స్నేహ గీతిక
స్నేహ గీతిక


ప్రభాత సమయాన చీకట్లు పారద్రోలు వెలుగు కిరణంలా !!
చిమ్మచీకటిలో దారి చూపు వెన్నెల క్రాంతి పుంజంలా !!
నిండు వేసవిన మండుటెండలో దాహార్తి తీర్చు నీటి బొట్టులా !!
జోరువానలో నడిసంద్రాన చిక్కిన నావకు చుక్కానిలా !!
స్నేహనికి రూపమై..స్నేహ గీతికకు గాత్రమై ..
అన్ని వేళలా అండగా ఉండే ఓ నేస్తమా !!
నీకు ఇదే నా అక్షర మందార మాల !!