ఈ రాధ కృష్ణార్పనం
ఈ రాధ కృష్ణార్పనం
మల్లెపువ్వులు పెట్టుకొని చిన్న అంచుతో పచ్చని పట్టు చీర కట్టుకొని మెడలో ఒక చిన్న బంగారు చయిన్ చేతిలో ఒక పెద్ద బ్యాగ్ పట్టుకొని బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంది రాధ
టైం పది కావొస్తోంది
కృష్ణ ఎంటి ఇంకా రాలేదు
నాకు తెలిసి ఇంట్లో వాళ్ళకి ఇప్పటికే తెలిసిపోయి ఉంటది నేను లేను అనే విషయం నాకోసం వెతుకుతూ ఉంటారు విడేంటి ఇంకా రాలేదు అని కంగారుతో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంది
మరొక పావు గంటలో బస్ కూడా బయలుదేరుతాది అని కాల్ చెయ్యాలి అని ఫోన్ బయటకి తీసింది
ఈలోగా ఎవరో వెనక నుంచి వచ్చి గట్టిగా బౌ అని అరిచారు
భయంతో గుండె ఆగెంత పని అయింది
భయం భయంగా వెనక్కి తిరిగి చూసింది
ఎదురుగా కృష్ణ
" హేయ్ ఈ అల్లరి మాత్రం తగ్గదా నీకు ఇంత లేట్ ఎంటి ? నేను ఎప్పటినుంచో నీకోసం ఎదురుచూస్తున్నాను ఆడపిల్లను నేనే రెఢీ అయిపోయాను నీకు ఇంత టైం పట్టిందా రావడానికి " అంటూ చెడ మడ తిడుతుంది
కృష్ణ :
హొ హాల్లో ఆగుతావా అంటూ
వెనక వైపు ఉన్న ఒక అమ్మాయిని ముందుకు తీసుకొని వచ్చి
నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చూపించాడు
రాధ :
నాటకాలు ఆడకు నన్ను ఏడిపించాలి అనే కదా ఇది అంతా చేస్తున్నావు నాకు తెలుసు పదా వెళ్దాం ఆలస్యం అవుతుంది బాగా బస్ కూడా వెళ్ళిపోయేలా ఉంది అంటూ చేయి పట్టుకుంది
కృష్ణ రాధ చేయి విసిరి కొట్టి
చెప్పేది నీకే అర్ధం అయిందా
నేను నీ మీద పగ తీర్చుకోవాలి అనుకున్నాను అందుకనే ఇది అంతా చేశాను
సింపుల్ అయిపోయింది అన్నాడు
రాధ :
అబద్ధాలు అన్ని నాకు తెలుసు
ఈ టైం లో ఇలా చెయ్యడం ఏం బాగోలేదు కృష్ణ వద్దు ఇక ఆపే అంటుంది కాస్త బాధగా మొఖం పెట్టీ
ఈ అమాయకత్వమే నాకు పని అయింది
ఇంత ఫాస్టుగా నన్ను నమ్మి ఇలా చేస్తావు అని అసలు అనుకోలేదు
ఎన్ని రోజులు నీ వెనక తిప్పించుకున్నావు
ఒక్క సారి మాట్లాడమంటే మాట్లాడావా లేదు అప్పుడే ఫిక్స్ అయ్యాను నిన్ను ఒంటరి దాన్ని చేసి మోసం చెయ్యాలి అని అనుకున్నది చివరికి సాధించాను అన్నాడు
రాధ :
నాకు అయినా నమ్మాలి అని లేదు
కృష్ణ :
సరే అయితే నువ్వు నీ కృష్ణ కోసం ఇక్కడే వేచి ఉండు నేను వెళ్తాను అని పక్కన ఉన్న అమ్మాయి భుజం మీద చెయ్యి వేసి వెళ్ళిపోయాడు
రాధ అలానే చూస్తుంది తిరిగి మళ్లీ వెనక్కి వచ్చి ఇది అంతా సరదాగా చెప్పను అంటాడు అని
అరగంట ఆమె అలానే చూస్తూ ఉండిపోయింది
బస్ స్టాండ్ లో అందరూ వెళ్ళిపోయారు
జోరున వర్షం పడుతుంది
ఆ వర్షంలో తడుస్తూ నడుచుకుంటూ అలా వెళ్ళిపోతుంది
ఫోన్ రింగ్ అవుతుంది బాధలో ఆమెకు రింగ్ అసలు వినిపించడం లేదు
ఈలోగా ఎదురుగా వస్తున్న వ్యక్తి ఆమెను పిలిచి ఫోన్ రింగ్ అవుతుంది అని చెప్పాడు
ఉలిక్కిపడి ఫోన్ తీసి చూసింది
" హాల్లో రాధ ! రాధ ఎక్కడ ఉన్నావు ? " మీరు ఊరు దాటేసారా అని అడుగుతుంది
రాధ గట్టిగా ఏడుస్తూ
నేను ఇక్కడే ఉన్నాను బస్ స్టాప్ లో అంటుంది
ఆమె బాధకు కారణం అడగలేదు స్నేహ
" నువ్వు అక్కడే ఉండు నేను పది నిమిషాల్లో వస్తాను " అని కాల్ పెట్టీ వెంటనే వచ్చేసింది
వచ్చిన స్నేహను గట్టిగా పట్టుకొని ఏడవడం మొదలు పెట్టింది
కార్ ఎక్కించుకొని తన రూంకి తీసుకొని వెళ్ళింది
ఏడుస్తున్న ఆమె కళ్ళను తుడుస్తూ అసలు ఏం అయింది చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది
రాధ కళ్ళు తుడుచుకొని నువ్వు వెంటనే మా అమ్మకి కాల్ చేసి నేను నీ దగ్గరే ఉన్నాను అని చెప్పు
నా ఫోన్లో చార్జింగ్ లేదు ఇద్దరం కలిసి ప్రాజెక్ట్ కి ప్రిపేర్ అవుతున్నాము అని చెప్పు అని స్నేహ రెండు చేతులు పట్టుకొని అడిగింది
దానికి ఆమె సరే నువ్వు కంగారు పడకు అంటూ ఇంటికి కాల్ చేసి చెప్పింది...
"సరే అమ్మ అయితే జాగర్త అంటూ " తల్లి కాల్ కట్ చేసింది
స్నేహ :
సరే ఇప్పుడు చెప్పు అసలు ఏం జరిగిందో అని అడిగింది
రాధ :
స్నేహ నీకు తెలుసుగా కృష్ణ నన్ను ఎంత ప్రేమించాడో
ఆ నమ్మకంతో నేను వాడిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను
ఎన్నో రోజులు జరిగిన తరవాత నమ్మకం కుదిరిన తరవాత సరే చెప్పాను
పెళ్లికి సిద్ధ పడ్డాను కానీ వాడు ఎంటెంటో మాట్లాడాడు
అంటూ బస్ స్టాప్ దగ్గర జరిగినవి అన్ని అర్థం అయ్యేలా చెప్పింది
స్నేహ :
ఈ అబ్బాయిలు అందరూ అంతే
అమ్మాయిల్ని మోసం చెయ్యడానికే చూస్తారు వాడు అంతే అనుకుంట ఇక అన్ని మర్చిపోయి అలాంటి వాడు నీ జీవితంలో ఉన్నాడు అనే విషయాన్ని కూడా మర్చిపో అని సలహా ఇచ్చింది
రాధ :
లేదు స్నేహ నాకు కృష్ణ మిద పూర్తి నమ్మకం ఉంది
ఏదో తప్పు జరిగింది
నేను ఎప్పుడూ తప్పుడు నిర్ణయం ఎప్పుడూ తీసుకోలేదు కృష్ణ విషయం కూడా అంతే
" చూడు రాధ అన్ని అన్నా తరవాత కుడా నువ్వు కృష్ణ ను నమ్ముతున్నాను అంటే నిన్ను ఏం అనాలో కూడా నాకు అర్ధం కావడం లేదు " సరే ఏం ఆలోచించకు కాస్త రెస్ట్ తీసుకో పడుక ప్రశాంతంగా రేపు ఏం చెయ్యాలో ఆలోచిద్దాం సరే నా అంటూ పడుకో బెట్టింది
రాధ పడుకుంటూ
ఆలోచనలో పడింది
అవి కాలేజ్ లో చదువుతున్న రోజులు
నా వెనక ఒక హచ్ కుక్క పిల్లలా తిరిగే వాడు చాలా సార్లు మొఖం మీదే రిజెక్ట్ చేశాను
కొన్ని సంవత్సరాల తరువాత అతని పనులకు సిన్సియారిటి కి నేను పడిపోయాను
అలా ప్రేమలో జరిగిపోతున్న రోజులు
ఇద్దరికీ ఒకటే ఆఫీస్ లో ఉద్యోగం వచ్చింది
నాకు జ్వరం వచ్చి మూడు రోజులు ఆఫీస్ కు వెళ్ళలేదు
రాత్రి నా రూంలో పడుకుని ఉన్నా ఫోన్ కూడా సరిగ్గా మాట్లాడడం లేదు ఓపిక లేక రూంలో ఒక పెద్ద కిటికీ ,
ఎవరికి కనిపించకుండా ఆ కిటికీ నుంచి ఎవరికి కనిపించకుండా లోపలికి వచ్చాడు
మంచి నిద్రలో ఉన్న నాకు కుంకుమ పెట్టాడు
అలా పెట్టడం వల్ల నాకు మెలుకువ వచ్చి చూసాను
ఎదురుగా కృష్ణ
నన్ను దగ్గరకి తీసుకొని ఇప్పుడు అంతా తగ్గిపోతుంది లే గుడికి వెళ్ళి బొట్టు తీసుకొని వచ్చాను నీకోసం అన్నాడు తన కౌగిలిలో ఉంచుకొని
నాకు ఆ కౌగిలిలోకి స్పర్శ ఇంకా గుర్తుంది అని అలా అనుకుంటూ నిద్రలోకి జారుకుంది
మరుసటి రోజు ఉదయం
రాధను లేపి రెఢీ అవ్వు అని చెప్తుంది స్నేహ
చాలా బద్దకంగా పైకి లేచి జరిగినది అంతా నా పిడ కల అయితే ఎంత బాగుండునో అనుకుంటుంది
స్నేహ :
పదా త్వరగా రెఢీ అవ్వు ఆఫీస్ కు వెళ్దాం అని తొందర పెడుతుంది
రాధ :
హా సరే అంటూ అటు ఏడవలేక ఏమి చెయ్యలేక తయారు అయ్యి ఆఫీస్ కు బయలుదేరింది
ఆమె ఆఫీస్ లోపలికి వెళ్తుంటే
కృష్ణ బయటకి వచ్చేస్తున్నాడు
ఆమెను చూసి చూడనట్టు వెళ్ళిపోయాడు
లోపలికి వెళ్ళే సరికి అందరూ మాట్లాడుకుంటున్నారు
" ఎంటి ఇంత సడెన్ గా తను జాబ్ మానేశాడు అసలు ఏం అయింది " అనే మాటలు వినిపించాయి
వెంటనే స్నేహ దగ్గరకి వెళ్లి ఎంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని కంగారుగా అడుగుతుంది
స్నేహ :
ష్ నువ్వు కంగారు పడకు నేను కనుక్కొని వస్తాను అని లోపలికి వెళ్ళింది
లోపలికి వెళ్ళి ఏం జరిగిందో అంతా తెలుసుకోని వచ్చింది
" రాధ కృష్ణ జాబ్ మానేశాడు అంట , త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు అంట " మనం ఏదోకటి ఆలోచిద్దాం పదా అంటూ లోపలికి తీసుకొని వెళ్ళింది
ఇద్దరు కూర్చుని ఆలోచిస్తున్నారు
రాధ :
స్నేహ నాకు ఒక హెల్ప్ కావాలి
కృష్ణ ఇంకా తన డెస్క్ క్లియర్ చెయ్యలేదు నేను వేతుకుతాను ఏం అయినా దొరకవచ్చు నువ్వు ఎవరైన వస్తున్నారు అంటే నాకు వెంటనే కాల్ చేయి అని చెప్పి కృష్ణ డెస్క్ దగ్గరకి వెళ్లి వెతకడం మొదలు పెట్టింది
అక్కడ ఏమి లేవు కానీ ఒక మెడికల్ డాక్టర్ రిపోర్ట్ కనిపించిది
ఓపెన్ చేస్తుంటే స్నేహ ఎవరో వస్తున్నారు అని చెప్పింది
వెంటనే దానిలో ఏం ఉంది అనేది ఫోటో తీసి వెంటనే వెనక నుంచి బయటకు వచ్చేసింది
ఈలోగా కృష్ణ వచ్చి అన్ని సద్దుకోని బయటకి వెళ్ళిపోయాడు
ఆమె వెంటనే స్నేహ దగ్గరకి వెళ్లి రిపోర్ట్స్ చూపించింది
ఇద్దరు కలిసి ఆ రిపోర్ట్స్ తనకు తెలిసిన ఒక డాక్టర్ కి పంపించారు
కొద్ది సేపటికి ఆ డాక్టర్ కాల్ చేశారు
" హాల్లో ! ఇప్పుడే రిపోర్ట్స్ చూసాను సమస్య అయితే కాస్త ఎక్కువగానే ఉంది , ఆ వ్యక్తికి బ్లడ్ క్యాన్సర్ ఉంది అది లాస్ట్ స్టేజ్ లో ఉంది సో మెడిసిన్ వల్ల కానీ కిమో వల్ల కానీ నయం అవ్వదు ఉన్ననాళ్లు కాస్త సంతోషంగా చూసుకోండి " అని చెప్పి కాల్ కట్ చేశారు డాక్టర్
రాధ స్నేహ ను గట్టిగా పట్టుకొని ఏడవడం మొదలు పెట్టింది
" నేను చెప్పాను కదా వాడు నన్ను మోసం చెయ్యడు అని , ఇలా అవుతుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు నేను వెంటనే తనని కలవాలి " అని చెప్పి బయటకి పరుగు తీసింది
వెంటనే కృష్ణ ఉన్న అపార్ట్మెంట్ దగ్గరకి వెళ్లి కనుక్కుంది
" కృష్ణ గారు ఫ్లాట్ కాలి చేసి ఇప్పుడే వెళ్ళిపోయారు " అని చెప్పాడు సెక్యూరిటీ
" ఎక్కడికి వెళ్ళేది అని ఏం అయినా చెప్పాడా ? " అని అడిగింది రాధ
లేదమ్మా అని సమాధానం ఇచ్చాడు ఆ సెక్యూరిటీ
ఇప్పుడు ఏం చెయ్యాలి నేను ఎవరిని అడగాలి అని అనుకుంటూ కృష్ణ బెస్ట్ ఫ్రెండ్ స్వామి కి కాల్ చేసింది
" హాల్లో స్వామి నేను రాధను అది కృష్ణ ఎక్కడ ఉన్నాడు అని నీకు ఏం అయినా తెలుసా ?"
స్వామీ :
హా రాధ వాడు నేపాల్ వెళ్ళాడు ఇప్పుడు ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నాడు నువ్వు ఫాస్ట్ గా వెళ్తే క్యాచ్ చెయ్యగలవు అని చెప్పడంతో రాధ పరుగున ఏర్పోట్ కు వెళ్లాను లోపలికి వెళ్ళేసరికి
అప్పుడే ఫ్లైట్ బయలుదేరింది అని అనౌన్స్మెంట్ వినిపించింది
అక్కడే కూర్చుని బోరున ఏడవాలి అనిపించింది కానీ అక్కడ చాలా మంది ఉన్నారు
ఏడుపును ఆపుకుంటుంది
గొంతు నొప్పోస్తుంది తల భారంగా అనిపిస్తుంది
వొళ్ళు సహకరించడం లేదు తులుతుంది ఈలోగా స్నేహ ఒక కేక వేసింది రాధ అంటూ
రాధ పరుగున స్నేహ దగ్గరకి వెళ్లి జరిగింది అంతా చెప్పింది
ఇద్దరు కలిసి మళ్ళీ స్వామి కి కాల్ చేశారు
" హా స్వామి కృష్ణ వెళ్ళిపోయాడు , నీకు తను నేపాల్ లో ఎక్కడకి వెళ్తున్నాను అని ఏం అయినా చెప్పాడా ? "
స్వామీ :
లేదు రాధ వాడు నాకు ఏం చెప్పలేదు
అంతే కాకుండా వెళ్ళే ముందు కొత్త నంబర్ కూడా తీసుకున్నాడు ఆ నంబర్ నాకు కూడా చెప్పలేదు
అసలు ఏం జరిగింది అని అడిగాడు
రాధ :
అది ఏం లేదు నేను నీకు మళ్ళీ కాల్ చేసి చెప్తాను అన్ని అని చెప్పి ఫోన్ కట్ చేసింది
స్నేహ :
రాధ నువ్వు ఏం కంగారు పడకు
నాకు నేపాల్ లో ఒక ఫ్రెండ్ తెలుసు తను నీకు హెల్ప్ చేస్తుంది అని అనడంతో
ఆనందంగా ఈరోజే మా ఇంట్లో వాళ్ళకి అంతా చెప్పి నేను బయలుదేరతారు అని చెప్పి ఇంటికి బయలుదేరింది
రాత్రి తొమ్మిది అయింది
అందరూ భోజనం చెయ్యాలి అని టేబుల్ దగ్గర కూర్చున్నారు
నేను మీతో ఒక విషయం అని మొదలు పెట్టింది
నేను ఒక్క అబ్బాయిని ప్రేమించాను చిన్నప్పటినుంచి ఇప్పటివరకు నేను అడిగినవి అడగనివి కూడా మీరు నాకు ఇస్తు వచ్చారు కానీ మీ ప్రేమ తరవాత నాకు మీరు చూపించినంత ప్రేమను కృష్ణ చూపించాడు
అతనికి ఇప్పుడు నా అవసరం వచ్చింది
తనకి వంట్లో బాగోలేదు నేను తన దగ్గరకి వెళ్ళాలి అనుకుంటున్నాను దయచేసి మీరు నా ఈ నిర్ణయాన్ని గౌరవిస్తారు అని నమ్ముతున్నాను అని అనడంతో తల్లి తండ్రి ఒకరి మొఖం ఒకరు చూసుకుంటూ
నీ నిర్ణయం ఏమైన దానిని మేము గౌరవిస్తాము అమ్మ
అది కాకుండా మాది లవ్ మారేజ్ ఆ మాత్రం అర్థం చేసుకొమా ఎంటి అంటూ తనకి దైర్యం చెప్పారు నేపాల్ వెళ్లడానికి సిద్దం చేసారు కూడా
సుమారు రెండు నెలల తరవాత
ఒక కొండ మీద కూర్చుని పక్కన ఒక ఫోటో పెట్టుకొని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు కృష్ణ
ఎవరో వచ్చి కళ్ళు మూసారు
" హేయ్ రాధా అని ఆనందంగా అన్నాడు , ఛీ రాధ అంటున్నాను ఎంటి అనుకొని ఎవరు మీరు అని " చేతులు విడిపిస్తు అడుగుతున్నాడు
వెనక్కి తిరిగి చూసేసరికి నిజంగానే రాధ కనిపించింది
అంతా నా భ్రమ అనుకుంటా
" ఎంటి నేను నిజంగానే వచ్చాను "
కృష్ణ :
ఎంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు
ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా
నేను ఆ అమ్మాయి పెళ్ళి చేసుకుందాం ఇక్కడికి వచ్చాము నువ్వు వదిలేస్తే మేము హ్యాపీగా పెళ్లి చేసుకుంటాము అన్నాడు
ఆ మాటకి లాగి ఒకటి కొట్టి గట్టిగా కౌగిలించుకుంది
చాలు ఇక అబద్ధాలు చెప్పకు వినే ఓపిక కూడా నాలో లేదు అని అనడంతో కౌగిలిలో ఉన్న కృష్ణ ఏం మాట్లాడలేదు
కాసేపటికి ఆమెను వెనక్కి నెట్టి
" ఇక చాలు నన్ను ఇలా బ్రతకనివ్వు వదిలే నన్ను " అని అరిచాడు
రాధ ఏడుస్తూ
చూడు కృష్ణ చావైన బ్రర్తుకైన నీతోనే అని వచ్చేసాను
నాకు అంతా తెలుసు నువ్వు ఇక నట్టించనవసరం లేదు
కృష్ణ :
నా చావు ఏదో నన్ను చావనివ్వు నువ్వు బాగుండాలి పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి రాధ నువ్వు
దేవుడు నాకు ఇదే రాశాడు
నువ్వు వెళ్ళిపో రాధ అని బాధ పడుతూ ఆమెతో చెప్తుంటే
రాధ కృష్ణ ముందు ఒక తాళి చూపించింది
నువ్వు ఇది నా మెడలో కట్టకపోతే నేను ఇక్కడి నుంచి దుకేస్తాను నీకు నా గురించి బాగా తెలుసు కృష్ణ దుకేస్తాను అంటూ వెనక్కి వెనక్కి వెళ్తుంది
కృష్ణ ఆమెను ముందుకు లాగి
" ఇది నా కల నిన్ను పెళ్లి చేసుకొని పిల్లల్ని కని సంతోషంగా జీవించాలి " అని అంటూ నువ్వు ఇలా చచ్చిపోతాను అంటే నేను చూస్తూ ఉండలేను అంటూ ఆమె మెడలో తాళి కట్టాడు
వాళ్ళు ఇద్దరు అక్కడే నేపాల్ లో కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు
సంతోషంగా జీవిస్తున్నారు అలా మూడు సంవత్సరాలు గడిచిపోయాయి
ఒక రోజు డాక్టర్ దగ్గరకి తీసుకొని వెళ్ళింది రాధ
" చాలా రికవర్ అయింది మీ హెలత్ కొన్ని రోజుల్లో మొత్తం తగిపోవచ్చు అంటూ కొన్ని టాబ్లెట్స్ రాసి " ఇచ్చాడు డాక్టర్
ఇంటికి వెళ్ళారు ఇద్దరు
కృష్ణ రాధ చేతులు పట్టుకొని
" ఇలాంటి ప్రమాదకరమైన జబ్బు వచ్చింది అని తెలిసిన తరవాత నీ జీవితాన్ని నాశనం చెయ్యడం ఇష్టం లేక నీతో అబద్ధాలు చెప్పి ఇక్కడికి వచ్చేసాను నువ్వు అయినా సంతోషంగా జీవిస్తావు అని కానీ నీతో పెళ్లి జరిగిన తరవాత నీ ప్రేమ నా జబ్బుని కూడా దూరం చేసింది " అంటూ ఆమెను దగ్గరకి తీసుకున్నాడు
రాధ కృష్ణ కౌగిలిలో ఉండి
" ఈ రాధ ఎప్పటికీ కృష్ణార్పణం " అని చెప్పింది
నీతి :
బాధలో ఉన్న వారితో ప్రేమతో నాలుగు మాటలు మాట్లాడితే చాలు వారు తమ బాధలను మర్చిపోతారు అలాగే ప్రమాదకరమైన జబ్బుతో బాధ పడుతున్న వారికి మనం దగ్గరగా ఉంటూ వారిని జాగర్తగా చూసుకుంటు
ప్రేమను పంచితే వారు కూడా కొల్కుంటారు అని శాస్త్రీయంగా నిరూపణ కూడా అయింది
అందరితో ప్రేమగా ఉండండి
ప్రేమను పంచండి
ప్రేమను పొందండి
❤️❤️❤️❤️

