STORYMIRROR

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Inspirational Others

4  

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Inspirational Others

అద్దం మీద మరక

అద్దం మీద మరక

3 mins
339

 ఇంట్లో నాకు ఇష్టమైన వస్తవు అద్దం.దాని తరువాతే నాకు ఫోను టీవీ ఫ్రెండ్స్ కూడా ..దాన్ని నేను దేవుడ్ని అలంకరించినట్టు అలంకరిస్తాను.హారతి కూడా ఇస్తాను..

స్వాతంత్రం నాటి అద్దం అది.నేను నాలుగో తరం.ఆ మాత్రం గౌరవం ముఖ్యం అని నా ఉద్దేశ్యం..ఏదైనా మంచి పని చేస్తే మా నాన్నమ్మ ఓ సామెత వాడుతుంది.అద్దానికి హారతిచ్చినట్టు చేసింది అని..నేను దాన్ని ప్రత్యక్షంగా చేస్తే ,మా ఇంట్లో పిచ్చిదాన్నీ చూసినట్టు చూస్తారు.ఇపుడు ఆలవాటయిపోయింది ఆంతటికీ.

ఇంత చేస్తున్న నన్ను,ఐదేళ్లు వరకూ అద్దంలో చూసుకొనివ్వలేదు అమ్మ.మగాడి జేబులో దువ్వెన,ఆడదాని చేతిలో అద్దం విజయం మీద శ్రద్హ తగ్గిస్తాయని నాన్నగారు సింహంలా గర్జించేవారు..ఆ మాటలు రోజూ అలవాటయి,ఎపుడైనా వినిపించకపోతే,సరదాగా అద్దం ముందుకు వెళ్ళేదాన్ని,అందులో నరసింహవాతారంలో నాన్నగారు కనిపించేవారు..

ఆరుకు వచ్చేక,నీ జడలు నువ్వే వేసుకోవడాం నేర్చుకో అంది అమ్మ..రెండు జడలకి పాపట తీసి ఇచ్చేది,ఇంక ఓ గంట జళ్ళతో కుస్తీ పట్టేదాన్ని.అమ్మ వేసినట్టు పాయ లేకుండా వచ్చేది కాదు..విప్పి,మళ్ళీ దువ్వి మళ్ళీ వెయ్యడం...మొదట్లో చేతులు లాగేసివి..రిబ్బన్ కడకంట అల్లి,పైకి మడతెట్టి ముడేసి నాన్నమ్మ దగ్గరికి పరిగెత్తేదాన్ని..కుచ్చెళ్ళు పెట్టమని.

టెన్త్ లో ఉండగా మా సోషల్ సర్,తెలుగు సర్ రాలేదని ఆ పీరియడ్ తీసుకున్నారు.ఆయన సబ్జెక్ట్ కాకపోతే వేరే పుస్తకాల్లో చదివిన ,ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పేవారు..ఆ రోజు అద్దం,టూత్ పేస్ట్ ఉపయోగించేవారి లో రకాల గురించి వివరించారు.

పేస్ట్ని నెమ్మదిగా కిందన్నించి పైకి జరుపుతూ..

ఎప్పటికపుడు కింది భాగాన్ని సమతలంగా ఉంచాలట..అపుడు ప్రతివిషయం పై శ్రద్ద,ఆసక్తి,శుభ్రం కూడా పెరుగుతాయట..ఇంక అద్దం అన్నీ నిజాలు చెబుతుంది.ఓ నిమిషం అద్దం ముందు నుంచుంటే ..సరైన ముఖం ప్రత్యక్షమౌతుంది.లేకపోతే మరింత అందంగా కనిపిస్తున్నానా లేదా,ఇంకా అందంగా కనిపించాలంటే ఎం మెరుగులు దిద్దాలి అనేది చెబుతుంది..కానీ ఎన్ని చేసినా పొద్దున్నే లేవగానే అద్దంలో చూసుకుంటే కనపడే ముఖమే,మన అసలైన ముఖం అంట.

ఇంకా నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్న కొత్త.నాన్నగారు స్పీకింగ్ కోర్సు కి పంపించేరు.భాష అయితే వచ్చింది కానీ ముఖంలో ఆ మార్పు కనిపించడం లేదు అన్నారు..అదే నేను ఆ రోజు క్లాసులో అడిగినప్పుడు ,ఓ పదినిమిషాలు మాట్లాడ్డం అనే అభ్యాసం నీలో నువ్వు అద్దంతో కలిసి చెయ్యి అన్నారు..అప్పుడు నీ దృష్టి ముందు కూర్చున్న జనం మీద ఎలా ఉండాలో చెబుతుంది అన్నారు.వాళ్ళ ముఖంలో మార్పుల్ని బట్టి,ఉపన్యాసం లో ఉత్సాహం పెంచాలా,వద్దా అన్నది తెలుస్తుంది అన్నారు.. ఆ రోజు నుంచి క్లాసులో ఇచ్చే అంశం మీద ఓ అయిదు లైన్లు,డిక్షనరీ సహాయంతో రాసుకుంటూ..అద్దం లో చూస్తూ చెప్పేదాన్ని..

సార్ చెప్పిన మాట అక్షరాలా నిజం అని,ఫేర్వెల్ పార్టీ అపుడు నా స్పీచ్ లో విశేషమైన మార్పు..కిందనుంచి చూస్తున్నవాళ్ళలో ఇంకా ఎం చెబుతుంది అని చూడాలనే ఆత్రుత,వారికి నచ్చిందా ,నవ్వు తెప్పించిందా అనే అంశాలు చూసుకుంటూ..మధ్యలో నేను రాసుకున్న స్పీచ్ కన్నా,అయిదు నిమిషాలు ఎక్కువే మాట్లాడేను..అపుడు వచ్చిన మార్పుకి, ఫేర్వెల్ పార్టీ లోఎప్పుడూ ఐదో స్థానంలో ఉండే నేను మొదటి స్థానానికి చేరేను.

ఆరోజు వచ్చిన బహుమతి మా ఇంగ్లీష్ టీచర్ గారి హీరో గ్రీన్ ఇంకు పెన్ను..ఇప్పటిదాకా నాకు సేవలందించిన ఈ హీరో,ఈమెకు హీరో కాబోతోంది అని తెలుగులో మొదటిసారి మాట్లాడారు..ఆవిడ మా స్కూల్ హెచ్చెమ్ మరియు పదవతరగతికి మాత్రమే క్లాసుకు చెప్పేవారు..ఆవిడ నడుస్తుంటే భూమి ఆదిరినట్టు,

సూర్యుడే మేఘాల చాటు దాక్కున్నట్టు,అమ్మా!రాయసీమలో వర్షం కురవమంటారమ్మా అని మేఘాలు ఘర్జన మాని చేతులు కట్టుకుని ఆడిగినట్టు ఉండేది..

ఓ రోజు సాయంత్రం, నా తళ తళలాడే అద్దంపై మరక చూసేను..అస్సలు నచ్చలేదు.ఏదో చెడు అయితే ఆనిపించలేదు.నన్ను ఎక్కడో సరిదిద్దుకోవలన్నమాట అనిపించింది..

ఆ రాత్రి ఎనిమిదింటి వరకూ ఆలోచించేను..కారణం గుర్తు రావట్లేదు.ఎం ఉండి ఉండదులే అనుకున్నాను..అదే సోయతో నిద్రపోయాను.

నాకు ఈ చిన్న చిక్కుముడి విప్పి పెట్టావంటే,నీలాగే నేనూ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాను.ఇంకొభాష వచ్చు అన్న ధీమా ఉంటుంది.పైగా మా తమిళ్ భాష నీకు నేర్పుతాను అంది అరుణ.తాను మా సిటీ కి కొత్తగా వచ్చిన ఎస్బిఐ బ్యాంకు మేనేజర్ గారి అమ్మాయి.అందం,చురుకుగా,

మంచి దస్తూరి,పైగా అన్ని ఆటల్లో మొదటి స్థానంలో ఉంటుంది..క్లాసు వేరైనా,స్వయంగా తానే డ్రిల్ల్ క్లాసులొ వచ్చి అడిగింది.వారం నుంచి బ్రతిమాలుతుంది.నాకు ఎలా కుదురుతుంది?ఇంగ్లీష్ క్లాసు,తరువాత లెక్కల ట్యూషన్,తర్వాత నేనే అయిదుతరగతుల పిల్లలకీ,అన్ని సబ్జెక్టుల ప్రైవేట్ చెప్తాను.వాళ్ళు మా సందులో ఓ పదిమంది ఉన్నారు..ఎలా కుదురుతుంది?చెప్పేను అరుణతో..

సరే!అంది కానీ తనకి నా దగ్గర నేర్చుకోవలన్న ఇష్టం ఉంది.అది పట్టుదల కాదు అని తెలుస్తుంది..

కానీ తాను ఈ రోజు ఎందుకు నా వంక చూసి నవ్వుతుంది!?పిచ్జిగా...తెరలు తెరలుగా...

బాబోయ్!అరిచేను తట్టుకోలేక ,చుట్టు అమ్మ,నాన్న,నాన్నమ్మ,తాతయ్యా...

ఏమైంది!?పిచ్చికల ఏమైనా వచ్చిందా!పొద్దస్తమానూ అద్దంలో చూసుకోవద్దు అంటే వినవే...రాత్రుళ్ళూ మురుసుకుంటావ్ ఆ మొహాన్ని చూసుకుని...ఉప్పు దిష్టి తీసింది అమ్మ.

పొద్దున్నే శుభ్రన్గా స్కూల్ కి తయారవుతుంటే,అరుణ గుర్తొచ్చింది.ఇవ్వాళ తనకి సరే!చెప్పాలి..అనుకుంది

అద్దంలో చూసుకుంది..ఇపుడు మరక కనిపించలేదు అద్దంపై.నువ్వు అద్దం శుభ్రం చేసేవా!?ఇంట్లో అందర్నీ అడిగింది.ఎవ్వరూ లేదే!అన్నారు.

మరైతే మరక ఎక్కడకి పోయింది..

ఆదసలు ఇపుడునీలోనే లేదు.మరి ఎలా కనిపిస్తుంది..లోపలనుంచి మనసు చెబుతోంది..నేను నిన్ను సరిగ్గా చూపించకపోతే,మరెవరు చూపిస్తారు..అద్దం నవ్వింది..కాదు మనసు.

కాదు కాదు అద్దం లాంటి మనసు



Rate this content
Log in

Similar telugu story from Abstract