Varun Ravalakollu

Drama Romance Thriller

4.8  

Varun Ravalakollu

Drama Romance Thriller

డేంజరస్ లైఫ్ -2

డేంజరస్ లైఫ్ -2

2 mins
425


' నీ పేరు భానుప్రకాష్.... పేరు మార్చుకో బావ... 'అంది విన్నీ...


" ఎందుకే? " అంటే ' భాను అంటే సూర్యుడు, నా పేరు వెన్నెల. ఆ రెండు కలవవు గా' అంది.


" అప్పుడప్పుడు కలుస్తాయిలే ఎర్లీ మార్నింగ్, ఈవెనింగ్ ... అది చాలు " అన్నా నేను


*************************


ఇప్పుడు:


స్పృహ వచ్చేసరికి హాస్పిటల్ బెడ్ మీద ఉన్న. వెంటిలేటర్ మీద బతికి ఉన్న. నా చావు గేట్ బయటే వెయిట్ చేస్తుంది, జస్ట్ కార్డ్ స్వైప్ చేసి రావడానికి ఆ కార్డ్ ఏ నా పర్మిషన్. నాకు ఈ హాస్పిటల్ బెడ్ కొత్త కాదు. ఇప్పటికి నా మీద 31 మర్డర్ అట్టెంప్ట్స్ జరిగాయి.


నర్సుల మాటలు వినపడుతున్నాయి. " పాపం ఇతని ఫ్యామిలీ అంత బయట టెన్షన్ లో ఉన్నారు. ఒక యంగ్ ఏజ్ అమ్మాయి మాత్రం కాస్త ధైర్యంగా ఉంది. అందరికి సర్ది చెప్తోంది. ఈ వయసులోనే ఎంత ధైర్యమో!! ఇంకో పది రోజుల్లో ఆ అమ్మాయికి ఇతనితో పెళ్లి అంట "


హుమ్...ఆ అమ్మాయే నన్ను షూట్ చేసింది అని వీళ్ళకి ఎలా చెప్పను?? చెప్పిన ఎవరు నమ్ముతారు?? అసలు ఎందుకు చెప్పాలి? తను నా వెన్నెల.....


**********************


కొన్నేళ్ల క్రితం...


అది నా బి.టెక్ ఫైనల్ ఇయర్. క్యాంపస్ ప్లేసెమెంట్ లో మంచి కంపెనీలో ప్లేస్ అయ్యా. లైఫ్ ఇక ఫుల్ హ్యాపీ అనుకుంటూ ఉండగా నా లైఫ్ లో అనుకోని ఇన్సిడెంట్ ఒకటి జరిగింది..


ఓసారి నేను, విన్నీ, ఇంకా కొంత మంది ఫ్రెండ్స్ తో కలిసి గోకర్ణ టూర్ కి వెళ్ళాం. అక్కడ అనుకోకుండా ఒక స్వామిజిని కలిసాం. ఆయన నన్ను చూసి నన్ను మాత్రం పక్కకి పిలిచి చెప్పాడు..


"నీలో ఒక గొప్ప శక్తి ఉంది.నువ్వు అనుకుంటే తప్ప నువ్వు చావవు. నీ అనుమతి లేకుండా చావు నీ దగ్గరకు రాదు. ఏ జన్మ పుణ్యమో... ఇది దేవుడు నీకు ఇచ్చిన గొప్ప వరం. నువ్వు నమ్మిన, నమ్మకపోయిన ఇది నిజం."


అప్పటికే ఫ్రెండ్స్ తో ఎంజాయిమెంట్ మూడ్ లో ఉన్న నేను స్వామిజి మాటలు పట్టించుకోలేదు. " థ్యాంక్స్ స్వామి , గొప్ప విషయం చెప్పారు " అని ఆయనకు ఒక 200 ఇచ్చా.


ఆయన కోపంగా ఆ డబ్బుని కింద పడేసి , ' మూర్ఖుడా ' అని ఎరుపెక్కిన కళ్ళతో వెళ్ళిపోయాడు..


నేను ఆ విషయం అసలు మర్చిపోయా..


కొన్నిరోజుల తర్వాత నేను ట్రావెల్ చేస్తున్న ఒక బస్సుకి ఆక్సిడెంట్ అయ్యింది. డ్రైవర్, కండక్టర్ తో సహా బస్సులో ఉన్న అందరు చనిపోయారు. నేను తప్ప.


ఇలాంటివే ఇంకో మూడు ఇన్సిడెంట్స్ జరిగాయి.. ఓసారి కూలిన బిల్డింగ్ లో ఉన్న, ఇంకోసారి ఫైర్ ఆక్సిడెంట్. నాక్కూడా గాయాలు అయ్యాయి, కానీ చావలేదు.


చావడానికి అన్ని విధాలా అవకాశం ఉన్న ఈ మూడు ఇన్సిడెంట్స్ లో చావలేదు. ఎందుకో స్వామిజి మాటలు నమ్మాలి అనిపిస్తోంది. అవే నిజమైతే నా లైఫ్ ఎలా ఉండబోతోంది??



Rate this content
Log in

Similar telugu story from Drama