Maha Kailash

Romance Classics Fantasy

4  

Maha Kailash

Romance Classics Fantasy

ఈ మాయ చేసిందేవరే—02

ఈ మాయ చేసిందేవరే—02

5 mins
245


   

        ఈ మాయ చేసిందెవరే — 02

    

    ( దయచేసి ముందు భాగాన్ని చదవండి ) 


    


      బాగా నిద్ర పోతుంది. ఏం పని చేసిందో ఏమో అని తన ఆలోచనల్లో మళ్ళీ మునిగిపోతాడు. ఒక క్షణంలో తేరుకొని మళ్లీ డ్రైవింగ్ లో మునిగిపోతాడు.


    ఆ అర్ధరాత్రి వాళ్ళ కారు రెండు హెడ్లైట్లా వెలుతురులో వేళుతూవుంటే ఎదో తేలియనీ మైకం .


     ఆ రోడ్డుపైన అంత ప్రశాంతమైన ప్రయాణం కారణంగా కృష్ణకు కూడా నిద్ర వస్తుంది .కానీ ఇప్పుడు పడుకుంటే ఇక జీవితాంతం నిద్రలేని రాత్రులు గడిపాలి అనుకుంటూ కొంచెం దూరంలో ఏదో డాబాలాంటిది కనిపిస్తూ ఉంటుంది. 


     అది ఇంకా తెరిచే ఉండటంతో " థాంక్స్ గాడ్ " అనుకుంటూ కారు పక్కకు ఆపాడు . స్టీరింగ్ పైన చేతులు పెట్టి తన నడుముకు ఉన్న సీట్ బెల్ట్ ని తీస్తాడు .


    కావ్య ఇంకా నిద్రపోతూనే ఉండటంతో లేపుదామా ......వద్దా ? అనే సందిగ్ధంలో ఉండిపోతాడు . కొంచెం ధైర్యం చేసుకుని తన భుజంపైన కావ్య.......కావ్య అంటూ తట్టిలేపుతాడు. 


   కావ్య చిన్నగా కన్నులను నలుపుతూ " ఏంటి అప్పుడే తెల్లారిందా ? మనం వచ్చేసామా? అంటూ ఆశ్చర్యంగా అడిగింది .


  కృష్ణ : అవును వచ్చేసాము. అటు చూడు అని చెప్తాడు. 


 కావ్య : బయటకు ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి ఒక డాబా తప్ప ఇంకా ఏమీ లేదు? 


కృష్ణ : నిన్న రాత్రి హూద్ హూద్ వచ్చి మొత్తం కొట్టుకుపోయింది .ఇంకా ఆ డాబా అలాగే ఉంది. దాన్ని చూడడానికే చాలా మంది వస్తున్నారు. నేను కూడా అందుకే వచ్చాను. నీకు తెలియదా? పాపం......


 కావ్య : ఏంటి నువ్వు చెప్పేది నిజమా ...? అనీ రెండు కన్నులు పెద్దవి చేసి చూస్తుంది. 


  కృష్ణ : మరి లేకపోతే లేదు....ఒక్కన్నే అంత దూరం నుంచి డ్రైవ్ చేస్తూ వచ్చాను. నిద్ర వస్తుంది ..... సో మొఖం కడుక్కుని ఏదైనా తిందామని ఇక్కడ ఆపాను.


  కావ్య : ఓహో ......


 కృష్ణ : నాకు బాగా ఆకలేస్తుంది .త్వరగా తినాలి ....నీకు కావాలా ?


  కావ్య : నాకేమి అక్కర్లేదు .నేను బయటకు వెళితే అస్సలు తినను .


  కృష్ణ : ఓ అవునా ....సరే నేను తింటా అంటూ వెళ్ళిపోతాడు. 


  కావ్య : కార్లో కోపంగా చేతులు కట్టుకొని '" ఏంటి .... ఈ మనిషి తినాను అంటే వెళ్ళిపోతాడు. '"అనుకుంటూ...! 


  కృష్ణ : బాటిల్ లోని నీళ్లాను తన ముఖం పైన చాల్లుకుంటాడు .ఇంకా చేతులు కడుక్కొని టేబుల్ దగ్గర కూర్చుని, ఆర్డర్ చెప్పడానికి ఒకరిని పిలుస్తాడు .


    అక్కడి నుండి ఒక అబ్బాయి గ్లాసులో వాటర్ తీసుకొని కృష్ణ టేబుల్ పైన పెట్టి "" ఏం కావాలి అన్నా ...""అని అడుగుతాడు .


     కృష్ణ: వేడివేడిగా ఏమున్నాయి? 


 వెయిటర్ : ఇందాకటి దాకా చాలా ఉన్నాయి అన్న.... ఇప్పుడు మాత్రం రెండు ఐటమ్స్ మిగిలినాయి. ఇడ్లీ ......దోశ


 కృష్ణ : అవునా మేమే లేట్ చేస్తామా? అని కన్ను కొట్టాడు. సరే వెళ్లి ఒక ప్లేట్ దోశ తీసుకొని రా. 


   సరే అన్నా...... అనీ తీసుకురావడానికి వెళ్తాడు.  


   కార్ లో ఉన్న కావ్య బయటకు వస్తుంది. అలాగే చూస్తూ ఉంటుంది .మన కన్నయ్య రాకపోయేసరికి ఇంకా కోపం వచ్చేసి బయట చేతులు కడుక్కోనీ కృష్ణ టేబుల్ దగ్గరకు  వెళుతుంది . 


  వేయిటర్ అలా టేబుల్ పైన పెట్టగానే  కావ్య లాక్కొని తింటుంది .


  కృష్ణ : ఏంటి .....అది నా ప్లేట్ .


 కావ్య : నీ పేరు ఏమైనా ఉందా దీనిపైనా? 


  కృష్ణ :అయినా నువ్వు తినాను అన్నావ్ కదా? మళ్లీ ఏంటి ...నాది లాక్కున్నావు. 


  కావ్య : అమ్మాయిలం....బాబు .ఎన్నైనా చెప్తాము. కానీ ఆకలికి అస్సలు తట్టుకోలేము. 


  కృష్ణ : నవ్వుకుంటూ.....వేయిటర్ వెళ్లి ఇంకో ప్లేట్ తీసికొని రా అనీ చెప్తాడు .


  కావ్య : ఏంటి నువ్వు తిన్నావా? 


  కృష్ణ ; ఇప్పుడు చెప్పింది నాకే .....


  కావ్య : అది నాకు సరిపోదు ....నువ్వు ఇంకోకటి చూసుకో ......


  కృష్ణ : నవ్వొస్తుంటే ఆపుకుంటూ.....వేయిటర్ ఇంకా రెండు ప్లేట్స్ దోశ తీసుకురా అని చెప్పాడు. 

అంత ఆకలేస్తే ఎందుకు నీకు అంత టెక్కు? రావచ్చుగా ....!


  కావ్య : తినడానికి ఒక్కసారి లేట్ కావచ్చు .కానీ రావడం మాత్రం పక్క. అని పవర్ స్టార్ లాగా చెబుతుంది .


   ఇంతలో వెయిటర్ తీసుకొని వస్తే నవ్వుకుంటూ తింటారు. 


మళ్లీ వాళ్ల ప్రయాణం మొదలవుతుంది...... 


=============================


  వైజాగ్ ......

తెల్లవారుజామున 4 గంటలకీ .....



  చీకటికి బద్దకం వేసి వెళుతుంటే ,చందమామ మరో వైపు నేను కూడా వెళ్తున్నా అన్నట్టు మాయమవుతుంది . ఆకాశంలో ఉన్న కొన్నివేల నక్షత్రాలు నేల పైకొచ్చీ పడ్డట్టుగా ఒక ఇంటి పైన డెకరేషన్ లైట్స్ వెలుగుతూ ఉన్నాయి .ఒకే రకం కాకుండా మిలమిలా మెరుస్తూ కళ్ళని అబ్బురపరుస్తున్నాయి. 



    ఇంటి ముందు పందిరి అప్పుడే తెచ్చినా అరటి కోమ్మలు ,టెంకాయ పట్టలు....చూడటానికి పచ్చదనంతో నిండి పోయింది .ఆ పందిరికి ఇంకొంచెం అందం జోడిద్దాం అనీ మున్న పూల తోరణాలు కడుతున్నాడు .


     అదే సమయానికి కొంచెం తొందర పడుతూ శ్రీనివాస్ గారు అటుగా వస్తారు .కళ్ళలో ఒక చిన్నపాటి టెన్షన్ ......సమయానికి పనులన్నీ అవుతాయా లేదా అనీ? 


  శ్రీనివాస్ : రేయ్.......మున్న ఇక్కడ ఏం చేస్తావు కానీ వెళ్లి అక్కడ నీళ్లు పట్టుపో.....


  మున్న : మీరు ఎందుకు నాన్న అంత టెన్షన్ పడతారు. అన్ని సమయానికి అవుతాయి లే? 


  శ్రీనివాస్ : ఏమో రా.....పనులన్నీ చూసుకోవాలి  కాదా? నేనే ఇది కడతాను కానీ నువ్వు వెళ్ళు


  మున్న : సరే నాన్న. నీ ఇష్టం అంటూ త్వరగా లోపలికి వెళ్ళి పోతాడు. 


   లోపల గదిలో చాలామంది సందడి చేస్తూ ఉంటారు .అది చూడటానికి రాత్రిలా లేదు. ఏదో పండగలా ఉంది .


     ఎందుకు ఉండదు .....మరి.


   శ్రీనివాస్ గారాలపట్టి పెళ్లి కదా! ఇంతకీ ఆ గారాలపట్టి పేరు ఏంటో తెలుసా? తన పేరు రాధా ఏం చేస్తుందో చూద్దాం పైకి వెళ్లి .....



    తలుపులకు ఇరువైపుల వేలాడుతూ పూల తోరణాలు ....పండ్లు ఒక వైపు.....తలంబ్రాలు, పూలు పెళ్లికీ కావలసిన అన్ని వస్తువులను మరోవైపు ఉన్నాయి .


    ఒక పెద్ద అద్దం ముందు కళ్ళకు కాటుక , చెవుల బుట్టాలు .....నుదిటిన సింధూరం...తలపైన పాపిడిబిళ్ళ ....మెడలో ముత్యాల హారం.... కాళ్లకు పారాణి...చిలకపచ్చ కలర్ చీరతో......ఏడు వారాల నగలతో.... ముట్టుకుంటే కందిపోయే అందం. చూడటానికి రెండు కళ్ళు సరిపోవు . ఏ భావాన్నైనా కళ్ళతో చెప్పగల వైనం.....


    బాపు బొమ్మలా ఉన్న రాధనీ వాళ్ల అమ్మగారు లక్ష్మి , రాధ ఫ్రెండ్ అను ఇద్దరు  కలిసి రెడీ చేస్తున్నారు. 


  లక్ష్మిగారు : అమ్మా.....అను.పనిలో పడి మర్చిపోయాను నేను. కొంచెం బయటకు వెళ్లి ముగ్గు వెయ్యి .....


   రాధ : తను తినమంటే బాగా తింటుంది అమ్మ. ముగ్గు అంటే చాలా కష్టం అంటూ ఒంటిపైన నగలను సవరించుకుంటూ చెబుతోంది. 



  అను: ఏంటే ఏమన్నావ్ .....అని రెండు కళ్ళు పెద్దవి చేసుకుని నెత్తి పైన ఒకటి ఇస్తుంది.మన రాధా కి .....


  రాధ : పంది అని కోనుక్కుంటూ తలపైన చేతితో రుద్దుకుంటూ ఉంటుంది .


  లక్ష్మి : ఎందుకే దాంతో పెట్టుకుంటావు నువ్వు. మీ ఇద్దరు కొట్టుకోకుండా ఒక్కరోజు కూడా ఉండరు కదా అని చిన్నగా నవ్వుకుంటూ బయటికి వెళ్లడానికి డోర్ వైపు వెళ్తుంది .


  అను : ఆంటీ చూడు నా టాలెంట్ అంతా ముగ్గులో చూపిస్తా అంటూ కొంచెం గట్టిగా తలుపు వైపు చూస్తూ అరుస్తుంది .


 లక్ష్మీ గారు చిన్నగా నవ్వుకుంటూ బయటికి వెళ్లి పోతారు. అను కూడా వెళుతూ ఉంటే....


  రాధ : ఏంటి వట్టిచేతులతో వెళ్తున్నావ్ ?


 అను : ముగ్గు వేయడానికి వెళ్తున్న .....ఏదో అది పెద్ద ఇంపార్టెంట్ వర్క్ ఐనట్టు కొంచెం కాన్ఫిడెంట్ గా చెప్తుంది .


  రాధా : ఎలా వేస్తావే .....ముగ్గు.పెన్నుతో వేస్తావా అంటూ నవ్వుతుంది. 


  అను చేతిలో ఉన్న చాక్పీస్ చూపిస్తుంది. 


రాధ : అమ్మో యుద్ధానికి పెద్ద వేపనే దొరికిందిగా నీకు అంటూ నవ్వుతుంది .


 అను : ఎందుకే అంత నవ్వు .....అని కొంచెం నిరాశ గా చూస్తుంది .


  రాధ: ముగ్గు చాక్ పీస్ తో కాదు....వెళ్లి ఆ ముగ్గు పిండితో వెయ్యిపో అంటూ ముగ్గుపిండి వైపు చూపిస్తుంది .


  అను : ఏంటే పిండితోన నాకు రాదు. 


రాధ : అదే కదా నేను చెప్పింది అని తన వెంట్రుకల్ని సరి చేసుకుంటుంది .అద్దంలో చూసుకుంటూ ....


  అను : నువ్వు రాదు అన్నందున్న  నేను ఎలాగోలా వేసే తీరతాను అంటూ పంతంతో ఆ ముగ్గు పిండిని తీసుకొని బయటకి నడుస్తుంది. వెళ్లేటప్పుడు కోపంగా దడేలుమని డోర్ దగ్గరకు వేసి వెళుతుంది .



    అను వెళ్ళటం తోనే ఆ గదిలో నిశ్శబ్దం నెలకొంది .అప్పుడు అద్దంలోకి తన ప్రతిబింబాన్ని చూసుకుంది రాధ. అప్పటిదాకా ముఖం పైన రాసుకున్న నవ్వు కాస్తా పువ్వుల వాడి పోయింది. 


     గుండెల్లో తన్నుకొస్తున్న బాధ కళ్ళల్లో ప్రతిఘటించింది .తన శరీరంపైనా తన అందాన్ని రెట్టింపు చేసేవి ఎన్ని ఉన్నా తన మనసులోని ఆ బాధ మాత్రం వాటన్నిటినీ తీసి పక్కన పెట్టేసింది. తనకు తెలియకుండానే ఆ బాధలోని శక్తి కన్నీళ్ళుగా కంటిలో నిండిపోయింది .


   ఒక్కో చుక్క తన కంటినుండి జారి తన చేతి పైన పెడుతుంటే తన గొంతు మూగ పోయింది. 


    నీతో ఉన్న ఆ ప్రపంచాన్ని మరువలేను. ఇంకొకరితో ఈ ప్రపంచంలో బతకలేను. నా మనసులోని చీకటిలో ఇంకా గతన్నే చూస్తూన్న...నీ జ్ఞాపకాల వెంట పరుగులు తీస్తునే ఉన్నా..... తీరం చేరని ఆశలతో తిరిగి వస్తావని ఎదురు చూస్తున్నా ...అంటూ అద్దంలో తన ప్రతిమ తనను గతం లోకి తీసుకుని వెళ్ళింది...!



_______ 𝚃𝙾 𝙱𝙴 𝙲𝙾𝙽𝚃𝙸𝙽𝚄𝙴𝙳 __________



బాధలో ఉన్న మన రాధ గతం ఏమిటి ...?


తన నిరీక్షణ ఎవరికోసం....?


ఈ ప్రయాణం ఎవరిని ఎటు మలుపు తిప్పుతుందో చూద్దాం....? 




Rate this content
Log in

Similar telugu story from Romance