యుద్ధం
యుద్ధం


యుద్ధం ముందు పుడుతుంది
తరువాత మనం పుడతాం
తల్లికడుపులోనే మొదలవుతుంది యుద్ధం
యుద్ధం అన్నీ నేర్పిస్తుంది
గెలుపుతోసహా
అయితే ఎవరు మిత్రులో
ఎవరు శత్రువులో పోల్చుకోవడానికి
జీవితకాలం సరిపోదు
అయినా ఎంతో కొంత యుద్ధం చెయ్యాలి
బతకడానికి
యుద్ధం అయిపోయిన తరువాత
యుద్ధంలో దివ్యత్వం తెలుస్తుంది
ఎవరో చెప్పిందాక మనం
ఏ శిబిరంలో ఉన్నామో తెలియదు
యుద్ధం చేసినవాళ్లు ఎక్కువ మంది ఉంటారు
శాంతిని అనుభవిస్తున్న వాళ్లు తక్కువ మంది ఉంటారు
యుద్ధం-శాంతి మధ్యలో జీవనచక్రం ఇరుక్కుని
ఇది మాయ అంటుంది
ఏది మాయ?? .....