STORYMIRROR

Narra Pandu

Romance Fantasy Others

4  

Narra Pandu

Romance Fantasy Others

గాయపడిన మనస్సు

గాయపడిన మనస్సు

1 min
552

మనిషికి నచ్చింది మనది కాదు...

మనస్సుకి నచ్చింది కూడా మనది కాదు...

మనస్సులో ఉన్నది మనతో ఉండదు...

మనతో ఉన్నది మనస్సులో ఉండదు...

మన మనస్సే మనది కానప్పుడు...

మనం మనిషిని నిందించడం తప్పు...

మనస్సు మనస్సులో లేనప్పుడు...

మన మనస్సుని భాధపెట్టడం కూడా తప్పు...

మనస్సు మంచి మనస్సున్న వారినే కోరుకుంటుంది...

కానీ, మనుషులను కాదు...

నా దేహం నా దగ్గర లేనప్పుడు

నా మనస్సు నన్ను ఓదారుస్తుంది...

కానీ,

నా మనస్సు నాది కానప్పుడు...

నా దేహం నన్ను ఓదార్చదు...

దేహం దేదీప్యమానంగా ఉండాలన్న

మనస్సుకి మంచి మనస్సే తోడుండాలి...

మనస్సుకి నచ్చిన మనిషి తోడు లేనప్పుడు

నా దేహంతో నాకు పని లేదు.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Romance