళీ కాల్ చేస్తాడు ప్రశాంత్.


       కాల్ చేసి ఎవరు అని అడిగినప్పుడు ఒక అమ్మాయి మాట్లాడుతుంది. " హలో అండి నా పేరు తులసి నిన్న మీరు గుడిలో ఒక ముసలావిడనీ చేరదీయడం నేను చూసాను నాకు చాల సంతోషం అయ్యిందండి అందుకే మి ఆచూకీ తెలుసుకుని కాల్ చేసాను. నిన్న మిమ్మల్ని చూసినప్పటినుంచి కలలో, మెలుకువలో కూడా మీరు నాతో ఉన్నట్లు మనం ప్రేమించుకున్నట్లు అనిపించింది "నా గుడిగంటలు మూగాయి నా జీవితపు ప్రేమని నేను కలుసుకున్నాను నన్ను నేను మరిచిపోయి నాలో మిమ్మల్ని చూస్తున్నాను మీలో నన్ను వేతకాలని ఆశగా వుందండి. I లవ్ యు" ఇది విన్న ప్రశాంత్ ఒక్కసారిగ అలా వుండిపోయాడు..... ఎగిరి గంతులేస్తూ దేవుని దగ్గరికి వెళ్లి "కలని నిజం చేసి నా జీవితాన్ని ప్రేమమయం లోకి ఒక missed call వల్ల నా జీవిత గమ్యాన్ని చేరేలా చేసావు దేవుడా నీ మహిమ అంతు చిక్కనిది అంటూ" తన ప్రేయసికి ఓకే చెబుతాడు. అలా తన ఇంటి వాతావరణం మరియు ఈ కథ సంతోషంగా ముగిసింది


Rate this content
Log in

Similar telugu story from Abstract