Chethana Muppuri

Drama

1  

Chethana Muppuri

Drama

ఆత్మ

ఆత్మ

1 min
123ఒకానొక కాలంలో ఒక రాజుకు నలుగురు భార్యలు ఉన్నారు.

రాజు గారు తన మలిదశలో ఉన్న రోజుల్లో.......... "నేను చనిపోయిన తర్వాత ..... వేరొక లోకానికి నాతోపాటు ఎవరు వస్తారో తెలుసుకోవాలి "అని అనుకుంటారు.


     రాజుగారు నాల్గవ భార్యను పిలిచి "నువ్వు నాకు అత్యంత ప్రియమైన భార్యవి. నేను చనిపోయిన తర్వాత నువ్వు నాకు తోడుగా వేరొక లోకానికి వస్తావా " అని అడుగుతారు.


  నాల్గవ భార్య "నన్ను క్షమించండి " అని చెప్పి,వెళ్ళిపోతుంది.


      

రాజు గారికి మూడవ  భార్య అంటే కూడా  చాలా ఇష్టం. మూడవ భార్యను చూసుకొని చాలా గర్వపడేవారు. రాజుగారు వేరే రాజ్యాలకు విందులకు వెళ్ళినప్పుడు , మూడవ భార్య ను వెంట తీసుకెళ్తు ఎంతో బాగా చూసుకునే వారు.     

ాజుగారు మూడవ  భార్యను పిలిచి "నువ్వు నాకు అత్యంత ప్రియమైన భార్యవి. నేను చనిపోయిన తర్వాత నువ్వు నాకు తోడుగా వేరొక లోకానికి వస్తావా " అని అడుగుతారు.


  

      అప్పుడు మూడవ భార్య " నాకు నా జీవితం అంటే చాలా ఇష్టం. మీరు చావులో మీకు తోడు రమ్మంటున్నారు.... కానీ మీరు చనిపోయిన తర్వాత నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను" అని చెప్తుంది.రాజు గారి రెండవ భార్య, యుద్ధాలలో...... ఏవైనా సలహాలు ఇవ్వాల్సిన సమయాలలో...... ఇలా రాజుగారికి అవసరమైన ప్రతి సమయంలో రాజుగారికి తన సహాయ సహకారాలు అందిస్తూ ఉండేది.


రాజుగారు రెండవ భార్యను పిలిచి "నువ్వు నాకు అవసరమైన అన్నీ సమయాలలో తోడుగా ఉన్న  భార్యవి. నేను చనిపోయిన తర్వాత కూడా  నువ్వు నాకు తోడుగా వేరొక లోకానికి వస్తావా " అని అడుగుతారు.     అప్పుడు రెండవ భార్య " రాజా ! నన్ను క్షమించండి . ఈసారి నేను మీకు తోడుగా రాలేను. నేను చేయగలిగిందంతా మీ అంత్యక్రియలను నేను దగ్గరుండి మరి జరిపించగలగడం " అని చెప్పి అక్కడి  నుండి వెళ్ళిపోతుంది.

   

   అదే సమయంలో బయట నుండి " నేను మీతోపాటు వస్తాను. మీరు ఏ లోకంలో ఉన్న సరే..... నేను మీతోపాటు ఉంటాను " అని కన్నీరు పెట్టుకుంటూ చెప్తుంది.


     రాజుగారు బయటకు చూసి..... కంటి నుండి నీరు కారుతుండగా తన మొదటి భార్యతో " నన్ను క్షమించు...... నేను బ్రతికున్న ఇన్నిరోజులు నిన్ను బాగా చూసుకోవాల్సింది " అని చెప్పి చాలా బాధపడతాడు.

   

     మనలో ప్రతి ఒక్కరికి 1. మన శరీరం

2.మన వస్తువులు, మనం అనుభవించే భోగభాగ్యాలు

3.మన కుటుంబం, స్నేహితులు, బంధువులు

4.మన ఆత్మ

అనే నలుగురు భార్యలు ఉంటారు.

      మనం మన శరీరానికి ఖరీదైన బట్టలు , బంగారం ధరించాలనుకుంటాం. మన శరీరాన్ని ఎంతో అపురూపముగా చూసుకుంటాం. కానీ మన శరీరం చావులో మనకు తోడురాదు.


 మనం ఎంతో ఇష్టంగా కొనుకున్న వస్తువులు, మనం అందరిలో గర్వంగా చూపిస్తాము. అవి మనతోపాటు రావు. మనం చనిపోయిన తర్వాత వేరొకరికి దగ్గరకు చేరుతాయి.

     

      

       మన కుటుంబం, స్నేహితులు, బంధువులు మనకు అన్నీ సమయాలలో తోడుగా ఉంటారు. మనం చనిపోయిన తర్వాత మన అంత్యక్రియల జరిపిస్తారు కానీ చనిపోయిన తర్వాత తోడు రారు.


   మనం చనిపోయిన తర్వాత కూడా మనతో తోడుగా వచ్చేది మన ఆత్మ. కానీ మనం మనం మన  శరీరాన్ని అలంకరించి, మన వస్తువులను అందరిముందు ప్రదర్శించడానికి ఇష్టపడతాం. మన కుటుంబంతో, స్నేహితులతో గడపడానికి ఇష్టపడతాం. కానీ మనగురించి మనం అస్సలు పట్టించుకోము. సంగీతం వినో, ధ్యానం చేసే మన ఆత్మను మనం సంతోష పరుచుకోవాలి. మనసుకు ఆనందాన్నిచ్చే పనులు చేయాలి.


   స్నేహితులతో, కుటుంబంతో సంతోషంగా గడపాలి, ఇష్టమైన వస్తువులు కొనుక్కోవాలి. మనకు నచ్చినట్టు మన శరీరాన్ని అలంకరించుకోవాలి. అలాగే మన ఆత్మకు ఆత్మసంతృప్తినిచ్చే కార్యాలు చేయాలి. అప్పుడే మనం జీవితాన్ని ఎలాంటి నిరాశ, విచారం లేకుండా ఉండగలం. 


Rate this content
Log in

Similar telugu story from Drama