Hitesh Kollipara

Drama Romance

4  

Hitesh Kollipara

Drama Romance

లవ్ ఇన్ అమెరికా – 3

లవ్ ఇన్ అమెరికా – 3

7 mins
428


#నేను_వెతకాలా?!


ఆర్యన్ గాడు ఇంకా మా ఇద్దర్ని అలానే మిడిగుడ్లేనుకుని చూస్తూ ఉన్నాడు.

క్షణం తరువాత, “మామ్...” అని గట్టిగా అరిచాడు.

నేను వెంటనే అలెర్ట్ అయిపోయి ఆర్యన్ దగ్గరికి ఉరికాను. నాకంటే పన్నెండు సంవత్సరాలు ఆలస్యంగా పుట్టినా, పన్నెండు సంవత్సరాల వయసే ఐనా యువకుడిలా దాదాపు నా అంత ఎత్తు ఉంటాడు వాడు. ఆర్యన్ గాడ్ని వెనుక నుంచి కదలకుండా ఒక చేత్తో గొంతుని చుట్టేసి మరో చేత్తో వాడి నోటిని మూసేశాను.

“నువ్వు గనుక మామ్ కి ఇప్పుడు చూసింది చెప్పావో..., ప్రామిస్ చేస్తున్నా..., రేపట్నుంచి నువ్వు స్కూల్ కి కుంటుకుంటూ వెళ్లాల్సి వస్తుంది” దృఢంగా అన్నాను గాని చాలా నెమ్మదిగా అన్నాను. ఎక్కడ మా అమ్మ వింటుందో అని నా భయం.

ఈలోపు ఆల్బర్ట్ షర్ట్ బటన్స్ పెట్టేసుకుని మా దగ్గరకి వచ్చాడు. ఆర్యన్ తో, “హేయ్ ఆర్యన్.., మొన్న నువ్వు స్కూల్ దగ్గర చేసిన పని గుర్తుందిగా?... ఇప్పుడు నువ్వు మీ మామ్ కి ఇక్కడ చూసింది చెప్తే నేను ఆ విషయం మీ డాడ్ కి చెప్పేస్తాను” అన్నాడు.

“మొన్న స్కూల్ దగ్గర ఏం చేశాడు?” వెంటనే అడిగాను.

“వెల్.., దట్స్ ఏ సీక్రెట్ బిటివీన్ అజ్. చెప్పనని మీ బ్రదర్ కి ప్రామిస్ చేశా. బట్ ఇప్పుడు మీ మదర్ దగ్గర నోరు విప్పితే ఐ టూ విల్ ఓపెన్ అప్ మై మౌత్” ఆల్బర్ట్ నాకు సమాధానం చెప్తున్నప్పుడే నా చేతిని కొరికాడు ఆర్యన్.

“ఇస్స్...” ఆర్యన్ ని వదిలేసి, “కొరుకుతావేంటిరా పంది...” అన్నాను చేతిని రుద్దుకుంటూ.

“మామ్...” మళ్ళీ గట్టిగా అరిచాడు ఆర్యన్ గాడు.         

ఇక బలప్రయోగానికే సిద్దమయ్యాడు ఆల్బర్ట్. ఆర్యన్ ని గొంతు పట్టుకుని విసురుగా తీసుకెళ్లి గోడకి ఆనించాడు. “ఆర్యన్..., ఐ స్వేర్..., నువ్వు గనుక మీ మదర్ కి ఇక్కడ చూసింది చెప్తే రేపు నువ్వు స్కూల్ కి కుంటుకుంటూ వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే నేను నిన్ను చంపేస్తా కాబట్టి” చాలా సీరియస్ టోన్ తో అన్నాడు.

ఆల్బర్ట్ ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్ చూస్తే నాకే భయమేసింది. ఇక ఆర్యన్ కళ్ళు చూస్తే బెంబేలెత్తిపోయాడని ఈజీగా తెలిసిపోతుంది. నాకు ఉక్రోషం పొడుచుకొచ్చింది.

“ఆల్బర్ట్..., యు ఆర్ హర్టింగ్ మై బ్రదర్. లీవ్ హిమ్” ఆల్బర్ట్ తో అన్నాను.

“నో..., ఐ యామ్ జస్ట్...”

“ఐ సెడ్ లీవ్ మై బ్రదర్...” గట్టిగా అరిచాను.

నా అరుపుకి ఆర్యన్, ఆల్బర్ట్ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఆల్బర్ట్ ఆర్యన్ ని వదిలేశాడు. అప్పుడే కింద నుంచి పైకి వచ్చింది మా అమ్మ – “ఏంటి ఇక్కడ శబ్దాలు?...” అంటూ.

“మామ్...” అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి మా అమ్మ వెనక్కి చేరిపోయాడు ఆర్యన్.

“మామ్ కాదు.., అమ్మ!” ఇంట్లో ఎవరు ఎవర్ని సంభోదించినా తెలుగులోనే సంభోదించాలంతుంది మా అమ్మ. అదే గుర్తు చేసింది.

తరువాత ఆల్బర్ట్ నీ, నన్నూ పట్టిపట్టి చూసింది.

“ఇతను ఈ టైమ్ లో నీ రూమ్ లో ఏం చేస్తున్నాడు?” నాతో తెలుగులో అంది.

“కింద పర్మిషన్ తీసుకునే వచ్చా అన్నావ్?” నేను ఆల్బర్ట్ ని ఇంగ్లిష్ లో అడిగాను.

“వెల్..., పర్మిషన్ తీసుకుంది నిజమే. కాకపోతే మీ మామ్ దగ్గర కాదు, మీ డాడ్ దగ్గర. నేను వచ్చినప్పుడే అంకుల్ జాగింగ్ నుంచి వస్తున్నారు. సో ఆయన దగ్గర పర్మిషన్ తీసుకునే వచ్చా. కావాలంటే అడుగు. ఇక మీ మామ్ పర్మిషన్ తీసుకునే వచ్చా అని చెప్పటానికి ఒక కారణం ఉంది. ఎప్పటికైనా మీ మామ్ పర్మిషన్ తో నీ రూమ్ లోకి అడుగుపెట్టాలనేది నా ఫాంటసీ. కానీ అది తీరదని తెలుసు. అందుకే ఇలా అబద్దం చేప్పైనా నా ఫాంటసీని నిజం చేసుకుందామని అలా చేశాను” ఏదో ఎక్స్ ప్లనేషన్ ఇచ్చాడు.

నమ్మలేనట్టు నేనూ, అమ్మా ఆల్బర్ట్ కేసి ముఖం పెట్టాం.

“మై ఎక్స్ ప్లనేషన్ మైట్ లుక్ సిల్లీ. బట్ ఐ యామ్ సేయింగ్ ద ట్రూత్. యు కన్ ఆస్క్ యువర్ ఫాదర్”

ఆల్బర్ట్ నిజమే చెప్తున్నాడు. నాకర్ధమైంది. ఐతే పైకి మాత్రం తల అడ్డంగా ఊపాను. అమ్మైతే ఆల్బర్ట్ ని తినేసేలా ఒక లుక్ ఇచ్చి నా కాళ్ళ వైపుకి దృష్టి మరల్చింది.

“దేవుడా..., ఈ అమ్మాయికి ఎప్పుడు జ్ఞానం వస్తుందో?...” టీవి సీరియల్ లో అమ్మ పాత్రకి తక్కువకాకుండా రాగాలు తీస్తూ డ్రమాటిక్ గా మంచం మీద బెడ్ షీట్ ని లాగేసి నా నడుముకు చుట్టింది.

“అమ్మా..., నా పరువు తీస్తున్నావు”

“కాదు పరువు నిలబెడుతున్నాను. సిగ్గులేదు?... ఇలా పరాయి మగాడి ముందు నిక్కర్లతో ఉన్నావ్??...” బెడ్ షీట్ ని మొత్తం చుట్టగా మిగిలిన కొసని పైటలా వెనుక నుంచి కప్పుతూ అంది.

“అమ్మా..., ఇవి నిక్కర్లు కాదు షార్ట్స్. ఐనా రాత్రి పడుకునేటప్పుడు ఇలాంటి డ్రస్ లోనే పడుకుంటారు. నేనేమన్నా కలగన్నానా?... ఆల్బర్ట్ ఇంత పొద్దున్నే ఇలా నా రూమ్ లోకి జొరబడతాడని?”

“నీ దగ్గర నా ప్రశ్నలకి సమాధానాలుంటాయి గాని వాడి చూపులకి సమాధానాలున్నాయా?”

“అమ్మా..., ఆల్బర్ట్ అలాంటివాడు కాదు”

“నువ్వు అమాయకురాలివి ఏమో నేను కాదు”

మేము తెలుగులోనే వాదించుకుంటున్నా భావం అర్ధమైనట్టు ఉంది ముసిముసిగా నవ్వుతున్నాడు ఆల్బర్ట్. నాకు చాలా ఎంబార్సింగ్ గా అనిపించింది. అమ్మ కూడా ఆ టాపిక్ ని డైవర్ట్ చేయాలనుకుందో ఏమో ఆర్యన్ గాడ్ని చూస్తూ, “ఎందుకురా ఇందాక అన్నిసార్లు అరిచావ్?” అంది.

ఆర్యన్ గాడు ఏదో చెప్పబోతూ నావైపు చూశాడు. నేను కోపంగా, “చెప్పావో... పీక కట్ చేస్తా...” అన్నట్టు సైగలు చేశాను. వాడు కనుబొమ్మలు ఎగరేశాడు. ఎందుకైనా మంచిదని ముఖంలో కొంచెం బెదిరింపు తగ్గించాను. వాడు ఏమనుకున్నాడో ఏమో, “అంటే సిస్ రూమ్ లో....”

“సిస్ కాదు.., అక్క”

“అదే అక్క రూమ్ లో ఆల్బర్ట్ ఉన్నాడు కదా..., అది నీకు చెబ్దామని...” అని అమ్మతో కవర్ చేశాడు.

“హుమ్మ్... కూతురూ, తండ్రికీ లేని బాధ నాకెందుకు? ఎవరి చావు వాళ్ళు ఛస్తారు. స్కూల్ కి టైమ్ అవుతుంది పదా” అంటూ గది బయటకి దారి తీసింది.

మెట్లు దిగుతూ, “గది తలుపు మూయకు, వొంటి మీద దుప్పటి విప్పకు” అంటూ వెళ్లిపోయింది.

“అమ్మా.... డోంట్ ఎంబారెస్ మీ..” అన్నాను. కానీ నా మాటలు విన్నదో లేదో కూడా తెలీలేదు. ఆర్యన్ గాడు మాత్రం ఇంకా వెళ్లకుండా అక్కడే ఉన్నాడు.

“ఏంట్రా?” అన్నాను.

వాడు ఏదో అర్ధమైనవాడిలా తల ఊపుతూ, “ఉమ్... ఐ కన్ అండర్స్టాండ్ యు మై డియర్ సిస్టర్. యువర్ హార్మోన్స్ ఆర్ టేకింగ్ యువర్ కంట్రోల్ బట్ ప్లే సేఫ్!” అన్నాడు.

వాడు అన్నదానికి భావం అర్ధమై మండుకొచ్చి రెండు వేయటానికి ముందుకి ఉరికా. అప్పటికే వాడు తుర్రుమన్నాడు.

******

మంచం మీద వాలిపోయి పడిపడి నవ్వుతున్నాడు ఆల్బర్ట్. అమ్మ అన్నదని కాదు గాని ఎందుకో తలుపుని మాత్రం కొంచెం దగ్గరకి వేశాను. ఆల్బర్ట్ ఇంకా నవ్వుతూనే ఉన్నాడు.

“హి.. హి.. ఇక చాలు” అన్నాను.

ఆల్బర్ట్ నవ్వాపేసి లేచి కూర్చున్నాడు. “ఏదేమైనా మీ తమ్ముడు మాత్రం జీనియస్” అన్నాడు.

“అవును, నా తమ్ముడు కదా..”

“లేదు లేదు. నేను జోక్ గా అనట్లేదు. సీరియస్ గానే చెప్తున్నా..” మళ్ళీ నవ్వటం స్టార్ట్ చేశాడు.

నాకు మండిపోయి ఒంటికి చుట్టిన దుప్పటిని విప్పి అతడి ముఖం కేసి విసిరాను. ఆల్బర్ట్ మాత్రం ఒడుపుగా తప్పించుకుని మళ్ళీ నిటారుగా కూర్చున్నాడు. ఐతే నవ్వాపేసి ముఖాన్ని తీక్షనంగా చేసి నాకేసి చూడటం మొదలుపెట్టాడు. అతడి కళ్ళు నా కాళ్ళని పరిశీలిస్తున్నాయి అని అర్ధమై సిగ్గు, ఆనందం ఒకేసారి కలిగాయి. అప్రయత్నంగా నా చేతులు నా తొడలకి అడ్డుగా వెళ్ళాయి.

“ఏంటి చూస్తున్నావ్?”

“నీ కాళ్ళు... పొడుగ్గా, నునుపుగా బాగున్నాయి...”

బాగున్నాయా?! అంటే ఏంటి అతడి ఉద్దేశం? ఆ దృష్టితోనే అంటున్నాడా..., లేక??...

“ఏంటి?!...”

“ఆంటీ భయపడటంలో అర్ధముంది. నువ్వు ఈ డ్రస్ లో కొంచెం ప్రొవోకేటివ్ గానే ఉన్నావ్”

నేనేం మాట్లాడలేదు.

అతడు లేచి నా దగ్గరకి రాసాగాడు. నా గుండెదఢ పెరగసాగింది. అతడు వచ్చి నా ముందు నించుని నా భుజాల చుట్టూ చేతులు వేశాడు. నా అరచేతుల్లో చెమట్లు చేరాయి. లోలోపల వణికిపోతూ అలానే నించున్నాను. అతడు తన నుదుటిని నా నుదుటికి ఆనించి,

“అవును మగ్..., నిజంగానే నువ్వు ఈ డ్రస్ లో ప్రొవోకేటివ్ గానే ఉన్నావ్. ఏ మగాడైనా నిన్ను ఇలా చూస్తే ఖశ్చితంగా అలజడికి లోనవుతాడు. ఆంటీ అలా బిహేవ్ చేయటంలో తప్పు లేదు. కానీ మనం తనకి అర్ధమయ్యేలా చెప్పాలి..., నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వి అని, అంతకుమించి ఏమీ కాదనీ. నువ్వు నగ్నంగా ఉన్నాసరే నీ మీద నాకు ఎలాంటి వికారభావనా కలగదు. నీకు తెలుసు కదా?...”

అతడి మాటలకి పాతాళంలోకి క్రుంగిపోతున్న భావన. అవును తెలుసు - నన్ను చూస్తే అతడికి ఎలాంటి వికార భావనా కలుగదు. అదే నా బాధ కూడా. ఏ అమ్మాయి ఐనా తన ప్రియుడు తన అందం కారణంగా అలజడికి గురి అవ్వాలనే కోరుకుంటుంది. నేను కూడా అంతే. కానీ ఆల్బర్ట్ కి మాత్రం నన్ను నగ్నంగా చూసినా అలజడి కలగదని స్టేట్మెంట్ పాస్ చేసేస్తున్నాడు. అలాని నేనేమీ నా అందంతోనే అతడికి దగ్గరవ్వాలని అనుకోవటంలేదు. మనసుల కలయిక ద్వారానే దగ్గరవ్వాలని ఆశ. కానీ మనసులు దగ్గరవ్వాలంటే ముందు ఆకర్షణ కలగాలిగా? అందుకు అందం ముఖ్యపాత్ర పోషిస్తుంది. కానీ ఆల్బర్ట్ మాత్రం ప్రతి అమ్మాయిలో అందాన్ని చూస్తాడు కానీ నాలో మాత్రం చూడడు. నిజం చెప్పాలంటే ఏ అమ్మాయికీ రాకూడని దుస్థితి ఇది. పైగా ఏమంటున్నాడు? ‘నువ్వు బెస్ట్ ఫ్రెండ్ వి, అంతకు మించి ఏమీ కాద’ని కదా?... అంటే బెస్ట్ ఫ్రెండ్ వి అని ఉన్నతస్థానంలో నిలబెట్టా అంటున్నాడా? లేక అంతకుమించి ఏమీ కాదని పరిధిని గుర్తుచేస్తున్నాడా?...

నేను ఆలోచనల్లో మునిగిపోయాను.

“యు ఆర్ నాట్ టాకింగ్?” నేను ఆలోచనలలో మునిగిపోవటంతో అన్నాడు ఆల్బర్ట్.

“యా..., ఐ విల్ టాక్ టు హర్” ఏదో అనాలన్నట్టు సాలోచనగా అన్నాను.

“దట్స్ ప్రెట్టీ గుడ్” అంటూ వెళ్ళి మళ్ళీ మంచం మీద కూర్చున్నాడు.

నేను మళ్ళీ మౌనం.

“నువ్వు మనసులో ఏదో ఆలోచిస్తున్నావ్?” నా భావాలు చదివినట్టు అనేశాడు.

ఉలిక్కిపడ్డాను. “లేదే..., ఏమైంది?” తొణుకుతూ అన్నాను.

“ఉన్నట్టుండి నీ మూడ్ మారిపోయినట్టు ఉంది?” అన్నాడు.

ఇక లాభం లేదు టాపిక్ మార్చాలిసిందే అనుకుని, “అవును నీ వల్లే. ఉదయం నా రూమ్ లోకి జొరబడి నా నిద్రని...” అంటుంటే, “నిద్రని భగ్నం చేశాను. ఇందాకే తిట్టేశావ్. కొంచెం ముందుకెళ్లి మాట్లాడు..” మధ్యలోనే నా మాటని తుంచేశాడు.

“అంతేకాదు అద్భుతమైన నా కలని కూడా పాడు చేశావ్...”

“కలా?...”

“అవును కలే..., లవ్ డ్రీమ్!”

“లవ్ డ్రీమ్?...” ఆశ్చర్యంగా అన్నాడు.

“........”

“నువ్వు లవ్ లో ఉన్నావా?... నాకు ఎప్పుడూ చెప్పలేదు? ఎవరు అతను?” లేచి నా ముందుకు దూసుకువస్తూ అన్నాడు.

“ఇందాక నువ్వేదో ఎమర్జెన్సీ సిట్యుయేషన్ అని ఏదో అంటున్నావ్?”

“లేదు. ముందు నీ లవ్ మ్యాటర్ గురించి చెప్పు?”

“నువ్వు ఇప్పుడు చెప్తావా లేక బయటకి వెళ్తావా??..” చేతులు కట్టుకుని దృఢంగా ముఖం పెట్టాను.

ఏమనుకున్నాడో ఏమో మళ్ళీ వెళ్ళి మంచం కూర్చున్నాడు. “యా..., ఐ యాం ఇన్ ఏ బిగ్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్...” సాలోచనగా అన్నాడు.

“ఇందాకట్నించి అదే చెప్తున్నావ్. కొంచెం ముందుకు వెళ్ళి మాట్లాడు...”

“నిన్న క్రిస్టీతో...”

‘’మొదలెట్టాడు...’’ మనసులో అనుకున్నాను. అతడు కొనసాగించాడు.

“క్రిస్టీతో కలిసి అనకోస్టియ ఫ్రీవే కి వెళ్లాను...”

“అనకోస్టియ ఫ్రీవే??....” అరిచాను.

“అవును. ఎందుకు?”

“చెప్పు?…”

“అనకోస్టియ ఫ్రీవే కి వెళ్లాము. యు నో సచ్ ఏ రొమాంటిక్ నైట్ ఇట్ వస్?! ఫ్రీవే మీద ఎలాంటి సంచారం లేదు. పున్నమి రాత్రిలో నేను, తాను. మాకు వంద అడుగుల దూరం లైట్లు ఆరుతూ, వెలుగుతూ మా కార్.... నేను, తాను దగ్గరదగ్గరగా...”

“...దగ్గరాదగ్గరగా వాటేసుకుని నించుని. అలా ఎంతోసేపు గడిపి. అలా రొమాంటిక్ మూడ్ పీక్స్ లో ఉన్నప్పుడు నువ్వు తనని నడుం పట్టి గాల్లోకి ఎత్తితే, తను ప్రపంచాన్ని జయించినట్టు అరిస్తే, నువ్వు తనని ముద్దు పెట్టుకోవాలని అడిగితే, తను కిందకి దించమని అంటే, నువ్వు ముద్దు పెట్టుకోవటానికి తలని ముందుకి వంచితే...”

“వావ్!... చూసినట్టే చెప్తున్నావ్..., నీకెలా తెలుసు?”

“నా దరిద్రం మీద నాకు నమ్మకంలే....” అనీ అన్నట్టు నసిగాను.

“వాట్?..”

“చెప్పు...”

“బట్ బ్యాడ్ లక్. ముద్దు పెట్టలేకపోయా. అప్పుడే హైవే ప్రొటాక్షన్ అథారిటి వాళ్ళు వచ్చారు. దె అడర్డ్ అజ్ టు లీవ్ అండ్ వి కేం బ్యాక్”

అంటే అక్కడ కూడా ముద్దు పెట్టుకోలేదా!?... ఇక ఋజువులు అక్కర్లేదు. ఖశ్చితంగా దేవుడు ఉన్నాడు!!

“ఎందుకు?”

“క్రిస్టీని రేప్ చేస్తారేమోనని”

“నువ్వు వాడికి రేపిస్ట్ లా కనిపించావా?” కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అన్నాను.

“స్టూపిడ్! నేను కాదు రేపిస్ట్ రేప్ చేస్తాడేమో అని. అక్కడ ఎవడో రేపిస్ట్ తిరుగుతున్నాడని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందంటా..., సో వెళ్లిపోమన్నారు. ఐనా ఇక్కడ పాయింట్ అది కాదు. పాయింట్ ఈజ్ క్రిస్టి. ఆమె అక్కడే ఉండాలి అంటుంది? అప్పుడు రేపిస్ట్ వస్తే, నేను వాడితో పోరాడితే నా హీరోయిజం ఎలివేట్ అవుతుందంట. క్రేజీ ఐ సే! గొడవ పెద్దదై దెన్ వి బ్రోకప్. సో అదీ నా ఎమర్జెన్సీ సిట్యుయేషన్” చెప్పాడు.

“నాకు అర్ధంకాలేదు?”

“సింపుల్ గర్ల్..., ఆ గొడవలో క్రిస్టీతో ఛాలెంజ్ చేశా..., రెండురోజుల్లో తనకంటే అందమైన, ముఖ్యంగా పిచ్చి లేని హాట్ గర్ల్ తో డేటింగ్ స్టార్ట్ చేస్తా అని. బట్ ఇక్కడ ఇంకో విషయం..., ఈసారి ఒకమంచి అమ్మాయిని నిజంగానే ప్రేమించాలని నిర్ణయించుకున్నా. నాట్ లైక్ పాసింగ్ లవ్. ఐ వాంట్ టు ఫీల్ ద రియల్ లవ్. హార్ట్ ఫెల్ట్ లవ్. సో నా సోల్ మేట్ ని వెతకటానికి నువ్వు నాకు సాయం చేయాలి. దట్స్ మై ఎమర్జెన్సీ” చెప్పాడు.

క్రిస్టీ కంటే అందమైన... అంటే నేను అందంగా లేనా?... పిచ్చి లేని... అంటే నాకు పిచ్చి ఉందా?... ఏమిటి అసలు ఆల్బర్ట్ ఉద్దేశం? నేను ఇంతలా అతడ్ని ప్రేమిస్తుంటే నన్ను గుర్తించడు? పైగా తన సోల్ మేట్ ని వెతకటంలో నా సాయం కోరుతాడు? అసలు అది అయ్యే పనేనా!? మళ్ళీ నాకు పాతాళంలోకి కూరుకుపోతున్న భావన.Rate this content
Log in

Similar telugu story from Drama