STORYMIRROR

Changalvala Kameswari

Classics

4  

Changalvala Kameswari

Classics

వెన్నెల వెలుగుల హోలీ

వెన్నెల వెలుగుల హోలీ

1 min
413


వెన్బెల వెలుగుల హోలీ


రంగులు కనుదోయికి కమనీయాలు

ఎన్నెన్ని వర్ణాలో అన్నన్ని అందాలు


ఏడురంగులూ ఏడేడు వింతలు

అన్నరంగులూ ఆకర్షణీయాలే!


రంగులమయం కాంతల సోయగాలు

వెల్లివిరిసే ఆనంద సందోహాలు


నల్లని వాలు జడకు పూల పరిమళాలు అద్ది

కలువ కనులకు నీలాల తళుకులు దిద్ది


బుగ్గలకు సిగ్గుల గులాబీ రంగు అద్ది

పెదవులకు నారింజ మధురిమలద్ది


చిరునవ్వులో తెల్లని వెలుగులద్ది

నగల నాణ్యాలకు పసిడి మెరుపులద్ది


మేనికి మీగడరంగు తరకలద్ది

పాదాలకు వెండి పట్టీల రవళినద్ది


ధవళకాంతుల వివిధ వర్ణాల

మేళవింపు పట్టువస్త్రాల సొబగులద్ది


హరివిల్లులాంటి అందాలతివలొస్తే

వాడంతా కాదా రంగులరంగేళి


పగలే వెన్నెల కురిపించే పడుచుపిల్లలేగా

హోళికా పౌర్ణమి వెన్నెల వెలుగుల హోలీ


చెంగల్వల కామేశ్వరి

9849327469 

Show quoted text--

Best Regards,Team StoryMirrorStoryMirrorM : +91 22 49243888 / 49240082


Rate this content
Log in

Similar telugu poem from Classics