STORYMIRROR

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Inspirational Others

4  

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Inspirational Others

ఎదురుచూపు....

ఎదురుచూపు....

1 min
269

సంపాదించి ఖర్చు పెట్టుకోవడం మంచి భావన.దాన్ని అర్థవంతంగా ఖర్చు పెట్టగలగడం ఓ కళ.అలా ఖర్చు పెట్టగలిగినపుడు పొందే ఆనందం కొన్ని రెట్లు అవుతుంది.అలా చేయగలిగేది అమ్మల తరం వరకూ మాత్రమే!ఎక్కడో వీడియో చూసేను ఇంకో పదిహేను ఏళ్లలో పద్దతి అంటే తెలిసిన ఓ తరం అంతరించిపోతున్నది అని..అంతరించక ముందు అని చెప్పుకుంటే...ఎదురుచూపుల్లో ఎన్ని రకాలో!?


నిజనే మరి...సంక్రాంతి పండక్కి మాత్రమే కొత్తబట్టలకై ఎదురుచూపు

అదేవసమయంలో రకాల తీపి వంటకాలకై ఎదురుచూపు

కొనేవాళ్లకోసం సున్నపు బండాడు ఎదురుచూపు

అది కొనేస్తే,మమ్మల్ని పనికి ఎప్పుడు పిలుస్తారా అని పాలికాపుల ఎదురుచూపు

పెళ్లంతో సహా తీసుకెళ్లడానికి బామ్మర్దిగాడు ఎపుడొస్తాడా అని బావ ఎదురుచూపు

నవ్వారు నేయని,దుప్పటి సద్దిన పట్టెమంచం బావకై ఎదురుచూపు

బజ్జీ బూరెల్లో రాళ్లు ఎపుడు పెడదామా అని మరదళ్ల ఎదురుచూపు

జీడిపప్పుల విందుకై పందెంకోళ్ల ఎదురుచూపు

ఓడినకోడిని పులుసు వండడానికి నెగ్గినోడి ఎదురుచూపు

గోదారోళ్ళ కోడిపందేలకు రాష్ట్రం మొత్తం ఎదురుచూపు

కొత్తల్లుడుకు నలుగుపెట్టి నాలుగుర్రాళ్ళు వెనకేయడానికి నాయీ ఎదురుచూపు

పండుగ అంటే సాధ్యమయినంత సందడని సినిమాల ఎదురుచూపు

ఈళ్ళు బయటే తిరుగుతారు,ఇంట్లోకి వెళ్ళగొట్టడానికి చలిగాలి ఎదురుచూపు

పండుగ వచ్చినపుడు కొంచెం జాగ్రత్తగా ఖర్చుపెట్టాలని అమ్మ ఎదురుచూపు

వచ్చిన చుట్టాలు తొందరగా వెళ్లిపోతారని దిగాలుపడిన ఎదురుచూపు

మళ్ళీ పండక్కి ఇక్కడ ఉండమూ అని సంతోషాల ఎదురుచూపు

నేను వస్తూనే ఉంటాను,మీరే పలకరించడం లేదని పండుగ ఎదురుచూపు

నన్ను ముంచేసేరు,మళ్ళీ సంపాదనలో పడాలని నాన్న ఎదురుచూపు

వీళ్లంతా ఒకచోట ఉంటే నేను భలే ఉన్నానే,మళ్ళీ పండగ ఎప్పుడో అని ప్రతి లోగిలి ఎదురు చూపు

ఈ బాటనే కదూ పిల్లలు ఆడుకున్నారు,మళ్ళీ సందడి ఎపుడో అని ఊరి ఎదురుచూపు

ఇంక వీళ్ళు దినచర్యలో పడ్డారు,నేను కాచుకుంటూ ఉండాలని దేవుడి ఎదురుచూపు



Rate this content
Log in

Similar telugu story from Abstract