తపన by M.Aditya Chandra Mouli
తపన by M.Aditya Chandra Mouli
చెప్పులు అరుగుతున్నాయి, అయినా ఆశ చావలేదు ,
రోజులు గడుస్తున్నాయి , అయినా ఆశ చావలేదు ,
హృదయం రగులుతుంది , అయినా ఆశ చావలేదు ,
రూపం లేని రేపు వెక్కిరిస్తుంది , అయినా ఆశ చావలేదు ,
ఎదురుచూపుల ఆయుధాలతో , ప్రతిక్షణం పోరాడుదాం ,
నీలో నీతో జరిగే యుద్ధం లో , ఓడిపోకు మిత్రమా , అలసిపోకు నేస్తమా ,
ఏదో ఒక రోజు , ఏదో ఒకరోజు , నీరోజు అవుతుంది , నీ ఆశల ఆశయానికి,
నీ తపనే నిన్ను రాజుని చేస్తుంది .