శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Inspirational Others

4  

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Inspirational Others

కుటుంబం

కుటుంబం

3 mins
384


దేవుడు ముందుగానే ఇచ్చేసిన లేదంటే అడగకుండా ఇచ్చేసిన ,మన జీవితాల్లో అతి ముఖ్యమైన విషయాలు మన కంటికి చిన్నగా,అసలు అవసరం లేనట్టుగా అనిపిస్తాయి.అలాగే మనమీద శ్రద్ధ పెట్టె కుటుంబంలోని వాళ్ళు బోలేడంతమంది ఉన్నపుడు,మనకి ఇంకెవరో నచ్చుతారు.ప్రపంచంలో అతిరధులకి హారతులు పట్టె కార్యక్రమాలు ఎక్కువ జరుగుతాయి ఇలాంటి వారి వల్ల. తీరా చూస్తే వారికి కుటుంబంలో వారి మాట వినే అలవాటు ఉండదు.గౌరవించరు,కనీసం కూర్చుని మాట్లాడరు..కానీ ఈ బడుగుజీవికి మాత్రం ఆ అతిరధుడు రోజూ ఎం చేస్తుంటాడో,అదే చేయడం మీద ఆసక్తి..అందుకే వారి ఆనందాలు వీక్షించే మోజులో పడ్డాడు.

అతిరధులు పొద్దున్నే ఏప్పుల్లతో పళ్ళు తొంకుంటారంట!

బడుగుజీవి ఆలోచించేడు,నేనూ అంతేగా!కబుర్లాడుకుంటున్న కుటుంబాన్ని చూస్తూ అన్నాడు.

పోసుకోలు పెసనలాపు.పనిలోకి పోరా అనుమయ్యా!తల్లి బుద్ధులు సెబుదామనుకుంది.

ఒక్కమాటు ఉండమ్మా!అతిరధులు పళ్ళు తోమాక,పెకృతి కార్యేలు సక్కబెట్టుకుంటారోస్.దానికోసం బస్కీలు కట్టా తీత్తారంటా!?యేదాల్లో సెప్పినట్టు...అస్చేర్యపోతూ చెప్పేడు.

అయ్యేటి నానా యేదాలు!?అమ్మకి తెలీదని ,నాన్నని అడిగేడు

ఒరేఅబ్బిగా!నువు పొద్దుగాలే సెంబట్టుకోని ఉత్తరం దిక్కుకు ,ఓ కిలోమీటర్ దూరం పరిగెడతావ్ కదా...దాన్నే యయామం అంటారరా సోంబెరీ....ఆడికి పోయాక నువు నేనూ అందరూ సేసేది పెకృతి కార్ణం...మనం ఒన్నాలు మాత్రమే తింటావు కాబట్టి కార్యేలకి ఆటంకం ఉండదు.ఆళ్ళు గడ్డిగాదం ఎక్కువ మేత్తారు..కూసింత టయిం అట్టుద్ది

అవునా!అయోమయంగా అనిపించినా ...పది నిమిషాల్లో పని కానిచ్చి,కంచం ముందు కూర్చోబోయిన బడుగుజీవి...ఇంకోసారి అతిరధులు ఎం తింటారు?అని చూసేడు డబ్బాలో

రాగిసంకటి,ఉల్లిపాయ,రెండు మిరపకాయలు...

కాసిన్ని వేన్నీళ్ళు

అమ్మో!నాక్కోడా సంకటి కావాలి.

అదేటి ?మనకి తెలీని సంకటి?అయినా అనుమా...మనం పొద్దన్నే తాగే గంజి నీళ్లకన్నా ,

రుసుంటాదంటావా అది?అశ్చర్యపోయింది తల్లి

కుర్రోడు అడిగితే,సేసి పెట్టకుండా ..ఎంక్వైనాలు సెత్తవేటీ.. ఎంక్వయినాలు...విసుక్కున్నాడు అనుమయ్యతండ్రి

నోర్లు ముయ్యండి..ఏకువజామున పనికి పోతే..మాగాయ్టెంకా ఏసింది ఓ తల్లి..ఈ గంజిలో ,టెంక నాక్కుంటా మింగు...అంటూ గంజన్నం గిన్నె అనుమా ముందుకు తోసింది.

పచ్చడికారానికి కళ్ళంతా నీళ్లొత్తన్నాయమ్మా...కూతమంచినీళ్లియ్యి...అమ్మని కసిరేడు

అరె అనుమయ్య!కాసిన్ని ఎన్నీళ్ళు అంటే...కళ్ళంతా

కారే నీళ్లు ఆవుతయేమోరా...తల్లి నవ్వింది.

పొలం పోబోతూ ...అతిరధులు టిపినీలు అయ్యాక ఎం సేత్తారో డబ్బాలో సూసేడు.

బయట జనాల్లో,ఆపీసులో మీటింగ్ అంటా తిరుగుతా...సానా బిజీగా ఉన్నారు.మద్దె మద్దేల ఎవురన్నా కూల్డ్రింకు కట్టా ఇచ్చినా తాగుతాలేదు..ఓ సోట కారాపేడు..అందులోంచి అతిరధుడు హీరో లాగా ,బైటి గాలి పీలుసుకుంటా దిగేడు..కోటు తీసేసి లోపలకి ఇసిరేసేడు.జనాలు గుంపుగా వత్తం సూసి,కార్లోకి దూరేడు.అయ్యగారు దిగేరని,డ్రైవర్ పక్కనే తోటలో క్యారెజీ తెరిసి పెట్టి కూకున్నాడు..ఆ ఈడియోవోడు..అతిరధుడు తినే,వంటలు సూపించేడు..సేమ్యాలో రంగురంగుల ముక్కలు,కింద జీడిపప్పులు గట్టా,బాగా కింద బ్రెడ్డు ముక్కలు,

శివరాకరున కూరగాయ,ఉల్లిపాయ ముక్కలు కొన్ని నిమ్మసెక్కలు..

ఎబ్బె!!ఏంటీ గడ్డి...ఒక్కటీ సబ్బరిగా వండినట్టునేదు..

అయిన అమ్మకు కొనుక్కు అట్టుకెళతాను అనుకున్నాడు..

ఓ షాపు దగ్గరికి పోయి...ఒక్కో చోట ఆపుతూ...అయి కావాలి అంటూ రెండు వందలకి తేమిల్చేడు.

ఇంటికీ వత్తానే...అమ్మకి ఆయాన్నీ సూపించి...ఎలాగున్నాయమ్మా అన్నాడు..

ఎం కాలం వొచ్చిందిరా నీకు?ఎంతయింది ఈటికి..ఎన్ని డబ్బులు తగలేసినవురా తొత్తుకొడకా!?

ఎన్ని నూకలు,కూరలు...అన్నీ బూడిదకి పోసావు...ఏడుపు లంకించుకుంది..

అమ్మ బాధ లెక్క చెయ్యక,అతిరధులు ఇయ్యే తింటారోస్..నీకు లోకం తెలిత్తే కదా!?

నీలోకాన్ని లొల్ల లాకుల్లో పడదోయ్యా!నీకిన్ని డబ్బులుఎక్కడియ్యిరా!చొక్కా పట్టుకుంది.

మొదలు నువ్వేదో డబ్బా అనావని,దాసుకున్న డబ్బులు,యజమానిని పొలం కాయితాలెట్టి కొంతప్పు తెచ్చేడు నీ బాబు.కొడుకు కోరిక తీరింది అని బడ్డాయిపోతున్నాడు.నువ్వేటా అంటే!అతిరధులు ,అరతిమొక్కలూ అంటూ నా పేనాలు తోడేత్తన్నావు..పెళ్లయినాక పదేళ్ళకి ఉట్టేవు..పడికట్టు పేకారం నీ పేరు పచ్చ పొడిపించాల.నేను సత్తె,పేరు కాలి,బూడిదయితదని...పచ్చ పొడిపించ ఉంటే...నీ బాబు కోన్న డబ్బా ఫోనుకు,నిజంగానే బూడిదయ్యేలాగున్నావు అనుమయ్యా..నీ బాబు నీకెంత కర్సు సేసినా,నాకేలోటు రానియ్యలేదు..అలాగా నీ పెళ్ళాన్ని నువ్వు సూసుకోవాలి..ఈ అతిరధులు అట్లకాడలూ నాకొద్దిరా ...నా అనుమయ్య నాకు కావాలా...కూర్చుని ఏడుస్తుంది తల్లి..

ఈలోపు ట్రింగ్ మోగింది పోను..అతిరధుడు అమ్మ పోయిందంట.ఒకింట్లో ఒకాయన ముందు ,అతిరధిడు తముడూ,అక్కా దెబ్బలాడుకుంటున్నారు.ఫార్మ్ హౌస్ నా పేరున కొంటానని చెల్లి పేరున రాసేసింది అమ్మ.నాకు చెబితే చేసేవాడిని కాదా!నా తమ్ముడికి బిసినెస్ ఇష్టమని పెద్ద స్కూల్ పెట్టించేను..

తొందరలోనే నష్టాలు చూపించేరు,స్కూల్ పేరూ,గుడ్విల్ ఎవరో అలగా జనానికి అప్పచెప్పేడు..అది నేను పవిత్రంగా భావించే అమ్మపేరు...ఇంకా ఏదో చెబుతుండగానే...బ్రేకింగ్ న్యూస్ అంటూ...సగటు జనాన్ని అలగా అంటూ నోరుజారిన అతిరధుడు..ఒకటికీ నాలుగుసార్లు పిల్లిమొగ్గలు వేస్తున్న స్క్రీన్ సారాంశం

పదే పదే..అలగా అన్న మాట యజమాని అంటూంటాడు..తప్పక పనిచేస్తున్నాడు.కానీ దేవుడుగా భావించే అతిరధుడు..అలా అనడం నచ్చని అనుమా...డబ్బాని నెలకేసి కొట్టాడు.

పదేలు...బుగ్గిలో కలిపేశావురా కొడకా!నీ కళ్ళలో సంతోసానికి,నాకు వడ్డీ భారమయ్యేది కాదురా అయ్యా...ఇప్పుడు ఎలాగా...తండ్రి బాధతో అరిచేడు.

బిడ్డ బాగుపడతన్నాడు అనుకుంటూ కళ్ళనీరు కారింది..అతిరధుడైనా..అనాధలైనా...అలగా అయినా అంతా దేవుడు కుటుంబంలో బిడ్డలం రా మనం.తరువాతే ఉన్నోడు ..లేనోడు ఇలా అన్నీ..

అమ్మ!గంజి నీళ్లొత్తే..రాత్రి పొలంకాడే ఉంటా..కుక్కలు కట్టా పనలు పీక్కుపోతున్నాయి..కాపలాకి కళ్ళం కాడే ఉంటాను..విగ్రహంలా నుంచున్న అమ్మని కదుపుతూ

ఇయ్యాల కోడికూర వన్డేనురా..నా అనుమయ్యా బంగారం అంటూ కొసరి కొసరి వడ్డించింది..

పొట్ట నిండింది..నిద్ర ముంచుకొస్తుంది.అంతలోనే అమ్మ,నాన్న గుర్తుకువచ్చేరు. అమ్మో!నా కుటుంబం ఏడాదికి సరిపడా దస్కామ్ తెచ్చే పంట.కూసింత ఎరుకతో ఉండాలి..అనుకున్నాడు సంభాలించుకుంటూ...


Rate this content
Log in

Similar telugu story from Abstract