మాతృభాషాదినోత్సవం
మాతృభాషాదినోత్సవం


మార్టిన్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థి. ఇంట్లోనూ వీధిలోనూ పాఠశాలలోనూ కేవలం ఆంగ్లంలో తప్ప తెలుగులో మాట్లాడటానికి అతను ఇష్టపడేవాడు కాదు. మార్టిన్ కి ఎస్తేరు రాణి అనే చెల్లి ఉండేది. ఆమెకు తెలుగు అంటే చాలా ఇష్టం మన మాతృభాష తెలుగు కాబట్టి తెలుగులోనే మాట్లాడాలి, హిందీ జాతీయ భాష దాన్ని గౌరవించాలి. ఇంగ్లీష్ అంతర్జాతీయ భాష దాన్ని అభ్యసించాలి ఈ మూడు భాషలూ మనకు అవసరమే కానీ మాతృభాష తెలుగుని మర్చిపోరాదు అని నిత్యం అన్నయ్య మార్టిన్ తో అంటుండేది. చెల్లి మాటలను పెద్దగా పట్టించుకునేవాడు కాదు మార్టిన్, అవకాశం దొరికినప్పుడల్లా తెలుగుని అవహేళన చేస్తూ ఇంగ్లీష్ లో మాట్లాడుతుండేవాడు.
ఆంధ్ర రాష్ట్రంలో మాతృభాషా దినోత్సవం సందర్భంగా మార్టిన్ ఉన్న పట్టణానికి ఇంగ్లాండ్ నుండి విలియమ్స్ అనే ఆంగ్లేయుడు వస్తున్నాడు అతడు మాతృభాషా దినోత్సవంలో ప్రశంగిస్తాడు అన్న వార్త మార్టిన్ కి తెలిసింది, విలియమ్స్ ఇంగ్లీషువాడు కాబట్టి అతని ప్రశంగం ఖచ్చితంగా ఆంగ్లంలోనే ఉంటుంది అని అనుకొని చెల్లికి ఇంగ్లీష్ గొప్పను తెలియజేయడానికి మార్టిన్ చెల్లిని విలియమ్స్ ప్రసంగం వినడానికి రమ్మన్నాడు, భాష ఏదైనా వినడంలో తప్పులేదు అందులోని మాధుర్యాన్ని ఆస్వాదించడంలో తప్పులేదని అంటూ విలియమ్స్ తప్పకుండా తెలుగులోనే ప్రసంగిస్తాడు అని పందెం వేసింది రాణీ అన్నయ్య మార్టిన్ తో "కాదు అతని ప్రసంగం ఖచ్చితంగా ఇంగ్లీష్ లోనే ఉంటుంది అని మార్టిన్ వాదించి ఒకవేళ విలియమ్స్ తెలుగులో ఒక్క ముక్క మాట్లాడినా నేనూ అవసరమైనచోట తప్ప ఇంగ్లీష్ లో మాటలాడను అని హామీ ఇచ్చారు మార్టిన్ చెల్లికి
మాతృభాషా దినోత్సవం ప్రారంభమయ్యింది. వక్తలందరూ మాటలాడిన తరువాత చివరగా విలియమ్స్ మాట్లాడుతూ తెలుగులో గుక్కతిప్పకుండా అనర్గళంగా అరగంట మాట్లాడి దేశ భాషలందు తెలుగు గొప్పతనం సవివరంగా తెలిపాడు, అతని ఉపన్యాసంలో ఒక్క ఇంగ్లీష్ ముక్కకూడా లేకుండా అచ్చ తెలుగులోనే మొత్తం ఉపన్యాసం చేసాడు, తన తాత ముత్తాతలు తెలుగువారిని ఇప్పటికీ మా ఇంట్లో తెలుగులోనే మాట్లాడతాము నేను తెలుగు గ్రంథాలే ఎక్కువగా చదువుతాను కేవలం ఈ సభ గురుంచే నేను ఈ దేశం నుండి తాతల పుట్టిల్లు తెలుగు గడ్డపైకి వచ్చాను అన్నాడు. చెల్లి గెలిచింది అన్న మార్టిన్ నోట మాట రాలేదు తెలుగు విలువ తెలుసుకొని నాటినుండి మాతృభాష గొప్పతనం ప్రచారం చేస్తూ తెలుగులోనే మాట్లాడటం అలవాటు చేసుకున్నాడు