PRASHANT COOL

Drama


3  

PRASHANT COOL

Drama


అమూల్యం

అమూల్యం

3 mins 338 3 mins 338

అది ఆ ఊరిలోనే ఎత్తైన పర్వతం. అంతేకాక పర్యాటకులు ఎక్కువగా సందర్శించే హిల్ స్టేషన్ కూడా కావడంతో చాలామంది జంటలు, ప్రేమికులు ఎంతో ఆశ్చర్యంగా దూరంగా కనిపించే ప్రకృతి అందాలను కళ్ళు పెద్దవి చేసుకుని మరీ చూస్తూ ఆనందిస్తున్నారు. అదేసమయంలో ఒక్కసారిగా నలుగురు పోలీసులు మాసిన గెడ్డంతో ఉన్న ఒక వ్యక్తి చేతికి బేడీలు వేసి తీసుకువచ్చారు. సివిల్ డ్రెస్ లో ఉన్న వ్యక్తిని చూడగానే అనిపించింది అతనో ఖైదీ అని. అతన్ని చూడగానే ఎక్కడో పరిచయమున్న ముఖంలానే అనిపించింది నాకు. ఇతన్ని ఎక్కడ చూసానబ్బా అని మనసులో అనుకుంటూ గుర్తుకుతెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఎందుకో ఉత్సుకత ఆపుకోలేక పోలీస్ ఆయన్ని అడిగాను ఇంతకీ ఈ ఖైదీని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని. దానికి ఆ పోలీస్ అయన, ఇతనో ఉరిశిక్ష పడిన ఖైదీ. చివరి కోరికగా ఈ హిల్ స్టేషన్ చూడాలని అడిగితే ఇక్కడికి తీసుకొచ్చామని చెప్పాడు. ఆలా ఆ పోలీస్ అయన చెప్పగానే ఎదో తెలియని బాధ, ఆందోళన మనసుని మెలిపెట్టే వ్యధ మొదలైంది. బాగా దగ్గరనుంచి చూసిన ముఖంలా, చాలా దగ్గర సంబంధం ఉన్న వ్యక్తిలా అన్పించడంవల్లే అని అర్థమైంది కానీ ఎలా పరిచయమో గుర్తురాక నా బుర్ర వేడెక్కిపోతుంది. ఏదేమైనా ఎలాగోలా ఆ వ్యక్తిని అడిగితే తెలుస్తుందికదా అని దైర్యం చేసి నాకు బాగా తెలిసిన వ్యక్తిలా అయన కనిపిస్తున్నాడు కానీ గుర్తురావడంలేదు, నేను ఆ వ్యక్తితో ఒకసారి మాట్లాడొచ్చా అని ఆ పోలీస్ ఆయన్ని అడిగాను. ఆ మాటకి పోలీసువాడికి కొంత అనుమానం వచ్చినా, నా అవతారం చూసి బాగా చదువుకున్న వాడిలా కనిపించేసరికి సరే మాట్లాడు అని అనుమతించాడు. అతన్ని చూసీచూడగానే మీరు నన్నెక్కడైనా ఇంతకుముందు చూసినట్టు అనిపిస్తుందా అని అడుగుదమనుకున్నా అప్రయత్నంగా మీకు ఉరిశిక్ష పడిందికదా ఏమైనా భాదగా ఉందా అని అడిగేసాను. ఆ మాటకి ఆ ఖైదీకి ఎక్కడలేని దుఖ్ఖము పొంగుకొచ్చి గట్టిగ ఏడుస్తూ, ఇలా చెప్పసాగాడు,నన్ను రిమాండ్కి తరలించిన నాలుగు రోజులకు నా భార్య జైలుకి వచ్చి నేను తండ్రి కాబోతున్నానని చెప్పింది కానీ నాకు పుట్టబోయే బిడ్డని చూడకుండానే చనిపోతున్నందుకు చాలా బాధగా ఉంది. పెళ్ళైన మూడేళ్లకు నేను ఇలా జైలు పాలయ్యాక నా భార్య ఈ తియ్యని కబురు చెప్పింది కానీ నేను ఎన్నాళ్ళో ఎదురుచూసిన నా బిడ్డతో ఆడుకోలేను, నా తండ్రి కూడా నేను పుట్టినప్పుడు చూడడానికి హాస్పిటల్ కి వస్తూ దారిలో ఆక్సిడెంట్ లో చనిపోయాడు. తండ్రిలేని లోటు నాకు బాగా తెలుసు. ఇపుడు నా బిడ్డకి అదే బాధని మిగిల్చి పోతున్నందుకు గుండెపగిలేలా ఏడుస్తున్నాను అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. అతను చెప్పింది విన్నాక నాకు తెలియకుండానే కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇంతలో నుదుటిమీద నా భార్య పెట్టిన ముద్దుతో తుళ్ళిపడి లేచేసరికి అర్థమైంది ఇదంతా కలా అని. హమ్మయ్యా ఇదంతా నిజం కాదు. నిజమైతే ఆ తండ్రి బాధ వర్ణనాతీతం. ఆ కుటుంబ పరిస్థితి ఏమైపోయేదో అని మనసులో సంతోషిస్తూ అలాగే ఉండిపోయాను. ఏంటండీ అలా ఉలిక్కిపడి లేచి విగ్రహంలా ఉండిపోయారు ఏమైంది ఏమైనా పీడకల వచ్చిందా అని తలని గుండెలకు హత్తుకుంటూ నా భార్య అడిగేసరిగి స్పృహలోకి వచ్చినట్టనిపించింది. ఏంలేదు కానీ ఈరోజు శ్రీమతికి నా మీద అంత ప్రేమ పొంగుకొచ్చిందేంటో తెలుసుకోవచ్చా అని కొంటెగా అడిగాను. దానికి నా భార్య మన ఊరిలో ఉన్న మంచి కాన్వెంట్లో డొనేషన్ కట్టి సీట్ రిజర్వు చేయించండి అనేసరికి నాకు విషయం అర్దమైపోయి ఏంటీ నిజమా ఎంత మంచి వార్త చెప్పావ్ అంటూ నా భార్య ని గట్టిగా కౌగిలించుకుని ఎంత ప్రమాదం తప్పింది, ఎంత పిరికివాడిలా ఆలోచించాను, రాత్రి నేనలా చేసి ఉంటే జీవితంలో ఎన్ని మధురస్మృతులు కోల్పోయేవాడ్ని, నన్నింత ప్రేమించే భార్యని దిక్కులేనిదాన్ని చేసి పాపం మూటకట్టుకునేవాడ్ని అనుకుంటూ అలాగే ఉండిపోయాను కదలకుండా. ఏంటండీ ఏం మాట్లాడకుండా ఆలా ఉండిపోయారేంటని నా భార్య నన్ను వెనక్కి లాగి చూసేసరికి నా కళ్ళనిండా నీళ్లు. ఎందుకు ఏడుస్తున్నానో నా భార్య కి చెప్పలేను ఎందుకంటే ఆ నిజం నా గుండెల్లోనే సమాదైపొవాలని. ఆ ముందు రోజు రాత్రి తాను నిద్రపోయాక ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాను. నా భార్య నిద్రపోయేలోపు అలా తలవాల్చగానే నాకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంటే ఆ నిద్రలో ఈ కలొచ్చింది. అప్పులిచ్చినవాళ్లు రోజు ఇంటికొచ్చి గొడవచేస్తుంటే ఆ అవమానాన్ని భరించలేక ఈ దారుణమైన నిర్ణయానికి వచ్చాను. ఆ దేవుడే ఈ కలద్వారా నాకు బుద్దొచ్చేలా చేసాడేమో అనిపించింది. నా భార్య నేను తండ్రిని కాబోతున్నాననే తియ్యని కబురు చెప్పేసరికి ఆ కలలో కనిపించిన ఖైదీ నే గుర్తొచ్చాడు. అతనికి బ్రతకాలని ఉన్నా, తన బిడ్డని కళ్లారా చూడాలనిఉన్నా తనకు పడిన ఉరిశిక్ష వల్ల అదృష్టం లేకుండా పోయింది.  ప్రాణం విలువ ఉరికంభం ఎక్కబోయే ఖైదీని అడిగితే తెలుస్తుందనిపించింది. ఐ.సి.యూలో ఉన్న కోటీశ్వరుడికి తెలుస్తుంది తనదగ్గరున్న ఏ పెద్ద పచ్చనోటుకి కూడా ఒక్క నిమిషం ఆయుష్షు పెంచే సత్తా లేదని. ఆ కలవల్ల నాలో పిరికివాడు చనిపోయి నూతనోత్సాహంతో నేనే మళ్లీ పుట్టినట్టుగా, ఈ జీవితం దేవుడు నాకిచ్చిన పునర్జన్మలా భావించి ఎక్కువగా కష్టపడి, నాలుగు రకాల పనులు చేసి తొందరలోనే నా అప్పులన్నీ తీర్చేసాను. పుట్టబోయే బిడ్డ ఎవరి పోలికలో ఉంటారో, ఎపుడు కళ్లారా చూసుకుంటామో అని ఎదురుచూస్తూ నెలలు నిండేవరకు మేమిద్దరం కాలాన్ని కలిసికట్టుగా తరమడం ప్రారంభించాం. Rate this content
Log in

More telugu story from PRASHANT COOL

Similar telugu story from Drama