Pallavi S Suma

Drama Tragedy Others

4  

Pallavi S Suma

Drama Tragedy Others

కోమలి

కోమలి

5 mins
422


సీతపురం అన్న ఒక ఊరిలో వీరయ్య మరియు కళావతి దంపతులకు కోమలి అన్న ఒక కుమార్తె పుట్టింది పెళ్ళై 12 ఏళ్ల అయిన పిల్లలు లేకపోవడం తో కళావతి నీ ఊరిలో అందరూ గోడ్డరాలు అని బాధ పెట్టేవారు. ఈ ఒక్క బాధ తప్ప పేదవాళైనా ఇంటి పాచి పని చేసుకుంటూ కళావతి, టీ కొట్టు పెట్టుకుని వీరయ్య సంతోషంగానే ఉండేవారు. కోమలి పుట్టాక వీళ్ళ కష్టాలు, పేదరికం కొద్దిగా కోరుకుంది. వీరయ్య ఇంటి పక్కనే తార అన్న ఒక అమ్మాయి ఉండేది. వ్యభిచారం చేస్తుందని ఊరివాళందరు తనతో మాట్లాడ్డం కానీ, సహాయం చేయడం కానీ చేసేవాళ్ళు కారు. కాని వీరయ్య మరియు తన కుటుంబం తార కు ఏ కష్టం వచ్చిన ఆదుకునే వారు ఎందుకంటే తార భర్త తాగుబోతు సంపాదన లేకుండ భార్యకు మత్తు మందు ఇచ్చి మగాళ్లను పంపించేవారు అల వచ్చిన డబ్బులతో బాగా తాగి తందనాలాడేవారు. ఒక రోజు మత్తు మందు ఇచ్చి తారాతో ఇలాంటి పని చేయిస్తున్న విషయం తార గ్రహించింది. దీన్ని ఆపాలని చాల రకాలుగా ప్రయత్నించిన లాభం లేకపోయింది. తార కూతురు లక్ష్మిని ను కూడా 50,000 రూపాయలకు వేరొక్క దేశానికి అమ్మేసాడు, ఈ విషయం తెలిసిన తార ఊరంత తన బిడ్డను వెతికింది, వారం రోజుల తరువాత తారకు నిజం తెలిసి భర్తను నిలదీసి ప్రశ్నించింది అప్పుడు భర్త నిజం చెప్పి " నువ్వు కూడ వ్యభిచారం చేసి డబ్బు సంపాదించకపోతే నీ కూతురి దగ్గరికి వెళ్లిపోతావ్ " అని బెదిరించి కొట్టి హింసించాడు. తార నమ్మిన నాగరాళ్ల దేవుని దగ్గరికి వెళ్లి గట్టిగ ఎడ్చింది ఆ రోజంతా అక్కడే ఉంది. తెల్లారగానే తార ఇంటికి వచ్చింది అప్పుడు తన భర్త నేలమీద పడిపోయుంటారు ఇది చూసిన తార భయంగా హాస్పిటల్ కు తీసుకెళ్ళింది అక్కడ డాక్టర్ మి భర్తకు క్యాన్సర్ ఉంది ఒక ఏడాదికన్న ఎక్కువ బతికే అవకాశం లేదు కానీ విదేశం లో ఒక కొత్త టెక్నాలజీ వుంది మి భర్తను బతికించుకునే అవకాశం ఉంది కాకపోతే ఎక్కువ ఖర్చు అవుతుంది అని చెబుతుంది ఇది విన్న తార తన భర్తను బ్రతికించుకోవడానికి చాల చోట్ల పని కోసం వెతికింది అప్పటికే వ్యభిచారి అనీ ముద్ర వేసిన సితాపురం తారకు పని ఇవ్వడానికి నిరాకరించింది చివరికి వేరే దారి లేక వ్యభిచారం చేస్తూ తన భర్తను ఎలాగైనా బతికించుకోవాలని బతుకుతూ ఉంటుంది. ఈ నిజం వీరయ్య కుటుంబానికి తెలుసు కాబట్టే వీరయ్య మరియు తన కుటుంబం ప్రతి నెల వారి సంపాదనలో 5000 తారకు ఇచ్చేవారు అలాగే అవసరమైనప్పుడు ఆదుకొనేవారు.


కోమలినీ చాల అరుదుగా చూసుకునేవారు. ఒక్క పూట భోజనం తింటూ కోమలికి 3 పూటలా అన్నం పెట్టె మంచి చదువు, బట్టలు ఇంకా కోమలి కోరికలన్నీ తీర్చేవారు. ఇలాగే రోజులు గడిచాయి కోమలికి 16 ఏళ్ల వయసొచ్చింది పెద్ద మనిషి కూడ అయ్యింది ఈ వేడుకను వీరయ్య అంగరంగ వైభవంగా జరిపారు.


కోమలి పదో తరగతిలో 99% తో పాస్ అయ్యింది. వీరయ్యకు చిన్నప్పటినుండి ఒక్కసారైనా విమానం ఎక్కి వెళ్ళాలి అన్న కోరిక ఉందని కళావతి తో కోమలి 3 ఏళ్ల వయసున్నప్పుడు చెప్పాడు. ఇది చాటుగా విన్న కోమలి తన నాన్నను ఎలాగైనా విమానం ఎక్కించాలని ఆశపడి, కష్టపడి చదివింది కానీ ఈ విషయం వీరయ్యకు తెలియదు.


పై చదువులకోసం అని కోమలి పట్నం వెళ్ళి అక్కడ చదువుకునేది, కోమలి అలాగే కష్టపడి డిగ్రీ చదువు పూర్తి చేసింది. ఇంకా పై చదువుల కోసం కోమలి వేరే పట్నం లో మంచి కాలేజ్ చూసి చదువుకోవాలని అనుకుంటూ హోస్తెలో లో ఉన్న తన ఫ్రండ్ తొ చెప్తూ పడుకుంటుంది. ఆ రోజు రాత్రి 1 గంట అయ్యింది కోమలి కి ఇంటినుండి ఫోన్ వచ్చింది. తన నాన్న హాస్పిటల్ లో ఉన్నారన్న సంగతి తెలుసుకుని కోమలి వెంటనే ఊరికి వచ్చింది. ఖంగారు పడుతూ డాక్టర్ ను విచారించగా నాన్నకు brain tumor ఉందని అది బాగా ముదిరి inka 45 రోజులకన్న ఎక్కువ కాలం బతికే అవకాశం లేదని తెలుసుకుంటుంది. కోమలి గుండె పగిలేలా ఏడుస్తుంది నాన్నను ఎలాగైనా బ్రతికించుకోవాలని కోమలి చాల ప్రయత్నిస్తుంది కానీ లాభం లేకపోయింది. ఏదైనా పని చేసి నాన్న విమానం ఎక్కాలనుకున్న కోరికని తీర్చాలని కోమలి అనుకుంటుంది. అమ్మతో నాన్నను జాగ్రత్తగా చుస్కోమని చెప్పి తార అక్క దగ్గర పట్నం వెళ్ళడానికి డబ్బులు తీస్కుని పని వెతుకుతూ పట్నం వెళ్ళింది. అక్కడ ఒక మంచి పేరున్న కంపెనీ లో పని దొరికింది కానీ పనికి చేరిన రెండో రోజు ఆ సంస్థ నిర్వాహకుడు కోమలిను ఒక ఫైల్ తీసుకుని తన గెస్ట్ హౌస్ కు తిస్కువెళ్తాడు. అక్కడ కోమలిని బలవంత చేయబోయాడు ఎంత బతిమాలినా కోమలిని వదలలేదు. ఏమి చేయాలి కోమాలోకి దిక్కు తోచక పక్కనే ఉన్న గాజు బొమ్మ తొ తలకు గట్టిగ కొట్టింది..... అలా కోమలి తప్పించుకుంది.


మరసటీ రోజు కోమలి వీలునామా పత్రం రాసి నిర్వాహకుడుకు ఇచ్చింది అప్పుడు కోపంతో " నువ్వు మళ్ళీ దిక్కు లేక నా దగ్గరికే వచ్చేలా చేస్తాను వేరే ఎక్కడా నీకు పని దొరకకుండా చేస్తాను " అని చెప్తాడు. 


కోమలి వేరే కంపెనీ లొ పని కోసం చాల చోట్ల వెతికింది కానీ ఇక్కడ పని దొరకదు పని వెతికి వెతికి అలిసిపోయిన కోమలి నిరాశగా ఇంటికి వచ్చింది అక్కడ నాన్న మంచం మీద ఉన్నాడు. తను బతకడానికి ఇంక కేవలం 25 రోజులు మాత్రమే ఉంది. సీతాపురంలోనే ఏదో ఒక పని చేసుకుందాం అనీ అనుకున్న ఎక్కడ పని దొరకలేదు ఎందుకంటే తను పని చేసిన పాత కంపెనీలో ఎదో తప్పు చేసింది అందుకే కంపెనీ వాళ్ళు రెండో రోజే తరిమేశారు పైగా వేరే కంపెనీ లో పని కూడ ఎవ్వరూ ఇవ్వట్లేదు అని ఊరివాళ్లు అనుకుని పని ఇవ్వలేదు.


ఇంత జరిగిన కానీ నిజం మాత్రం కోమలి ఎవ్వరికీ చెప్పలేదు. నాన్నను విమానం ఎక్కించాలి చాల కష్టపడింది తార కూడ సహాయం చేయలేకపోయింది ఎందుకంటే తన భర్తకు వైద్యం ఫలించక చనిపోయారు ఉన్న డబ్బు మొత్తం ఖాలీ అయిపోయింది తారకు వయసాయ్యిన కారణంతో ఏ మగాడు ఇప్పుడు రావట్లేదు బట్టలు కుడుతు బ్రతుకుతుంది కానీ అందులోనూ ఎక్కువ డబ్బులు రావట్లేదు.


కోమలి మరియు తన అమ్మ ఎంత ప్రయత్నించినా తన నాన్న కలని తీర్చలేకపోతున్నారు. కోమలి అమ్మ పాచి పని ముగించుకుని ఇంటికి వస్తుండగా పాము కాటుకు బలైపోయింది.


కోమలినీ ఆదుకునే వారు ఎవ్వరూ లేరు, అమ్మ ఇంటి పాచి పని చేసి డబ్బులు సంపాదించేది ఇప్పుడు అది కూడ లేదు. ఏం చేయాలో ఎటు వెళ్ళాలో ఎవరిని సహాయం అడగాలో తెలీదు, ఒక్క పూట భోజనానికి కూడా కష్టంగా ఉండేది. ఎన్ని రకాలుగా ప్రయత్నించిన కోమలికి పని దొరకలేదు ఎంతో ప్రయత్నించిన తరువాత టాయ్లెట్ క్లీన్ చేసే పని దొరికింది కానీ ఆ డబ్బు చాలదు, నాన్న చికిత్సకు కోసం కొమలి తన ఒక కిడ్నీ ను దానం చేసింది వచ్చిన డబ్బులు నాన్న మందులకు ఇంటి ఖర్చులకు సరిపోయింది. నాన్న విమానం కల ను తీర్చడానికి ఇంకా కష్టపడింది అల కష్ట పడుతూ పడుతూ కేవలం 10 రోజుల్లో 25000 సంపాదించింది. 


ఇదే సంతోషం తొ విమానం టికెట్స్ కౌంటర్ కి వెళ్లి తిరుపతికి టికెట్స్ అడిగింది ఒక్క టికెట్ వేల 12000 అని తెలుసుకున్న కోమలి మరసటి రోజు డబ్బు తీసుకుని టికెట్ కోసం వెళుతూ ఉండగా నలుగురు రౌడీ వెధవలు కోమాలో దగ్గర బడ్డులు దోచుకున్నారు అప్పుడు కోమాలో " మి కాళ్ళు పట్టుకుంటాను అన్న a డబ్బు మా నాన్న కోసం " అని చెప్పి ఎంత బ్రతిమలాడిన వినకుండా బడ్డుతో పారిపోయారు. అలా డబ్బులు పోగొట్టుకున్న కోమాలో నిరాశతో ఏం చేయాలో తెలియక ఇంటికి వచ్చింది. నాన్న పరిస్థితి మరింత కఠినంగా అయుతుంది, నాన్న బతకడానికి కేవలం 3 రోజులు మాత్రమే ఉంది.


దిక్కు తోచని పరిస్థితిలో కోమలి వేరే దారి లేక చివరికి ఆ పాత మనేజర్ దగ్గరికి వెళ్ళి " నేను మి కోరికను తీరుస్తాను కానీ నాకు 24000 కావాలని వేడుకుంటుంది " ఇది ఒప్పుకున్న నిర్వాహకుడు రాత్రంతా కమలినీ అనుభవించి పొద్దున్నే 24000 ఇచ్చి పంపిస్తాడు అప్పుడు కోమలి టికెట్స్ కొనుక్కుని నాన్నను తీసుకుని ఫ్లైట్ ఎక్కుతుంది.


చివరికి నాన్న కోరిక తీరింది విమానం ఎక్కి పైనుంచి కిందకి చూస్తూ సంతోషంగా నాన్న కోమాలి వైపు చూస్తూ. " చాల థాంక్స్ ర నాన్న ఈ జన్మలో నేను విమానం ఎక్కుతానని అనుకోలేదు న అస నెరవేరింది " అని చెప్తూ చనిపోయారు. తన నాన్న చావుని చూసిన కోమలి కూడ విమానం లోనే కళ్ళు మూసింది


Rate this content
Log in

Similar telugu story from Drama