Dr.R.N.SHEELA KUMAR

Romance

4.0  

Dr.R.N.SHEELA KUMAR

Romance

జీవితం

జీవితం

1 min
203


ఒకానొక పట్టణం లో ఓ పెద్ద ధనవంతుడు వున్నాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఒక కొడుకు. ముగ్గురు ఆడపిల్లలని ప్రభుత్వ పాఠశాల లో చదివించారు, కొడుకుని పెద్ద కాన్వెంట్ లో చదివిస్తూ వున్నారు ఆడపిల్లలు పెద్దవాళ్ళు, తమ్ముడిని చాలా ప్రేమతో గారాబం గా పెంచుకోచ్చారు. అ కుర్రవాడి పేరు వినయ్. కాలేజీ లో చేరాడు . ఇంజినీరింగ్ నాకొద్దు అని ఎంత చెప్పిన తల్లి తండ్రులు వినకుండా కాలేజీ లో చేర్చారు. చేరిన ఓ సంవత్సరం లో తనకి అ కాలేజీ చాలా నచ్చేసింది అందులో తనతో పాటు చదువుకుంటున్న సాయిపల్లవి అనే అమ్మాయిని ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. కానీ ధైర్యంగా ముందుకు వెళ్లి చెప్పలేకపోయాడు. తన తోటి మిత్రులందరితో ఆఖరి సంవత్సరం చాలా సంతోషం తో గడిపి degree అందుకొని ఎవరికీ వారే యమున తీరే అన్నర్లు విడిపోయారు. మంచి ఉద్యోగం లో చేరాడు తల్లి తండ్రులు అతనికి పెళ్లి చేసారు ఇద్దరు ఆడపిల్లలను కానీ భార్య గటించింది. ఒంటరిగా తన పిల్లలను ఆప్యాయతతో పెంచాడు. అనుకోకుండా తన పాట మిత్రులందరూ కలిశారు. సాయిపల్లవి ఎలా ఉండి, ఏం చేస్తుంది అనే విషయం తనని వేదిస్తుంది కానీ బయటకు చెప్పలేక పోయాడు. ఓ సంవత్సరం తరవాత పాట మిత్ర బృందం కలిశారు వినయ్ సాయిపల్లవిని చూసాడు తను చాలా సంతోషంగా ఉందని తెలుసుకున్నాడు. ఆ మిత్రబృందం లో తననే చూస్తూ ఆ రోజంతా గడిపి ఆ జ్ఞాపకాలతో మళ్ళీ ఎప్పుడు కలుస్తామనే తపన తో తన జీవితాన్ని సంతోషంగా గడిపేస్తున్నాడు. ఇవే జీవితంలో మధుర క్షణాలు 


Rate this content
Log in

Similar telugu story from Romance