శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Comedy Drama

4  

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Comedy Drama

ఆన్లైన్ గేమింగ్

ఆన్లైన్ గేమింగ్

2 mins
237


ఆన్లైన్ అంటే లైవే కదా!హమ్మయ్యా!ఇహ మొదలెట్టచ్చు...


శ్రీసూర్యనారాయణా వేదపారాయణా లోకరక్షామణి..సుబ్బమ్మత్త ఆర్తిగా స్మరిస్తోంది సూర్యుడ్ని..


అల్లదిగా సుబ్బమ్మత్తో!అందుకే లోక రక్షణకే బైదేల్లతన్న...సూరయ్య మావ కొంపలో లేడా!?

సైకిల్ దిగకుండానే అడిగేడు బొడ్డుసత్తియ్య.


పిల్లా పీసా...నీ ఎదాన కారంపొయ్యా!ఎక్కడి చిప్ప మొహంరా!అది..కుళ్ళుమోతు రత్తమ్మ కొబ్బరికాయ కొట్టినా చంద్రుడు తిన్నట్టయినా ఉంటుంది.నీ మొహమేరా అలా కోతిపుండులా ఉంటది..

సూర్యపారాయణ కాస్తా సత్తియ్యదూషణపర్వంలా మారింది.


నీ అభిమానమే ఏరత్తా! మావ నడుసుకుంటా రాలేడని,రాజుబావ సైకిల్ అంపేడు ..నాకెవన్నా పొద్దు పొద్దున్నే ఖాళీ అనుకుంటన్నావేటీ?రాంపారం పోయి ప్యాకెట్లుకి ముందు లైన్లో నుంచోవాలా?నాదగ్గర ఎమ్మెల్యే రెకమండేసను ఉందని తెలిసినా,అందరితో పాటే లైన్లో అంటాడు ఆ దొబ్బుమాలిగాడు(యాసలో అంతర్భాగము 🙏)!


ఆడు సెప్పేది నిజవే కదా!అయినా పొద్దున్నే ప్యాకెట్లుతో పనేటిరా నీకు అతుకులసత్తిగా!తులసి ప్రదక్షిణ చేస్తూ అడిగింది సుబ్బమ్మ


ఏటీ!పేకెట్టు అంటే తాగే పేకెట్టు అనుకున్నావా!?భలేదానివే సుబ్బమ్మత్తా!ఆన్లైన్ (పొద్దంతా) ఆటాల పేకెట్టు..ఎదవ మనిషికి రెండే ఇత్తన్నాడు.ముల్లి మందే అయినా నిక్కు కొడతాడు..


అదేటది!?నీ దినం రోజుకి అరిసెలు వండోద్దని సెప్పల్రా సత్తిగా!అమావాస కాకిలా సూరుకే ఎలాడి కొట్టుకు సత్తావ్!ఉంకో జనమ ఉండదు నీకు..పోసుకోలుఎదవ


అత్తా!ఇంత పొద్దున్నే దీవేనాలు ఒద్దు కానే,పూజ అయిపోయినట్టుంది తీర్దమ్ ఇచ్చేత్తావేటి!?


నీలాటి పాసిపల్లోడికి తీర్దమ్ ఇత్తె,రేపొద్దు నే పోయేటప్పుడు నోట్లో తులసినీరు పొసీదిక్కు ఉండదురా

పసరపాముసత్తిగా!ఇలాగ పచ్చని కాపురాల్ని మెలేసుకు ఉండిపోపోతే,ఓ పిల్లని దత్తత తీసుకుంటే బాద్యత ఏడిసేది..హారతి ఇచ్చేసింది..


ఏటే!నాకింకా ముప్పయ్యే!పెళ్లయి మొన్న సంక్రాంతికి పదహారో ఏడొచ్చింది.నా భాగ్యమతి పెళ్ళాం పుష్పవతయ్యే పదేళ్ళన్నా అవలేదూ!?దాన్ని గొడ్డుది అంటే పడేదిలేదు సుబ్బత్తా!,కొంచెం ఎమోషన్ అయ్యాననుకున్నాడు.


ఏడిసేవులేరా సత్తిగా!ముహుర్తాలు లేని పెళ్లి అలాగే ఏడుత్తది..ఈ ఊర్లో దాన్ని అనీవొడేవడూ?అంతా నీ ఘనకార్నెమే కదా!అవును కానేరే!పిల్ల నీళ్లొసుకుంటే నీ వయసు ఎలా ముదిరిపోద్దిరా!సోంబేరి వెధవ..దాని కడుపు తీయించేదాకా అల్లల్లాడిపోయేవ్..ఆపిల్ల పైకి పోయెచ్చింది..దాని ఉసురుకె నీ వంశం నిలబడలేదు...


సరేలే!సెకలొద్దు గానే,ఇపుడు మావని అంపుతావా లేదా!?నాకు లేటయిపోద్ది.ఫస్ట్ కంటా రౌండ్ లో నా పేరుండాపోతే మాసేడ్డా సిరాకు నాకు!,ఆదిపర్వం టయిము నీకాడే అయిపోయింది..మావోయ్!మావా!ఒరేయ్ మావోయ్!మావా....అరుపు లంకించుకున్నాడు..


ఆపరా దున్నపోతా!ఏనాడంటా ఏకాదశి రోజున ఉపాశం ఆపిచ్చిమరీ తీసుకెళ్లేఓ అప్పటినుంచి ఆ మారాజు మీమంద దగ్గరకి ఆలస్యంగా వొచ్చిందే లేదు..


అంటే ఏటత్తా!మావ!!!


ఇలా టీ తాగి డ్యూటీ ఎక్కేసేడు.ఇలాటప్పుడు కాళ్ళు నెప్పులు గుర్తొత్తయ్య!?నీ జిమ్మడిపోను...


సర్లే మరి!ఎల్లోత్త...తీరిగ్గా అరుగు మీద కూకుని తిట్టుకో!,నాకు లేటయిపోయింది..నిన్నూ..సైకిల్ తిన్నగా పోనిచ్చేడు...


సూరయ్య మావ ఎక్కడున్నాడురా!అరగంట పైనే తినేసింది నా టయిం,.వొచ్చేదప్పుడు సెప్పొద్ద మావా!నా వంశానికి కూడా తలనీళ్లొసి అంపింది..నువ్వు ఈ లైన్లో ఆడనాకి ఈల్లేదు సత్తియ్య కోప్పడ్డాడు.


అలా అనకు అల్లుడూ!ఇయ్యాల మీ అత్త ఏకాదశని కేజీ కుంకుళ్ళు నానోసింది.దాంతో నా ఒళ్ళు హూనం చేసేద్ది..ఎన్నీళ్ళు,కొంకుళ్ళు,నలుగు కలిత్తే ఓ వారందాకా మత్తొదలదురా!అందుకే ఆవిడ స్నానానికి పోగానే పరిగెత్తుకొచ్చా!ఇది లేకుండా నేనుండలేంరా..బతిమాలుకున్నాడు మావ


సర్లే!అంతా వొచ్చేక మీ ఎదవ సోదేటి!?అసలుకే ఏడయిపోయింది...లచ్చమ్మా!ఓ ఇరవై టీలు సెప్పు ముందు...అంతే!మొదలయింది..మొట్టమొదటి ఆన్లైన్ గేమ్ అనబడే పేకాట..


తెల్లారితే వాళ్ళ నోటినుంచి వచ్చే ఊసు ఒకటే!,ఎంత ఎయిటింగ్ సేసినా..పొద్దెక్కుతుల్లేదేటిరా బాబో!


అందరికి సామూహిక అత్తారిల్లు ఉంటుంది..అక్కడి నుంచి ఓ బామ్మర్ది వచ్చి చెంప పగలగొడతాడు..


అంతే అంతా సోయలోకి వచ్చి చాలా సీరియస్ గా "థాంక్స్"చెప్పేసి ఇళ్లకెళ్లి ఫ్రెష్ అవుతారు..మళ్ళీ ఆన్లైన్ కి



Rate this content
Log in

Similar telugu story from Abstract