Smiley Rishi

Romance Classics Fantasy

4  

Smiley Rishi

Romance Classics Fantasy

ఈ మాయ చేసిందేవరే... ❤

ఈ మాయ చేసిందేవరే... ❤

4 mins
384


     

 Hyderabad, 10 : 30 pm.

          చుట్టూ ప్రశాంత వాతావరణం. దూరంగా మిలమిల మెరిసే నక్షత్రాలు. వాటిని మించిన అందంతో మరోవైపు చాలా ప్రకాశవంతంగా చందమామ ......😍

        చందమామను చూస్తూ ఉంటే ఎన్నో జ్ఞాపకాలు .ఎన్నో ఎన్నేనో గురుతులు.....రాత్రి సమయం అవుతుండటంతో వాహనాల శబ్దం కూడా తక్కువ అయిపోయింది .ఈ టైం లో ఒక మంచి కాఫీ అయితే బాగుంటుంది కదా!

        మనం అలా అనుకున్నామో లేదా మన హీరో కాఫీ కప్పు తీసుకొని బయట జరిగే అద్భుతాన్ని చూడడానికి బాల్కనీ లోకి వస్తాడు. మన హీరో పేరు కృష్ణ. ముద్దుగా అందరు కన్నయ్య అని పిలుస్తారు .

      బయట చల్లటి వాతావరణానికి పొగలు కక్కే వేడి వేడి కాఫీ షిప్ చేస్తూ బయటికి చూస్తూ ఉంటే ఏదో తెలియని ఫీలింగ్ ....

         ఇదంతా చెడగొట్టడానికి అన్నట్టు " నీ గుండె గూటిలో _____నా గుండె హాయిగా_____ తలదాచుకుందని తెలియలేదా? " అంటూ ఫోన్ రింగ్ టోన్ .

     మన కృష్ణ ......తెలుస్తుంది.......తెలుస్తుంది ఎందుకు తెలియదు? అంటూ తనలో తాను మాట్లాడుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు.

      అవతల నుంచి ఎవరో ఒక అబ్బాయి మాట్లాడుతూ ఉంటాడు .కొంచెం కంగారు పడే విషయం కావడంతో "" ఏంటి ""'అని రూం అంతా వినబడేలా గట్టిగా అరుస్తాడు కృష్ణ . నేను వెంటనే వస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేసి, ఉన్నఫలంగా టేబుల్ పైన కార్ కీస్ తీసుకొని మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న గమ్యమే లక్ష్యంగా తన కారును స్టార్ట్ చేస్తాడు .

       రాత్రి సమయం బాగా అవడంతో పెద్దగా వాహనాలు లేవు. దాంతో కొంచెం వేగం పెంచాడు. కారు వేగం నెమ్మది నెమ్మదిగా పెరిగింది .

       కొంచెం దూరం వెళ్ళిన తరువాత చుట్టూ మిణుగురు పురుగులు మెరుస్తూ దారి చూపిస్తున్నాయి. ఆకాశంలోని నక్షత్రాలు నేలకు దిగి వచ్చినట్టు అనిపిస్తుంది .నేను నీతో పాటు వస్తున్న కృష్ణ అన్నట్టు అందమైన చందమామ తన వెనుక వస్తున్నట్లు సైడ్ మిర్రర్ లో నుంచి కనిపిస్తుంది .ఆ చల్లని గాలి కారు అద్దాలు నుంచి మన కన్నయ్య కురులను ముగ్గురులుగా మార్చేస్తుంది .చల్లగా ముఖంపైన పౌడర్ అద్దుతున్నాట్టు తాగులుతూ ఉంది గాలి.

      రోడ్డుపైన ఎటువంటి వాహనాలు లేకపోవడంతో కిటికీ బయటి నుంచి చూస్తూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు కృష్ణ .

       ఇంతలోనే సడెన్ గా బ్రేక్ వేసాడు తన ప్రమేయం లేకుండా ......స్టీరింగ్ ని పట్టుకొని కొంచెం భయం భయంగా గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. అంతలోనే తేరుకొని కారు దిగి చూస్తే ఎవరో వ్యక్తి కారుకి చిన్నగా గుద్దుకొని వెనక్కి రోడ్డు పైన పడ్డాడు. చేతికి కొంచెం రక్తం కారుతున్నట్టు ఉంటుంది .

   కృష్ణ : నీకేమైనా పిచ్చి పట్టిందా? చావడానికి నా కారే దొరికిందా?

 

     నేను చవడమేంటి. నాకు బ్రతకాలని చాలా ఆశగా ఉంటే .....బైదివే నేను అభి అన్నాడు కింద పడిన వ్యక్తి.

       కృష్ణ : ఈ తొక్కలో పరిచయాలు ఇప్పుడు అవసరమా ?నాకు ముందే టైం లేదు. త్వరగా తప్పుకో అంటూనే కోపంగా తన చేయి వైపు చూస్తాడు .

        రక్తం రావడం చూసి తన కోపం చిటికెలో అలా ఎగిరిపోతుంది.

        వెంటనే తన కర్చీఫ్ తీసి వాటర్ లో తడిపి తన చేతికి కట్టు కడతాడు. తాగమని వాటర్ ఇస్తాడు.

       అభి : థాంక్స్ .....బాస్.

 కృష్ణ : ఇప్పుడేం పర్లేదు కదా. హాస్పిటల్ కి వెళ్దామా ?

     అభి : అయ్యే చిన్న దెబ్బనే.....పర్వాలేదు.

కృష్ణ : అవును ఎందుకు కారుకు అడ్డంగా వచ్చావు. ఏమంత ప్రాబ్లం?

    అభి : వెళ్లాలి అన్నవుగా బాస్. టైం అవుతుంది అన్నారు వెళ్ళాండి.

    కృష్ణ ho shit.....అని తల పట్టుకుని ఉంటాడు.

   అభి : ఇంకా లేట్ అవుతుంది అనీ అనుకోని అసలు ఎందుకు వచ్చానంటే ఈ టైంలో ఎవరు లిఫ్ట్ ఇవ్వడం లేదు . నేను ఒక టాక్సీ డ్రైవర్. సిచ్యూవేషన్ బాగా డిమాండ్ చేయడం వల్ల బీటెక్ సగం మధ్యలోనే వదిలేసి టాక్సీ తోలుతున్నా.....

    కృష్ణ : లిఫ్ట్ కోసం ఇలాన ఆపేది. అడ్డంగా వచ్చి చూసుకోకుండా గుర్తిస్తే .....

   అభి: నేను చాలా మంచి వాడినిలే బాస్ . అంత త్వరగా చావనులే బాస్ అంటూ కన్నుకొట్టాడు.

        కృష్ణ కి నవ్వొస్తుంది .........

అభి : మీరు ఏమి అనుకోకపోతే మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవచ్చా?

  కృష్ణ : అలా అలా వైజాగ్ వరకు వెళ్తున్నాను.

 అభి : అబ్బో చాలా దూరం వెళ్తున్నారు గా.....నేను కూడా అక్కడికి వెళ్లాలి. కానీ మధ్యలో కార్ ట్రాబుల్ వచ్చింది. అందులో ఒక అమ్మాయిని ఉంది .మీరు ఏమి అనుకోకపోతే ఆ అమ్మాయిని వైజాగ్లో దింపేయగాలరా? ఆ అమ్మాయి కూడా చాలా అర్జంట్ అంటా?

   కృష్ణ : నేను రాకపోతే ఏం చేసేవాడివి ?

అభి :  ఏదో ఒక కారు కింద అడ్డంపడి వాళ్లు వైజాగ్ వెళ్లకపోతే సగం మధ్యలో మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్లి తీసుకొని వచ్చేవాణ్ణి.

   కృష్ణ : తన మాటలకి ఇంత మంచి వాళ్ళు కూడా ఉంటారా అన్న ఆనందం వేస్తుంది . సరే నేను దింపేస్తాను .త్వరగా ఎక్కమను నాకు చాలా లేట్ అవుతుంది.

     అభి తన టాక్సి దగ్గరికి వెళ్లి మేడం ఇంకొక కారు ఆల్రెడీ ఉంది .మీరు వెళ్లి అక్కడ కూర్చోండి. లగేజ్ నేను పెడతాను అని చెప్పాడు.

    అప్పుడు కార్ దిగుతుంది ఆ అమ్మాయి. ఒక వైపు అమ్మాయి ఇంకో వైపు ఆ చందమామ ......

నల్లని రాత్రి ని తలదన్నేలా కళ్ళకి కాటుక.......

పొడవైన వెంట్రుకలు ........

పాలరాతి లాంటి దేహం......

రెడ్ కలర్ డ్రెస్ తో తన డ్రెస్ సరి చేసుకుంటూ నడుచుకుంటూ వచ్చి కారులో కూర్చుంటుంది .

       ఒక క్షణం కాలం ఆగిపోయినట్టు ఉంటుంది. మరుక్షణం తన కంటే అందమైన దాన్ని గుర్తు తెచ్చుకుని చిన్నగా నవ్వుకున్నాడు కన్నయ్య.

    లగేజ్ పెట్టేశాక మీరు వెళ్ళండి అని అంటాడు అభి.

   కృష్ణ : మరి నువ్వు రావచ్చు కదా.....

 అభి : నాకు ఉన్నది ఒకటే టాక్సీ.దాన్ని పోగొట్టుకుంటే మా మేనేజర్ చంపేస్తాడు .మా ఫ్రెండ్ కి కాల్ చేశాను. తను వస్తాడంట కాకపోతే కొంచెం లేట్ అవుద్ది అన్నాడు .అప్పటి వరకు ఈ వేయిటింగ్ తప్పదు.

     సరే మరి .....బాయ్ అని చెప్పి మళ్ళీ కారు స్టార్ట్ చేస్తాడు .

          కాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం . ఏంటి ఇంత సైలెంట్గా డ్రైవ్ చేస్తున్నావ్ జిత్తులమారి నక్క లాగా ఏమైనా ప్లాన్ చేస్తున్నావా అంటుంది అమ్మాయి.

       ఊహించని ఆ మాటకి ఏంటి నా మొఖం అలా ఉందా ? అని ఆశ్చర్యంగా అడుగుతాడు కృష్ణ .

       నీ ముఖానికి ఏం తక్కువ కాదులే....హీరోలా ఉన్నావ్ .

     కృష్ణ : మంచిది చాలా మంచిది ......

    అమ్మాయి గల గల నవ్వేస్తుంది .నా పేరు కావ్య మరి నీ పేరేంటి ?

 నా పేరు కృష్ణ ......

    కావ్య : ఇంత అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తున్నారు?

 కృష్ణ : హైదరాబాద్ ......ఏదో చెప్పాలంటే చెప్తాడు .

  కావ్య : అదేంటి వైజాగ్ అని చెప్పారు .ఆపండి నేను దిగిపోతాను అంటూ డోర్ పట్టుకొని ఓపెన్ చేయబోతుంది టేషన్ లో....

  కృష్ణ : హే...ఆగు.....మరి ఇటు సైడ్ వెలితే వైజాగే వచ్చేది .....అమీర్ పేట్ కాదు. నువ్వు నీ పిచ్చి ప్రశ్నలు .

 కావ్య : సరేలే అని బుంగ మూతి పెట్టుకొని కూర్చుంటుంది .

          ఈ గొడవ కారణంగా తన మనస్తత్వం ఏంటో అర్థమైంది.....మంచోడే ఇక నాకేం భయం లేదు అని మనసులో అనుకొని అలా అలా చల్లగాలికి తనకు తెలియకుండా నిద్రపోతుంది .

          కృష్ణ తన వైపు చూసి.....పడుకుంది అనుకుంటా అనీ తను కారు నడవడం పైన దృష్టి పెడతాడు.

        చూసినంత దూరం రోడ్డుకు ఇరువైపులా చెట్లు .పైగా అర్ధరాత్రి రోడ్డుపైన ఒకటి రెండు వాహనాలు తప్ప పెద్దగా ఏమీ లేవు .సిటీలో ఉండి ఉండి అన్ని ,వాహనాల మధ్య కాలము గడిచిపోయిన తర్వాత ఎవరో రాసినట్టుగా ఆ క్షణం ఎంత బాగుందో అనుకుంటూ ఆస్వాదిస్తూ ఉన్నాడు .

        వెంటనే తన ముఖం పైన ఏదో తెలియని చిరునవ్వు .గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి .నేను నీ దగ్గరికి వచ్చేశాను పొట్టి .....ఇకపై నువ్వు నాకు మాత్రమే సొంతం అనుకంటూ ఆలోచిస్తున్నాడు.

________𝚃𝙾 𝙱𝙴 𝙲𝙾𝙽𝚃𝙸𝙽𝚄𝙴𝙳________

( ఏవైనా అక్షర దోషాలు ఉంటే క్షమించండి .)

• ఇది నేను రాసే కొత్త సిరీస్ .ఒక ప్యూర్ రియల్ లవ్ స్టోరీ .

• Every Thursday upload చేస్తాను.

• చూద్దాం మరి ......వీళ్ళిద్దరి ప్రయాణం ఎక్కడికి చేరుతుందో....!

• Hope you like it



Rate this content
Log in

Similar telugu story from Romance