తారాతీరం...
తారాతీరం...
దట్టమైన చీకటిలో
మంచుతెరల వాకిటిలో
ముంచే నిశ్శబ్దం ..... మనసులోని మౌనం
ముడుచుకున్న పెదవుల్లో
చిరునవ్వు ఎరుగని కధలో
గాఢాంధకార హృదయంలో
మెరిసే ఓ చిత్రం ..... అర నిమిషపు సౌందర్యం
అది నీ స్మ్రతుల కలయికే అయితే
ఎద శృతుల కలయికే అయితే
మాటాడిందా మౌనం
గళమెత్తిందా నీ జ్ఞాపకం
శ్యామల గగనంలో మిణుకుమన్నది
తారాతీరం ..... సుదూరం
... సిరి ✍️