Midhun babu

Inspirational

4  

Midhun babu

Inspirational

అలజడి.. నా మనసు.. అలజడి

అలజడి.. నా మనసు.. అలజడి

1 min
353


అలజడి అలజడి ఈ చిరు ఆదః అధరాల అలజడి ఎందుకో నాకే ఎందుకో...


• సూర్యోదయ మంచు పొరల తెరలతో చెలిమి చేసి,  చొరవతో చొరబడే వెచ్చా వెచ్చని సూర్యకిరణాలు ....రేప రెపలాడే పైరుపై చల్లా చల్లని స్వేద బిందువులు .....ఇసుక తిన్నెల వాలు జారే హోయలు పోయే నడుము పైన సన్నని పరికిణీ చిరుగాలి రెపరెపలు.


• అలజడుల నా మనస్ సవ్వడి .....గలగల నా తుమ్మెద రవళి .


• పైరుగాలి పై విహరించే పక్షి కిలకిలలా.......ఉరకలతో ఎగిసిపడుతోంది నా మనస్ సలజడి .....



• పొలము గట్టు బోదేలో స్వచ్ఛమైన ఉరకలేసే నీరులా....విప్పారిన కన్నులతో నిశ్చలమైన నిరీక్షణ... నా మనస్ కోసం ...


• నడినెత్తిన సూర్యుడు ......క్షీణంతో , సహనంతో , వేడిమిని ఆస్వాదిస్తున్న పైరులా .....ఎదురు చూపుల బలహీనతే చిగురుటాకులా....నా మనస్ కోసం నిరీక్షణ.



• అస్తమించిన సూర్యుడు, పైరుగాలి సవ్వడులు, పక్షుల గలగలలు, పునః తేజానికి ఆరంభాలు....ప్రకృతి నాకు ఇచ్చే , నా శక్తే  నా నిరీక్షణ , నా మనస్ కోసం....


• తెలుసు నా మనసు.... నాది కాదని తెలుసు.... నా దరికి రాదని తెలుసు .....అయినా నేను ప్రకృతిలో మమేకమై ఉన్నాను కదా అందుకే అచంచలమైన చిరకాల నిరీక్షణ.


Rate this content
Log in

Similar telugu story from Inspirational