M.V. SWAMY

Inspirational

4  

M.V. SWAMY

Inspirational

మాస్క్ తెచ్చిన మార్పు

మాస్క్ తెచ్చిన మార్పు

3 mins
79



       మాస్క్ తెచ్చిన మార్పు (కథ)



చిట్టికి చిలిపి దొంగతనాలు అలవాటు ఉంది.ఏదైనా షాప్ కి వెళ్తే షాప్ లో ఉన్న సిబ్బంది చూడకుండా చిన్న చిన్న వస్తువులు జేబులో వేసుకుంటుంది. ఆ మధ్య ఒక షాప్ లో డైరీ మిల్క్ చాక్లైట్ దొంగతనం చెయ్యగా సీసీ కెమెరాలో రికార్డ్ అయిపోయ షాప్ వాళ్లకి దొరికిపోయింది. చిన్న పిల్ల కదా అని షాప్ వాళ్ళు మందలించి వదిలేశారు.


"అలా దొంగతనం చెయ్యకూడదు,తప్పు"అని అమ్మ ఎన్నోసార్లు మందలించింది అయినా చిట్టి చేతి వాటం ఆగలేదు.


బడిలో పిల్లలు చిట్టి పక్కన కూర్చోడానికే భయపడుతున్నారు,ఎందుకంటే తోటి పిల్లల పుస్తకాలు,పెన్నులు,పెన్సిల్స్,రబ్బర్లులాంటివి దొంగతనం చేసేసి ఇబ్బందులు పెడుతుందని అందరూ చిట్టి మీద కంప్లైంట్స్ చేస్తున్నారు.


ఒకరోజు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ లో ఒక పేరెంట్ "చిట్టి అనే అమ్మాయి వల్ల మా అమ్మాయి బడికి రాడానికే బయపడుతుంది" అని పబ్లిక్ గా కంప్లైంట్ చెయ్యడంతో చిట్టి నాన్నకు కోపం వచ్చి ఇంటికి వచ్చి చిట్టిని కొట్టాడు.అప్పుడు చిట్టి చాలా బాధ పడింది ఇకపై ఎప్పుడూ దొంగతనం చెయ్యకూడదు అని మనసులో గట్టిగా నిర్ణయించుకుంది. కానీ ఏదైనా కొత్త వస్తువు, ముఖ్యంగా తన దగ్గర లేని వస్తువు ఎక్కడైనా కనిపిస్తే చిట్టి చేతులు మనసు అటువైపు లాగి ఆమె చేత దొంగతనం చేయిస్తుంటాయి, అది ఆమె బలహీనత.


చిట్టి పెద్ద పెద్ద దొంగతనాలు చెయ్యకపోయినా చిన్నప్పటి ఈ చిలిపి చిలిపి దొంగతనాలే పెద్దయ్యాక పెద్ద దొంగతనాల అలవాట్లుకి దారి తీయ్యవచ్చు అని ఆమె తలిదండ్రులు బాధ పడుతున్నారు.


ఒకరోజు చిట్టి తాతయ్య ఊరు నుండి వచ్చాడు,చిట్టి చేస్తున్న దొంగతనాలు, వాటివల్ల ఇంటివారికి వస్తున్న అవమానాలు అతనితో చెప్పారు చిట్టి తలిదండ్రులు. తాతయ్య బాగా ఆలోచించాడు. చిట్టిని మాటల్లో పెట్టి దొంగతనం ఎందుకు చేస్తున్నావు అని సూటిగా అడిగాడు నాకు దొంగతనం చెయ్యాలని ఉండదు కానీ ఏదైనా కొత్త వస్తువు, నా దగ్గర లేనిది కనిపిస్తే నా మనసు అటులాగుతుంది, చేతులు కూడా మనసుకే సహకరిస్తాయి అని చెప్పింది చిట్టి. అలా కాసేపు మాట్లాడుతూ...కరోనా వైరస్ చాలా ప్రమాదం అది నా దగ్గర లేదు కానీ దాన్ని మాత్రం దొంగతనం చెయ్యను, అది నాకు ఒంటరిగా కనిపించినాసరే అని అంది చిట్టి.


రెండో రోజు తాతయ్యా ఒక ఫాన్సీ షాప్ కి చిట్టిని తీసుకొని వెళ్ళాడు. అక్కడ తాతయ్యా ఏవో వస్తువులు కొంటుండగా,చిట్టి షాప్ అంతా తిరిగింది, ఒక దగ్గర రంగు రంగుల్లో ముచ్చటగా వుండే ఒక మాస్క్ కనిపించింది. తన దగ్గర రంగు రంగుల మాస్క్ లేదు కాబట్టి ఆ మాస్క్ ని జాగ్రత్తగా తీసి మడత పెట్టి జేబులో వేసుకుంది చిట్టి. ఇంటికి వచ్చాక,మాస్క్ ని అమ్మకి చూపించి,ఇది నా ఫ్రెండ్ వాళ్ల బాబాయి అమెరికా నుండి తెచ్చాడు కొత్తదే ఎవరూ ఓడలేదు నువ్వు తీసుకో అని,వద్దు వద్దు అన్నా వినకుండా అమ్మ మూతికీ ముక్కుకీ మాస్క్ తగిలించింది చిట్టి.


ఒక అరగంటలో ఆ రోజు తాతయ్య చిట్టి కలసి వెళ్లిన షాప్ యజమాని వచ్చి మా షాప్ లో పనిచేసే ఒక అబ్బాయికి కోవిడ్ పాజిటివ్ అని ఇప్పుడే తెలిసింది, అతను గతంలో వాడిన మాస్క్ పొరపాటున మా షాపులో వదిలేసాడట ఆ మాస్క్ ని మీ అమ్మాయి దొంగతనంగా తెచ్చినట్లు మాకు అనుమానం సీ సీ కెమెరాలో ఉంది,జాగ్రత్తగా ఉండండి ఆ మాస్క్ వాడకండి అని చెప్పి వెళ్లిపోయాడు.


చిట్టి ఏడుపు మొదలు పెట్టింది.తాను కోవిడ్ వైరస్ ఉన్న మాస్క్ ఆ షాప్ నుండే తెచ్చి అమ్మకు ఇచ్చేసాను అని తాతయ్యతో చెప్పి బిగ్గరగా ఏడ్చింది.తాతయ్య చిట్టిని ఓదార్చి"అందుకే మనం దొంగతనం చెయ్యకూడదు చేస్తే ఇలాంటి రిస్క్ తప్పదని చెప్పి, అమ్మకు వరస్ రాకుండా నేను నువ్వు మాస్క్ ని నీ జేబు నుండి తీసి మన ఇంట్లోని టేబుల్ మీద పెట్టినప్పుడే శానిటైజ్ చేసాను, అప్పుడు నువ్వు వాష్ రూంకి వెళ్ళావు అని చెప్పాడు, అప్పుడు తాతయ్యకి ధన్యవాదాలు చెప్పి జీవితంలో మరెప్పుడూ దొంగతనం చెయ్యను అని కాస్తా మామ్మోలు నీరసంతో నిద్రపోతున్న అమ్మ మీద ప్రమాణం చేసి చెప్పింది చిట్టి.


షాప్ యజమాని తానూ కలసి నాటకం ఆడి ఇదంతా చేశాం నిజానికి ఆ కోవిడ్ గీవిడ్ మాట అబద్ధం ఆ మాస్క్ వందశాతం స్వఛ్చమైనది, అదే చిట్టికి బుద్ధి తెచ్చింది అని చిట్టి పేరెంట్స్ కి చెప్పి బిగ్గరగా నవ్వేశాడు తాతయ్య.తాతయ్య తెలువికి చిట్టి తలిదండ్రులు మురిసిపోయారు.


........ఎం.వి.స్వామి


      


Rate this content
Log in

Similar telugu story from Inspirational