భూగర్భ గది
భూగర్భ గది
నవ్య మరియు మధు అన్యోన్యమైన దంపతులు. నవ్య ప్రేగ్నన్ట్. కొన్ని రోజుల్లో వాళ్ళకి ఒక పాపా కానీ బాబు కానీ పుట్టబోతున్నారు అని హ్యాపీ గా ఉంటారు.
నవ్య యూనివర్సిటీ లో మాథ్స్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తుంది. మధు ఒక కంపెనీ లో ఆర్కిటెక్ట్ గా వర్క్ చేస్తున్నాడు. అదే కంపెనీ లో మధు ఒక్క ఎక్స్ లవర్ చందనా కూడా వర్క్ చేస్తుంది.
చందనా కి మధు మీద ప్రేమ అలాగే ఉంటుంది. కానీ మధు మాత్రం నాకు పెళ్లి అయిపోయింది ఇంకా మన మధ్య ఏమి లేదు అని చాలా క్లియర్ గా చెప్తాడు చందనాకి.
నవ్య తన వర్క్ అయిపోయినా తరువాత పియానో ప్లే చేస్తూ ఉంటుంది. ఆహ్ టైం లో ఆమెకి ప్రెగ్నన్సీ పైన్స్ రావడంతో మధు కి చాలా సార్లు కాల్ చేస్తుంది.
కానీ మధు క్లైంట్స్ తో బిజీ గా ఉండి తన ఫోన్ ని చూడడు. కాసేపు తరువాత మధు తన ఫోన్ ని చెక్ చేసుకుని వెంటనే హాస్పిటల్ కి భయలుదేరుతాడు. కానీ వాళ్ళ ఇద్దరికి బాడ్ న్యూస్ ఏంటి అంటే నవ్య తన ప్రెగ్నన్సీ ని కోల్పోయింది.
కొన్ని రోజుల్లో బిడ్డ పుడుతుంది అని హ్యాపీ గా ఉన్న వీళ్ళకి నిరాశ మిగిలింది.
నవ్య ఇంకా ఆ ఇంట్లో ఉండలేక మనం ఇక్కడ నుండి వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోదాం అని మధు ని అడుగుతుంది. మధు కూడా తన భాద ని అర్ధం చేసుకుంటాడు.
ఇంకా ఇద్దరు కలిసి సిటీ కి దూరంగా మంచి ఇల్లు దొరుకుతుంది ఏమో అని సెర్చ్ చేస్తూ ఉంటారు. చాలా రోజులు ప్రయత్నిస్తారు కానీ వీళ్ళకి నచ్చినట్టు వుండే ఇల్లు ఎక్కడ దొరకదు.
ఒక హౌస్ బ్రోకర్ వీళ్ళతో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ వున్నాడు. అతని ఏరియా లో హౌసెస్ గురించే అతనికి బాగా తెలుసు. మీరు అక్కడికి వెళ్తే మీకు మంచి ఇల్లు చూపిస్తాడు అని వాళ్ళకి చెప్తుంది.
ఇక ఇద్దరు అతని ఇంటి దగ్గరకి వెళ్తారు. అతని ఇల్లు చాలా పెద్దగా అందంగా ఉంటుంది. ఆ ఇల్లు చూడగానే సారా కి బాగా నచ్చుతుంది. ఆ ఇంటి ఓనర్ పేరు సుధీర్.
అతను బయటకి వచ్చి ఇద్దరినీ లోపలికి ఇన్వైట్ చేస్తాడు. ఇద్దరు వాళ్ళు ఎందుకు వచ్చారు అనే విషయాన్నీ సుధీర్ కి చెప్తారు. సుధీర్ కూడా ఒక మంచి హౌస్ చూపిస్తా అని చెప్తాడు. సుధీర్ వాళ్ళని డిన్నర్ కి ఇక్కడే ఉండమని చెప్తాడు.
అప్పుడు సుధీర్ వాళ్ళని మీ ఇద్దరు యంగ్ గానే ఉన్నారు కదా సిటీ లో కాకుండా ఇలాంటి ప్లేస్ లో ఎందుకు హౌస్ చూసుకుంటున్నారు అని అడిగాడు. దానికి నవ్య మా పాత ఇంట్లో ఒక బాడ్ చాప్టర్ ముగిసిపోయింది, ఒక కొత్త చాప్టర్ మొదలుపెట్టాలి అని ఇక్కడికి వచ్చాము అని చెప్తుంది.
సుధీర్ తన ఇంటి గురించి చెప్తూ ఇంటిని చూపిస్తూ ఉంటాడు. అక్కడ కొన్ని అంటిక్ ఐటమ్స్ కూడా ఉంటాయి. అక్కడ ఉన్నా ఐటమ్స్ లో గన్స్ కూడా ఉంటాయి.
ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి మీవేనా అని మధు అడుగుతాడు. అప్పుడు సుధీర్ ఏ హౌస్ ని కడుతున్నప్పుడు అవి బయట పడ్డాయి. వాటిని జాగ్రత్తగా పెట్టాను అని సుధీర్ అంటాడు. నవ్య కి ఆ ఇల్లు బాగా నచ్చుతుంది.
తాను కూడా చాలా రోజుల నుండి ఇలాంటి ఇంట్లో ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది. కానీ సుధీర్ ఇంట్లో అద్దె కి ఉండాలన్న కొనాలన్నా వాళ్ళ ఆస్తులు అమ్మిన కూడా సరిపోవు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా చాలా లేట్ అయిపోతుంది. మధు డ్రింక్ చేసి ఉంటాడు.
డ్రైవింగ్ చేయడం కష్టం కాబట్టి సుధీర్ ఆ నైట్ కి వాళ్ళని అక్కడే ఉండమని అడుగుతాడు. ఇంకా వాళ్లిద్దరూ నైట్ అక్కడే వుంటారు.
మరుసటి రోజు ఉదయం వాళ్ళు సుధీర్ కి చెప్పి అక్కడ నుండి వెళ్ళాలి అనుకుంటారు. కానీ సుధీర్ వాళ్ళకి ఎక్కడ కనిపించడు. వాళ్ళకి టేబుల్ మీద సుధీర్ రాసిన ఒక లెటర్ కనిపిస్తుంది. సుధీర్ ఆ లెటర్ లో ఏం రాస్తాడు అంటే !
"నేను నా ఫామిలీ తో ఈ ఇంట్లో చాలా హ్యాపీ గా గడిపాను. మీరు నాకు ఒక మంచి జంటలా అనిపించారు. నేను ఈ ఇంటిని మీకు ఇచ్చేద్దాం అని అనుకుంటున్నాను. ఇంట్లో ఉన్నా సామాన్లు కూడా మీకే సొంతం అవుతాయి. కానీ మీరు ఇంట్లో ఉండాలి అంటే ఒక చిన్న కండిషన్ అయితే ఉంది. అది ఏంటి అంటే ఈ ఇంటి బయట వున్నా సెల్లార్ డోర్ ని మాత్రం అసలు ఓపెన్ చేయద్దు. ఏ కండిషన్ మీకు ఓకే అయితే ఈ ఇల్లు మీకే. ఒకవేళ మీరు ఆ సెల్లార్ ని ఓపెన్ చేస్తే నాకు తెలిసిపోతుంది. ఆ తరువాత ఆ ఇంటిని మీ నుండి తీసేసుకుంటాను"
ఈ చిన్న కండిషన్ కి మనం ఒప్పుకుంటే ఇంత మంచి ఇల్లు మనకి సొంతం అవుతుందా అని నవ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ సెల్లార్ డోర్ ని ఎందుకు ఓపెన్ చేయద్దు అని అన్నాడు అని మధు కి మాత్రం చాలా డౌట్ వస్తాది. ఇంత పెద్ద ఇల్లు మరియు ఇంత మంచి ఫర్నిచర్ ఇచ్చిన వ్యక్తి ఇంత చిన్న సెల్లార్ ని ఎందుకు ఓపెన్ చేయద్దు అని అన్నాడు అని అనుకుంటాడు మధు.
అక్కడికి హౌస్ బ్రోకర్ వచ్చి మీకు ఈ డీల్ ఇష్టం అయితే కాంట్రాక్టు మీద సైన్ చేయండి అని అంటుంది. ఇంకా నవ్య, మధు కాసేపు డిస్కస్ చేసుకోడానికి పక్కకి వెళ్తారు. మధు కి ఆ సెల్లార్ మీద బాగా డౌట్ ఉంటుంది కాబట్టి ఆ ఇల్లు తీసుకోడానికి ఆలోచిస్తూ ఉంటాడు.
అప్పుడు నవ్య మధుతో ఇప్పటి వరకు మనం చాల హౌసెస్ చూసాం మనకి నచ్చినా హౌసెస్ మన బడ్జెట్ లో ఉండడం లేదు, మన బడ్జెట్ లో ఉన్నా హౌసెస్ బాగోడం లేదు మనం సెల్లార్ ని ఓపెన్ చేయకుండా ఉంటే ఈ ఇల్లు మొత్తం మనకి ఫ్రీ గా దొరుకుతుంది కదా. ఈ ఇంట్లో మనం కొత్త లైఫ్ ని స్టార్ట్ చేస్తాం అనిపిస్తుంది. ఈ కండిషన్ కి ఒప్పుకుందాం అని మధు ని అడుగుతుంది నవ్య. ఇంకా మధు కూడా ఒప్పుకుంటాడు.
తరువాత ఆ ఇద్దరు కాంట్రాక్టు మీద సైన్ చేస్తారు. ఇంత ఖరీదు ఐన ఇల్లు తన సొంతం ఐంది అని నవ్య చాలా సంతోషపడుతుంది. ఆ ఇంట్లో వాళ్లిద్దరూ వాళ్ళ లైఫ్ ని ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తారు. వాళ్ళు కొన్ని రోజుల తరువాత ఫ్రెండ్స్ కి హౌస్ వార్మింగ్ పార్టీ ని ఇస్తారు.
అయితే ఆ పార్టీ కి మధు ఎక్స్ లవర్ చందనా కూడా వస్తాది. ఆమెకి ఇష్టమైన జాస్మిన్ మొక్కని తీసుకుని వచ్చి నవ్య కి గిఫ్ట్ గా ఇస్తుంది. కానీ చందనా అక్కడికి రావడం మధు కి అసలు ఇష్టం లేదు. మధు చందనా దగ్గరకి వెళ్లి అసలు ఎందుకు వచ్చావ్ అని అడుగుతాడు.
చందనా మళ్ళీ మధు కి దగ్గర కావాలి అని చూస్తుంటే కానీ అతను ఆమెని దూరం పెట్టాలి అని చూస్తాడు.
వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి మధు వాళ్ళ బాస్ వచ్చి మధు ని ఒకసారి బయటకి రమ్మని అడుగుతాడు. మధు బయటకి వెళ్తే అక్కడ ఒక వ్యక్తి పెట్రోల్ కాన్ పట్టుకుని వాళ్ళ ఇంటి వైపు అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే మధు అతని దగ్గరకి వెళ్లి అసలు ఎవరు నువ్వు? నీకు ఏం కావాలి? అసలు ఇక్కడ ఏంచేస్తుంటావ్? అని అడుగుతాడు.
ఆ వ్యక్తి మధు తో ఎంత తొందరగా వీలు అయితే అంత తొందరగా ఈ ఇంటిని తగలపెట్టేసి వెళ్తే మీకు అంత మంచిది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
తరువాత రోజు నవ్య తన పక్కన ఇంట్లో వుండే పూజ ని కలుస్తుంది. ఆమె నవ్య తో ఇంతక ముందు ఇక్కడికి చాలా మంది వచ్చి వెళ్లిపోయారు. మీరు అయినా ఎక్కువ కాలం ఉండాలి అని కోరుకుంటున్నా అని అంటుంది. మధు ఆఫీస్ కి వెళ్లే టైం కి మధు తనని ఫీజికల్ గా ఇబ్బంది పెట్టాడు అని కంప్లైంట్ ఇస్తుంది. మధు ని ఇన్వెస్టిగేట్ చేస్తారు. నిజం తెలిసే వరకు మధు ని జాబ్ లో నుండి సస్పెండ్ చేసేస్తారు. ఇంటికి వచ్చిన మధు తను సస్పెండ్ అయినా విషయం నవ్య కి చెప్పాలి అనుకుంటాడు. కానీ తన పర్ఫెక్ట్ లైఫ్ కి అదొక డిస్టర్బన్స్ లా ఉంటుంది అని నవ్య కి చెప్పే దైర్యం చేయడు.
అలా రెండు వారాలు గడిచిపోతాయి.
నవ్య తన వర్క్ కి వెళ్ళిపోతుంది. మధు బయటకు రన్నింగ్ కి వెళ్ళిపోతాడు. అప్పుడు మధు బాస్ మధు కి కాల్ చేస్తాడు. అప్పుడు మధు వాళ్ళ బాస్ తో నేను డైరెక్ట్ గా చందనా తోనే మాట్లాడి ఈ ఇష్యూస్ అన్ని సాల్వ్ చేసుకోవాలి అనుకుంటున్నా అని అంటాడు. అప్పుడు మధు బాస్ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా ఇప్పుడు నువ్వు తనతో మాట్లాడకూడదు అని అంటాడు.
ఇంటికి వచ్చినా మధు కన్ను ఆ సెల్లార్ మీద పడుతుంది. అసలు అందులో ఏం ఉందో తెలుసుకోవాలి అని మధు ఆ చెల్లర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ టైం లో చేతి కి దెబ్బ తగలడంతో ఆ ప్రయత్నం ఆపేస్తాడు.
ఆ రోజు రాత్రి ఇద్దరు భోజనం చేస్తున్నప్పుడు మధు నవ్య తో ఆ సెల్లార్ డోర్ మన ఓపెన్ చేస్తే సుధీర్ కి ఎలా తెలుస్తుంది. అసలు ఓపెన్ చేసి అందులో ఏం ఉందో తెలుసుకుందాం అని అంటాడు.
అప్పుడు నవ్య మనం ఆల్రెడీ కాంట్రాక్టు మీద సైన్ చేసాం, ఇప్పుడు మల్లి ఎందుకు ఆ సెల్లార్ గురించి మాట్లాడుతున్నావ్. ఇంతా పెద్ద హౌస్ ని సుధీర్ మనకి ఇచ్చాడు. ఆ డోర్ ఓపెన్ చేయద్దు అని చెప్పాడు. ఇప్పుడు ఆ డోర్ ని ఓపెన్ చేసి మన డ్రీం హౌస్ ని కోల్పోడం అవసరమా అని అంటుంది.
తరువాత రోజు నవ్య తన వర్క్ కి వెళ్ళిపోతుంది. మధు చందనా కి కుదిరితే కాల్ చేయమని ఒక మెసేజ్ పంపుతాడు. ఆ టైం లో మధు కి ఇంట్లో ఒక హిడెన్ డోర్ కనిపిస్తుంది. మధు కి డౌట్ వచ్చి సిటీ ఆర్కియో దగ్గర ఇంటి బ్లూ ప్రింట్ తీసుకుంటాడు.
అక్కడ పని చేసే వ్యక్తి ద్వారా ఆ ఇంటి పాత ఓనర్ పేరు మరియు వివరాలు తెలుసుకుంటాడు. ఆ వివరాలు తెలుసుకున్నాక మధు కొంచెం షాక్ అవుతాడు. ఎందుకంటే తనకి హౌస్ అమ్మింది ఏమో సుధీర్.
కానీ ఆ వర్కర్ ఏమో అసలు ఓనర్ పేరు విజయ్ అని చెప్తాడు. అప్పుడు మధు ఆ వర్కర్ తో నాకు హౌస్ ఇచ్చింది విజయ్ కాదు సుధీర్ అని చెప్తాడు. అప్పుడు ఆ వర్కర్ సుధీర్ పేరు విని చాలా రోజులు అయిపోయింది. దాదాపు 25 సంవత్సరాల క్రితం సుధీర్ వాళ్ళ వైఫ్ తన 5 సంవత్సరాల కూతురిని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది.
ఆరోజు నుండి వాళ్ళ జాడే తెలియదు అని చెప్తాడు. ఆ విషయాలు విన్న మధు కి ఆ సెల్లార్ మీద డౌట్ ఇంకా కొంచెం పెరుగుతుంది. ఇంటి వచ్చాక మధు ఆ బ్లూ ప్రింట్స్ ని జాగ్రత్తగా చూడగా తను చూసినా ఆ సీక్రెట్ డోర్ సెల్లార్ కి వెళ్ళడానికి ఇంకొక దారి అని మధు కి అర్ధం అవుతుంది. మధు ఆ డోర్ ని ఓపెన్ చేస్తాడు.
కానీ అది లోపల కూడా చెక్కలతో మూసేసి ఉంటుంది. ఇంకా మధు ఆ చెక్కలు అన్ని తీసేసి సెల్లార్ లోకి వెళ్ళడానికి కిందకి దిగుతాడు. కానీ సెల్లార్ లోకి వెళ్లకుండా ఒక పెద్ద చెక్కతో మూసేసి ఒక ఇనుప గేట్ ని అడ్డు గా పెట్టి వుంటారు. మధు ఒక డ్రిల్లింగ్ మెషిన్ తో ఒక కన్నం చేసి దాని లోపల ఏం ఉందో చూడడానికి ట్రై చేస్తాడు. కానీ అదే సమయం లో నవ్య తన వర్క్ నుండి ఇంటికి వస్తుంది.
కార్ సౌండ్ విన్నా మధు కి నవ్య వచ్చింది అని అర్ధం అయ్యి ఫాస్ట్ ఫాస్ట్ గా అక్కడ నుండి బయటకి వచ్చేసి ఎం తెలియనట్టు బయట ఉంటాడు.
ఆ రోజు రాత్రి చందనా మధు కి కాల్ చేస్తాది. మధు బెడ్ రూమ్ నుండి బయటకి వచ్చి మనం ఒకసారి కలిసి మాట్లాడుకోవాలి అని అంటాడు. అప్పుడు చందనా రేపు మధ్యాహ్నం 2 గంటలకి మనం ఎప్పుడు కలుసుకునే ప్లేస్ కి రమ్మని చెప్తుంది. మధు చందనా ని ఆఫీస్ బేస్మెంట్ లో కలిసి అసలు నా మీద కంప్లైంట్ ఎందుకు ఇచ్చావ్ అని గొడవ పడతాడు.
కానీ చందనా ఏమో నీ వైఫ్ ని వదిలేసి నాతో వచ్చే మనం ఒక కొత్త లైఫ్ ని స్టార్ట్ చేద్దాం అని అంటుంది. కానీ మధు మాత్రం దానికి ఒప్పుకోడు. అప్పుడు చందనా నీ వైఫ్ ఉండగా నాతో ఎందుకు కలిసావు నన్ను ఎందుకు వాడుకున్నావ్ అని గొడవ పడుతుంది. అప్పుడు మధు నాకు నువ్వు అంటే ఇష్టం వుంది అని చెప్పను కానీ నా వైఫ్ ని వదిలేసి వస్తాను అని ఏరోజు చెప్పలేదు కద నీకు అని అంటాడు.
అప్పుడు చందనా నీ వైఫ్ కి నీ గురించి మొత్తం చెప్పేస్తాను అని బెదిరించి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తరువాత మధు ఇంటికి వచ్చేస్తాడు. చందనా నవ్యకి నిజం చెప్పేస్తాది ఏమో అని చాల టెన్షన్ పడతాడు. మధు నవ్య తో నేను రన్నింగ్ కి వెళ్తాను అని చెప్పి వెళ్తాడు. మధు వెళ్ళిపోయాక నవ్య కి వాంతి వాచినట్టు అవుతుంది. తనకి డౌట్ వచ్చి ప్రెగ్నన్సీ టెస్ట్ చేసుకుంటే తాను ప్రేగ్నన్ట్ అని తెలిసి చాలా హ్యాపీ గా ఫీల్ అవుతుంది.
తనకి బెడ్ కింద హౌస్ కి సంబంధించిన బ్లూ ప్రింట్స్ కనిపిస్తాయి. వాటిని చూసినా నవ్య కి మధు సెల్లార్ లోకి వెళ్ళాడు ఏమో అని డౌట్ వస్తాది. అదే సమయంలో మధు గురించి చెప్పడానికి చందనా కూడా ఇంటికి వస్తుంది. మరో వైపు నవ్య ఆ హిడెన్ డోర్ ఓపెన్ చేసి సెల్లార్ వైపు వెళ్తుంటే టార్చ్ లైట్ బ్యాటరీస్ అయిపోతాయి. ఇంకా బ్యాటరీస్ ని చేంజ్ చేసుకోడానికి నవ్య పైకి వస్తుంది.
అదే సమయంలో చందనా కూడా ఇంట్లోకి వస్తుంది. కానీ అప్పుడు తనకి అక్కడ ఎవరు కనిపించక పోవడం తో నవ్య కోసం పైకి వెళ్తుంది. బ్యాటరీస్ మార్చుకుని వచ్చిన నవ్య చందనా ని గమనించకుండా మళ్ళీ సెల్లార్ లోకి వెళ్తుంది. అక్కడ డ్రిల్లింగ్ మెషిన్తో చేసినా కన్నంని నవ్య గమనిస్తుంది. మధు సెల్లార్ లోకి వెళ్ళడానికి ట్రై చేసాడు అని నవ్య కి అర్ధం అవుతుంది. పైకి వెళ్లినా చందనా కి నవ్య మరియు మధు హ్యాపీ గా దిగిన ఫొటోస్ కనిపిస్తాయి. రూమ్ లో టెస్ట్ చేసుకున్న ప్రెగ్నన్సీ కిట్ కనిపిస్తాది. నవ్య మళ్ళీ ప్రేగ్నన్ట్ అయింది అని తనకి అర్ధం అయిపోతుంది.
బయట ఏవో సౌండ్స్ అవ్వడంతో నవ్య బేస్మెంట్ నుండి బయటకి వస్తుంది. తీరా చూస్తే అక్కడ గాలికి డోర్ కొట్టుకుంటూ ఉండడంతో ఆ డోర్ ని వేసేస్తుంది. మరో వైపు బాస్ మధు కి కాల్ చేసి నువ్వు అసలు చందనా ని ఎందుకు మీట్ అయ్యావ్ నీకు కలవద్దు అని చెప్పాను కదా ఇప్పటికైనా తన నుండి దూరం గా వుండు నీ మీద కేసు నడుస్తుంది కదా అని అరుస్తాడు.
అదే సమయంలో చందనా తన ఇంటి నుండి బయటకి రావడం మధు చూసి తనని ఎలా అయినా పట్టుకోవాలి అని తన కార్ ని ఫాలో చేస్తాడు.
అలా వెళ్లిన మధు ఇంటికి చాలా లేట్ గా వస్తాడు. అప్పుడు నవ్య తాను ప్రేగ్నన్ట్ అయినా విషయం మధు కి చెప్పడం తో తను చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. కానీ నవ్య మధు దగ్గర ఒక మాట తీసుకుంటాది.
అదేంటంటే నువ్వు ఆ సెల్లార్ ని ఓపెన్ చేయాలి అని చూసావ్ అని నాకు తెలుసు. ఇకపై నువ్వు దానిని అసలు ఓపెన్ చేయకూడదు అని అంటుంది. మధు కూడా హ్యాపీ గా ఓకే అని అంటాడు.
ఇంకా మధు ఆ సెల్లార్ కి వెళ్లే దారిని చెక్కలతో కొట్టేసే క్లోజ్ చేసేస్తాడు.
వాళ్ళకి పుట్టబోయే బిడ్డ కోసం రూమ్ ని ఎలా డెకరేట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ సమయం లో ఆఫీస్ నుండి తన బాస్ కాల్ చేసి నీమీద జరిగిన ఇన్వెస్టిగేషన్ లో నీ తప్పు ఏం లేదు అని తేలిపోయింది. నువ్వు మళ్ళీ జాబ్ లో జాయిన్ అవ్వు అని అంటాడు.
నెక్స్ట్ డే మధు తన ఆఫీస్ కి వెళ్తాడు. బాస్ మధు ని చాలా హ్యాపీ గా రిసీవ్ చేసుకుని చందనా కి నీ మీద కన్ను వుంది అని ఆఫీస్ మొత్తం తెలుసు అందుకే తాను చెప్పిన మాటలని ఎవరు నమ్మలేదు. చందనా కూడా ఒక వారం ఆఫీస్ కి రావడం లేదు అని చెప్పింది అని అంటాడు.
మధు మరియు నవ్య బేబీ రూమ్ కి పెయింటింగ్ వేయాలి అని అనుకుంటారు. అప్పుడు మధు గోడకి తగిలించిన ఒక పెయింటింగ్ ని పక్కకి పెడతాడు. అయితే దాని వెనకాల ఒక చిన్న కన్నం లా కనిపిస్తాది.
అసలు అక్కడ ఏం ఉందా అని మధు చూస్తే దానిలో నుండి బుల్లెట్ బయటపడుతుంది. అప్పుడు మధుకి సుధీర్ మీద బాగా డౌట్ వస్తాది. మధు నవ్య తో మన ఇంటి గోడలో ఒక బుల్లెట్ ఉంది. మనం వెంటనే పోలీస్ ని పిలవాలి అని అంటాడు.
మధు డౌట్ ఏంటి అంటే సుధీర్ వాళ్ళ వైఫ్ మరియు తన ఐదు సంవత్సరాల కూతురు పాతిక ఏళ్ల క్రితం కనిపించకుండా పోయారు కదా కాబట్టి సుధీర్ వాళ్ళని చంపేసి సెల్లార్ లో పెట్టి ఎవరికీ తెలియకుండా ఉండడానికి దానిని మూసేసి మనకి ఓపెన్ చేయద్దు అని కండిషన్ పెట్టి ఉంటాడు ఏమో అని అనుకుంటాడు.
ఇప్పుడు ఆ విషయాన్నీ మధు నవ్య కి చెప్తాడు. దానికి నవ్య వాళ్ళు సరదాగా గన్ ఫైర్ చేసినప్పుడు బుల్లెట్ గోడలోకి దిగి ఉండచ్చు కదా.
నువ్వు ఇప్పుడు సుధీర్ మీద డౌట్ పడి ఈ విషయాన్నీ పెద్ద రచ్చ చేయకు. నెక్స్ట్ 8 మంత్స్ నేను ప్రేగ్నసీ తో ఉండాలి. నాకు స్ట్రెస్ ఇవ్వదు అని అంటుంది.
మధు కూడా తనని అర్ధం చేసుకుని ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తాడు. మధు ఆఫీస్ కి వెళ్లే సమయానికి అక్కడ డిటెక్టివ్ వుంటారు.
విషయం ఏంటి అంటే చందనా కొన్ని రోజులగా కనిపించదు. తన కార్ ఒక నిర్మానుష్యమైనా ప్లేస్ లో వీళ్ళకి దొరుకుతుంది.
మరొక వైపు నవ్య పక్క ఇంట్లో వుండే పూజ ని కలిసి నువ్వు నాకు అప్పుడు చెప్పావ్ కదా ఏ ఇంట్లో చాల మంది వుంది ఎక్కువా కలం ఉండకుండా ఎందకు వెళ్లిపోయారు అని అడుగుతుంది.
దానికి పూజ మీరు రాకముందే చాలా మంది ఇక్కడ ఉండి వెళ్లిపోయారు. మీరు వచ్చే ముందు కూడా ఒక మంచి జంట ఇక్కడ వుండే వాళ్ళు. కానీ ఎందుకో వాళ్ళు సడన్ గా కాలి చేసి వెళ్లిపోయారు. అక్కడికి వచ్చిన అందరు సడన్ గా ఎందుకు వెళ్లిపోతున్నారో తెలీదు అని అంటుంది.
నవ్య తో తను చాలా రోజులుగా మధుతో వాకింగ్ కి వెళ్తున్నట్టు చెప్తుంది. అప్పుడు నవ్య కి అర్ధం అయింది మధు ఆఫీస్ కి వెళ్తున్నట్టు నటించి ఇంట్లో నే ఉంటూ మోసం చేసాడు అని.
అదే సమయంలో చందనా మిస్ అయింది అన్న న్యూస్ టీవీ లో నవ్య చూస్తుంది.
ఆ రోజు రాత్రి ఇద్దరు డిన్నర్ చేస్తుండగా నవ్య మధు ని చందనా మిస్ అయినా విషయం అడుగుతుంది.
అప్పుడు మధు పోలీస్ కూడా దానికోసం ఎంక్వయిరీ చేస్తున్నారు. ప్రస్తుతం ఏ ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్తాడు.
మధు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు.
అప్పుడు నవ్య మధు లాప్టాప్ చెక్ చేస్తే చందనా మధు పైన పెట్టిన కంప్లైంట్ గురించి హెచ్ ర్ పెట్టినా మెయిల్ ఉంటుంది. నవ్య మధు ఒక్క ఫోన్ చెక్ చేస్తే చందనా కి కాల్ చేసినట్టు కూడా తెలిస్తుంది.
మధు ఆ బులెట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తీరా చూస్తే ఆ బుల్లెట్ ఆ ఇంట్లో వుండే ఒక గన్ కి మ్యాచ్ అవుతుంది. మధు ఆ విషయాన్నీ నవ్య కి చెప్పాలి అని చూస్తాడు.
కానీ నవ్య ఆ విషయం వినడానికే ఇష్టపడదు.
ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగ సడన్ గా డోర్ బెల్ మోగుతుంది.
ఎవరా అని చూస్తే చందనా కేసు చూస్తున్నా పోలీస్ ఇంటికి వచ్చారు. వాళ్ళని మధు లోపలి తీసుకుని వెళ్తాడు.
నవ్య కూడా అక్కడ కూర్చుకుని ఉంటుంది. కానీ ఆ పోలీస్ మాత్రం మధు తో ఒంటరిగా మాట్లాడాలి అని చెప్తారు.
ఇంకా అక్కడ నుండి నవ్య పక్కకి వెళ్లి ఒక మూలనా నుంచుని వాళ్ళు ఎం మాట్లాడుకుంటున్నారు అని వింటుంది.
కానీ నా పెళ్లి అయినా తరువాత ఆమెను కనీసం కలవడం కానీ మాట్లాడటం కానీ చేయలేదు. తనను దూరం గానే ఉంచాను అని చెప్తాడు.
అప్పుడు వాళ్ళు నువ్వు చందనా మిస్ అవ్వడానికి ముందు కలిసావు కదా నీ సెల్ నుండి తనకి ఫోన్ కూడా వెళ్ళింది. అసలు ఎందుకు కలిసావు అని అడుగుతారు.
దానికి మధు వాళ్ళ ఇద్దరి మధ్య జరిగిన కంప్లైంట్ గురించి పూర్తి గా క్లియర్ చేసుకోడానికి కలిసాను అని చెప్తాడు. కానీ చందన మాత్రం నవ్య నీ వదిలేసి తనతో వస్తేనే కంప్లైంట్ వెనక్కి తీసుకుంటా అని చెప్పడంతో నేను అక్కడ నుండి వచ్చేసాను అని అంటాడు.
అప్పుడు పోలీస్ చందనా ఫోన్ సిగ్నల్ చివరిగా మీ ఏరియా నుండే వచ్చింది తనని కలిసావా అని అడుగుతారు.
దానికి మధు నేను అసలు తనని కలవలేదు అని అంటాడు. అప్పుడు పోలీస్ మధు ని 19 తారీకు ఎక్కడ ఉన్నారు అని అడుగుతారు. పోలీస్ తనని అనుమానిస్తున్నారు అని అర్ధం అయ్యి, అసలు ఆ రోజు నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాను అని చెప్తాడు.
ఆ రోజు మీరు ఇంట్లోనే ఉన్నారు అని అనడానికి సాక్ష్యం ఏమైనా ఉందా అని అడిగితే పక్కనే ఉండి అది అంతా వింటున్న నవ్య అక్కడికి వచ్చి, ఆ రోజు మధు ఇంట్లోనే ఉన్నాడు. నేను ప్రెగ్నెంట్ అని ఆ రోజే తెలిసింది. మేము ఆ రోజు ఇంట్లోనే ఉండి బేబీ రూమ్ ని రెడీ చేస్తున్నాము అని చెప్తుంది.
ఇంకా పోలీస్ అక్కడ నుండి వెళ్ళిపోతారు. చందన పెట్టిన సెక్సువల్ హర్రస్మెంట్ కేసు గురించి నవ్య కి చెప్పనందుకు మధు నవ్య కి సారీ చెప్తాడు.
నవ్య మధు తో చందన హర్రస్మెంట్ కేసు పెట్టడంలో తప్పు లేదు. మన ఎంగేజ్మెంట్ నుండి నీకు తనకి ఎఫైర్ ఉంది అని నాకు ఇప్పుడే అర్ధం అయింది. ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు నేను కొంచెం ఫాస్ట్ గా ఇంటికి వచ్చేసాను. ఆ రోజు నీ నుండి జాస్మిన్ స్మెల్ వచ్చింది. చందన కూడా జాస్మిన్ అంటే చాలా ఇష్టం. కానీ నేను ఎక్కువగా ఆ విషయం అలోచించి నిన్ను ఎక్కడ అనుమానిస్తానో అని ఆ రోజు ఆ విషయం పట్టించుకోలేదు. అన్నటికంటే దారుణం ఏంటి అంటే నాకు ఫస్ట్ టైం పైన్స్ వచ్చినప్పుడు నీకు నేను ఎన్నో సార్లు ఫోన్ చేశాను. కానీ నువ్వు ఆ చందన తో రొమాన్స్ చేస్తూ నా ఫోన్ కూడా పట్టించుకోలేదు. నువ్వు తనని హర్రర్ చేసి ఉండకపోవచ్చు కానీ తను నువ్వు ఇష్టం గానే రొమాన్స్ చేసుకున్నారు. నేను నువ్వు కానీ ఇంట్లో ఉన్నావ్ అని చెప్పి ఉండక పోయి ఉంటే నువ్వే మెయిన్ సస్పెక్ట్ అయ్యే వాడివి అని అంటుంది.
దానికి మధు నువ్వు నేను చందన ని హత్య చేశాను అని అనుకుంటున్నావా.
దానికి నవ్య నేను అనడం లేదు ఆ పోలీస్ ఏ దానిని కన్ఫర్మ్ చేస్తున్నారు.
ఆ రోజు రాత్రి మధు కి అసలు నిద్ర పట్టదు. ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి అంత చేడు జరుగుతుంది. అప్పుడు ఆ చెల్లర్ లో ఎం ఉందొ తెలుసుకోవాలి అనిపించి ఆ పాత ఇంటి ఓనర్ రిషి ఇంటి అడ్రస్ తెలుసుకుంటాడు.
నెక్స్ట్ డే మధు అతని ఇంటికి వెళ్తాడు. ఇంతకీ అతను ఎవరో కాదు ఇంతకముందు హౌస్ వార్మింగ్ పార్టీ లో అక్కడికి ఒక అతను పెట్రోల్ కాన్ తో వస్తాడు కదా అతనే ఇతను.
మధు రిషి ని కలిసి అసలు ఆ ఇంటి సంగతి ఏంటి.. ఆ ఇంట్లో కి వెళ్ళాక ఎందుకు ఇలా జరుగుతుంది అని అసలు సెల్లార్ లో ఏం వుంది అని అన్నిటి గురించి అడుగుతాడు.
దానికి రిషి ఆ ఇంటికి మనం వెళ్ళినప్పుడు తక్కువ డబ్బులకి మంచి కాస్టలీ ఇల్లు, లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నం అనిపిస్తాది మనకి. మనం సైన్ చేసే కాంట్రాక్ట్ కూడా సెల్లార్ నీ ఓపెన్ చేయడానికి కాదు, డెవిల్ తో ఒక కాంట్రాక్టు లాంటిది. ఆ ఇల్లు ఒక శాపగ్రస్తమైనది. ఆ ఇంట్లోకి వెళ్లిన తరువాత మనలో ఉన్న డార్క్ సైడ్ ఓపెన్ అవుతుంది. అక్కడికి వెళ్ళిన తరువాతే నాకు నా వైఫ్ కి చాలా గొడవలు అయ్యి, డివోర్స్ తీసుకునే పొజిషన్ లో ఉన్నాము. ఆ ఇంటికి వెళ్లక ముందు నాకు డ్రింకింగ్ అలవాటు లేదు. కానీ ప్రస్తుతం నేను పెద్ద తాగుబోతుని అయిపోయాను. నాకు ఉన్నా ఒకే ఒక్క రిగ్రెట్ ఏంటి అంటే ఆ సెల్లార్ ని నేను ఓపెన్ చేయకపోవడమే. మీ హౌస్ వార్మింగ్ పార్టీ కి కూడా నేను వచ్చింది ఆ ఇంటిని తగల పెట్టేద్దాం అనే. ఇది ఒక సైకిల్ లాగా జరుగుతూనే ఉంటుంది. ఆ సైకిల్ ని క్లోజ్ చేయాలంటే ముందు నువ్వు ఆ సెల్లార్ ని ఓపెన్ చేయాలి అని అంటాడు.
ఇంకా మధు ఇంటికి వెళ్లి ఆ సెల్లార్ డోర్ ని ఎలాగైనా ఓపెన్ చేయాలి అని ఫిక్స్ అవుతాడు.
కానీ నవ్య మాత్రం బేబీ రూమ్ కి పెయింట్ వేస్తూ ఇక్కడ ఫ్యూచర్ బాగుంటుంది అని కలలు కంటూ ఉంటుంది.
అప్పుడు మధు నవ్య తో ఈ ఇంటికి వచ్చిన తరువాత నీలో చాలా మార్పు వచ్చింది. ఇక్కడ పర్ఫెక్ట్ లైఫ్ ఉంటుంది అనుకుని మనం ఎన్నో తప్పులు చేస్తున్నాం ఎన్నో గొడవలు పడుతున్నాం. ముందు మనం వెళ్లి ఆ సెల్లార్ ని ఓపెన్ చేద్దాం అని అంటాడు.
కానీ నవ్య దానికి ఒప్పుకోదు.
మధు వెళ్లి ఆ సెల్లార్ డోర్ ని పగల కొడుతూ ఉంటాడు.
నవ్య మధు ని ఆపడం కోసం రాడ్ తో అతని తల పైన కొడితే అతను కళ్ళు తిరిగి కింద పడిపోతాడు.
కాసేపు అయ్యాక మధు మెళుకువలోకి వస్తాడు.
అప్పుడు నవ్య మధు తో నేను కచ్చితంగా సెల్లార్ డోర్ ని ఓపెన్ చేయనివ్వను. కానీ ఓపెన్ చేసావ్ అంటే దానిలో ఏం ఉందో చూడడానికి నువ్వు రెడీగా ఉండాలి.
ఆ తర్వాత మధు కి చందన ఫోన్ చూపిస్తుంది. ఆ ఫోన్ చూసిన తర్వాత మధుకి నవ్య నే చందన ని ఏదో చేసింది అని అర్థం అవుతుంది.
ఫ్లాష్ బ్యాక్ లో నవ్య కి వాళ్ళ రిలేషన్ కోసం చెప్పడానికి చందన వస్తుంది కదా, ఆ రోజు చందన ని బేబీ రూమ్ లో చూసి అక్కడ నుండి చందన ని వెళ్లిపొమ్మని చెప్తుంది.
కానీ చందన మాత్రం నువ్వు అనుభవిస్తున్న ఈ హ్యాపీ లైఫ్ మొత్తం నేను మధు తో అనుభవించాల్సింది అని మాట్లాడుతూ ఉంటుంది.
ఎంత చెప్పిన చందన వినకపోవడంతో ఆ ఇరిటేషన్ మూమెంట్ లో నవ్య చందన ని షూట్ చేస్తాది. అలా షూట్ చేసినప్పుడు వచ్చిన బుల్లెట్ ఏ ఆ పెయింటింగ్ వెనకాల గోడలో ఉంటుంది.
చందన బాడీ ని క్లాత్ లో చుట్టేసి సెల్లార్ లో పడేసి, చందన కారు ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. ఆ కార్ ని చూసి చందన కాదు అనుకుని మధు ఆ కార్ వెనకాల వెళ్తాడు. కానీ నవ్య మధు నుండి తప్పించుకుని ఒక నిర్మానుష్యమైన ప్లేస్ లో వదిలేసి చందన ఫోన్ లో ఉన్న సిమ్ కార్డు ని తీసేసి పడేస్తుంది.
నేను మన పర్ఫెక్ట్ లైఫ్ కి ఎలాంటి డిస్టర్బన్స్ రాకూడదు అని తనని చంపేసాను అని అంటుంది నవ్య.
అప్పుడు మధు నువ్వు ఏం బాధపడకు నేను నీకు ఒక మంచి లాయర్ ని చూస్తాను అని చెప్పి పోలీస్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అనుకుంటాడు.
అప్పుడు నవ్య మధు కి గన్ తో గురి పెట్టి నువ్వు ఇక్కడితో ఇదంతా వదిలేస్తే మన లైఫ్ చాలా బాగుంటుంది అని అంటుంది. సైలెంట్ గా ఉండకుండా చందన ని చంపింది నేనే అని చెప్తే పోలీస్ కి నువ్వే చంపావు అని చెప్తాను అని అంటుంది. ఆ రోజు పోలీస్ కి కూడా నువ్వు ఇంట్లో ఉన్నావు అని చెప్పింది నేనే కదా. ఆ రోజు నేను అబద్దం చెప్పాను అని పోలీస్ కి చెప్తే మల్లి కేసు నీ వెనకాలే తిరుగుతుంది అని మర్చిపోకు అని బెదిరిస్తుంది.
ఇంకా ఏం చేయాలో తెలియక ఇంకా మధు కూడా సైలెంట్ అయిపోతాడు.
పుట్టబోయే బిడ్డ కోసం నవ్య ఇంట్లో ఒక పార్టీ ని ఏర్పాటు చేస్తుంది.
కానీ మధు మాత్రం ఆ ఇంట్లో అంత జరిగిన తరువాత నార్మల్ గా ఉండలేకపోయాడు. ఆ రోజు వాళ్ళకి వచ్చిన గిఫ్ట్స్ లో సుధీర్ పంపిన గిఫ్ట్ కూడా ఉంటుంది.
అతను తాను పంపించిన గిఫ్ట్ లో సెల్లార్ తాళం చెవి ఉంచుతాడు. సుధీర్ రాసిన లెటర్ లో ఆ సెల్లార్ లో ఏం ఉందొ మీకు అర్ధం అయ్యి ఉండచ్చు.
ఇంకా సెల్లార్ ని ఓపెన్ చేయడం చేయకపోవడం మీ ఇష్టం అని రాసి ఉంటుంది.
